సోలో హీరోగా సరైన సినిమా చేయలేకపోయాడు. ఆఖరికి రీమేక్ దృశ్యం ఆదుకుంది. మల్టీస్టారర్ లే అచ్చొస్తాయని అటు వెళ్లాడు వెంకీ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని వెంకీ వర్గాలు బాధపడ్డట్టు అప్పట్లో వార్తలు వినవచ్చాయి.
మసాలా సినిమా చేసాడు రామ్ తో కలిసి. కానీ ఈ సినిమాలో రామ్ ను పక్కన పెట్టి వెంకీకి పెద్ద పీట వేసారు. సినిమా ఇంటికెళ్లిపోయింది. ఇప్పుడు గోపాల గోపాల చేసారు. ఎలాగోలా కిందా మీదా పడి, పవన్ కు నిర్మాణంలో వాటా ఇచ్చి మరీ ఒప్పించారు.
కానీ సినిమా విడుదలకు ముందు రోజు నుంచి ఇద్దరు నిర్మాతలు శరద్ మురార్, సురేష్ ల నడుమ విబేధాలు పొడసూపాయని వినికిడి. అంటే ఇక పవన్ తో అయిపోయినట్లే. తాజగా నాగార్జున తో కలిసి చేస్తారని టాక్. అది అంత సులువుగా వర్కవుట్ అవుతుందా అన్నది అనుమానం.
ఎందుకంటే సురేష్ మూవీస్ వ్యవహార శైలి నాగ్ కు కొత్త కాదు కదా. మరి ఇంక యువ హీరోలు ఎవర్ని పట్టుకుంటారో వెంకీ ఈసారి.