ప్రదీప్ కారులో పొలిటీషియన్ కూతురు?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరారీలో ఉన్నాడు. ఆఖరి రోజైన ఈరోజు కూడా కౌన్సిలింగ్ కు హాజరుకాలేదు ప్రదీప్. మరోవైపు అతడికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ట్రాఫిక్…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పరారీలో ఉన్నాడు. ఆఖరి రోజైన ఈరోజు కూడా కౌన్సిలింగ్ కు హాజరుకాలేదు ప్రదీప్. మరోవైపు అతడికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ట్రాఫిక్ పోలీసులకు కూడా అతడి ఆచూకి లభ్యంకాలేదు. మణికొండలోని నివాసం వద్ద, కూకట్ పల్లిలోని ఆఫీస్ దగ్గరా ఎక్కడా ప్రదీప్ ఆచూకి దొరకలేదు. దీంతో ప్రదీప్ కనిపించడం లేదంటూ నివేదిక ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు.

ఒకవేళ ప్రదీప్ కనిపించడం లేదని ట్రాఫిక్ పోలీసులు నివేదిక ఇస్తే, కేసు సివిల్ కు బదిలి అవుతుంది. ప్రదీప్ ను వెదికి కోర్టు ముందు హాజరుపరిచే బాధ్యతను సివిల్ పోలీసులు తీసుకుంటారు. డిసెంబర్ 31రాత్రి తప్పతాగి కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు ప్రదీప్. బ్రీత్ ఎనలైజర్ లో 170కి పైగా పాయింట్లు చూపించింది. అంటే మోతాదుకు మించి తాగేశాడని అర్థం.

ఎంత తాగినప్పటికీ సకాలంలో కౌన్సిలింగ్ కు హాజరై, కోర్టు ముందు తప్పు ఒప్పుకుంటే జరిమానాతో అంతా ముగిసిపోయేది. కానీ కనిపించకుండా పోవడంతో మరో కొత్త కేసుకు ఆస్కారం ఇచ్చినట్టయింది. దీనికి తోడు కారు అద్దాలకు బ్లాక్ షీట్ కూడా వేయించాడు. ఇదొక కేసు.

ప్రదీప్ పట్టుబడినప్పుడు వార్తాఛానళ్లలో అదే టాప్ న్యూస్ అయింది. కాకపోతే కొన్ని గంటల గ్యాప్ లోనే గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు తెరపైకి రావడంతో ప్రదీప్ మేటర్ సైడైపోయింది. సరిగ్గా అదే టైమ్ లో ప్రదీప్ కౌన్సిలింగ్ కు హాజరైనట్టయితే మీడియా కంటపడకుండా విషయం సజావుగా జరిగిపోయేది.

కానీ కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం అతడు ఏ టీవీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. దీంతో పలు టీవీ కార్యక్రమాలు ప్రత్యామ్నాయాలు చూసుకున్నాయి. మరోవైపు ఆరోజు రాత్రి ప్రదీప్ నడుపుతున్న కారులో అతడితో పాటు ఓ రాజకీయ నాయకురాలి కుమార్తె కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరనే విషయంపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి.