పదేళ్ల పాటు సేవ చేయించుకుని, ఎన్నికల సమయానికి ఇతర పార్టీ నాయకుడికి పవన్ టికెట్ అమ్ముకున్నాడని విజయవాడ వెస్ట్ జనసేన ఇన్‌చార్జ్ పోతిన మహేశ్ మనస్తాపం చెందారు. పవన్‌కల్యాణ్‌కు దండం పెట్టి జనసేనకు రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌కు పోతిన సంధించిన ప్రశ్నలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై పోతిన కీలక నిర్ణయం తీసుకున్నారు. మాట ఇస్తే తప్పని నాయకుడు, సంక్షేమ పాలన అందిస్తున్న పాలకుడి నాయకత్వంలో పని చేస్తానని పోతిన మహేశ్ చేసిన కామెంట్స్ ఆయన రాజకీయ పయనం ఎటు వైపే చెప్పారు. ఈ పరంపరలో ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పోతిన మహేశ్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
పోతిన మహేశ్ చేరికతో విజయవాడ వెస్ట్‌లో వైసీపీకి రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగించనుంది. మరీ ముఖ్యంగా బీసీ సామాజిక ఉద్యమాల్లో పని చేసిన పోతిన మహేశ్ రాకతో ఆ కులాల్లో వైసీపీపై మరింత సానుకూలత ఏర్పడే అవకాశం వుంది.
ఇదే సందర్భంలో జనసేనపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి జరగనుంది. జనసేన ఎవరి కోసం పని చేస్తున్నదో పోతిన మరింత వివరంగా చెప్పి, ఆ పార్టీపై ప్రజావ్యతిరేకతను తీసుకొచ్చేందుకు ఉపయోగపడనున్నారు. పోతిన వైదొలగడంతో జనసేనకు కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు.