ఎన్టీఆర్ మీటింగ్..పారా హుషార్!

తన బావమరిది వన్ ఆఫ్ ది హీరోగా నటించిన మ్యాడ్ సినిమా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు ఎన్టీఆర్.

తన బావమరిది వన్ ఆఫ్ ది హీరోగా నటించిన మ్యాడ్ సినిమా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు ఎన్టీఆర్. చాలా కాలం అయింది ఎన్టీఆర్ పబ్లిక్ లోకి వచ్చి. ఇప్పుడు పబ్లిక్ లోకి వస్తున్నారు. ఫ్యాన్స్ మామూలుగా వెయిట్ చేయడం లేదు.

ఇలాంటి టైమ్ లో బయటకు వస్తున్నారు ఎన్టీఆర్. మళ్లీ ఇప్పట్లో వచ్చే అవకాశం తక్కువ. కళ్యాణ్ రామ్ సినిమా ఫంక్షన్ కు వస్తారో..రారో తెలియదు. దానికీ వస్తారని అంటున్నారు. అయినా ఎన్టీఆర్ ను బయట చూడాలనుకునే ఫ్యాన్స్ ఈ పంక్షన్ కు పెద్ద ఎత్తున రావడం ఖాయం.

తెలంగాణ పోలీసులు ఇటీవల ఓపెన్ గా జరిగే సినిమా ఫంక్షన్లకు అంత సులువుగా అనుమతి ఇవ్వడం లేదు. థియేటర్లు,హోటళ్లలో జరిగే వాటికి కూడా ముందుగా అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఎఎంబి లాంటి రద్దీ ప్రదేశాల్లో వున్న థియేటర్లలో ఫంక్షన్ లకు అంత సులువుగా అనుమతి రావడం లేదు. సంధ్య థియేటర్ తరువాత పరిస్థితులు మారాయి. పబ్లిక్ లోకి పెద్ద హీరోలు రావడం తగ్గింది. అనుమతులు తగ్గాయి.

ఇప్పడు ఎన్టీఆర్ ఫంక్షన్ కు శిల్పకళావేదిక లాంటి క్రూషియల్ ప్లేస్ లో సభకు అనుమతి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయమే. ఇక మీదట మిగిలిన హీరోల ఫంక్షన్ లకు కూడా ఇలా అనుమతి ఇవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. ఒకరికి అనుమతి ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోవడం సరి కాదు కదా.

కానీ ఒకటే పాయింట్. పోలీసులు బలంగా మోహరించాల్సి వుంటుంది. ఐటి సంస్థలు అన్నీ అక్కడే వున్నాయి. కుర్రకారు అంతా అక్కడే వున్నారు. ఇప్పుడు వేలాదిగా శిల్పకళావేదిక కు తరలి వస్తారు. వారందరినీ కంట్రోలు చేయగలగాలి. పైగా అదే టైమ్ లో ట్రాఫిక్ ను కూడా కంట్రోలు చేయాలి. పోలీసులుకు అతి పెద్ద టాస్క్ అది.

7 Replies to “ఎన్టీఆర్ మీటింగ్..పారా హుషార్!”

  1. అన్నిటికీ తగుదునమ్మా అని నువ్వు ఉన్నావుగా నీ ప్రైవేట్ ఆర్మీతో ట్రాఫిక్ నీ కంట్రోల్ చెయ్. లేకపోతే నోరు మూసుకొని ఊరికనే ఉండు వాళ్ల తిప్పలే ఓ వాళ్లు పడతారు రా గ్యాస్ ఆంధ్ర

Comments are closed.