ఏప్రిల్ వచ్చింది.. హీరో పవన్ వస్తాడా?

కనీసం ఈ నెల్లోనైనా ఆయన సెట్స్ పైకి వస్తే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఓజీ సంగతి ఆ దేవుడికే తెలియాలి.

ఫిబ్రవరి అన్నారు, గడిచిపోయింది. మార్చి అన్నారు, వెళ్లిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది. ఈ నెల కూడా పవన్ సెట్స్ పైకి రాకపోతే, హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడడం ఖాయం.

ఈ సినిమాకు సంబంధించి కీలక నటీనటుల షెడ్యూల్స్ అన్నీ పూర్తయ్యాయి. తాజాగా బాబీ డియోల్ పై కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేశారు. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు.

ఇలా పనులు ఎంత ఫాస్ట్ గా సాగుతున్నప్పటికీ కీలకమైన ఓ బ్లాక్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. పవన్ రావాలి, దాన్ని పూర్తిచేయాలి. అది పూర్తయితే తప్ప సినిమా సిద్ధం కాదు.

ఆశ్చర్యంగా మరోవైపు యూనిట్ మాత్రం 2-3 రోజుల షూట్ మినహా సినిమా పూర్తయిందని చెబుతోంది. మే 9న కచ్చితంగా థియేటర్లలోకి వస్తామని అంటోంది. అటు చూస్తే పవన్ కల్యాణ్, పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు.

కనీసం ఈ నెల్లోనైనా ఆయన సెట్స్ పైకి వస్తే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఓజీ సంగతి ఆ దేవుడికే తెలియాలి.

6 Replies to “ఏప్రిల్ వచ్చింది.. హీరో పవన్ వస్తాడా?”

Comments are closed.