ఆంధ్రప్రదేశ్లో వామపక్షాల్లో స్పష్టమైన విభజన వుంది. సీపీఎం స్వతంత్రంగా వ్యవహరిస్తుంటుంది. కానీ సీపీఐ మాత్రం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తుంటుందనే ఆరోపణ వుంది. అమరావతి కోసం చంద్రబాబుతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కూడా జోలె పట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే, వెంటనే సీపీఐ నాయకులు రామకృష్ణ, నారాయణ మీడియా ముందుకొస్తుంటారు.
అందుకే వీళ్లిద్దరిని “కమ్మ”నిస్టు నాయకులని విమర్శిస్తుంటారు. రామకృష్ణ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. నారాయణ పేరుకే కమ్మనిస్టు గానీ, పచ్చి కులపిచ్చి కలిగిన కమ్మ నాయకుడని సీపీఐ నాయకులే ఆఫ్ ది రికార్డుగా విమర్శిస్తుంటారు. అందుకే ఆయనకు బీజేపీ నాయకులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతుంటారు.
ఇక చంద్రబాబునాయుడంటే రామకృష్ణ, నారాయణలకు వల్లమాలిన ప్రేమ. ఇక్కడ చంద్రబాబును మెచ్చుకోవాలి. వాళ్లిద్దరు కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని పక్కన పెట్టి తనను ప్రేమించగలిగారంటే బాబులో ఏదో ఆకర్షణ శక్తి వుందని చెప్పక తప్పదు. తన కోసం సిద్ధాంతాల్ని తుంగలో తొక్కిన రామకృష్ణ, నారాయణ త్యాగాన్ని బాబు వృథా కానివ్వలేదు. తన ప్రభుత్వం రాగానే వాళ్లపై అభిమానాన్ని చాటుకున్నారు చంద్రబాబునాయుడు.
రామోజీరావు సంస్మరణ సభను ఇవాళ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ రెండు అనుకూల పత్రికలతో పాటు సీపీఐ అనుబంధ పత్రిక విశాలాంధ్రకు కూడా చంద్రబాబు ప్రభుత్వం వాణిజ్య ప్రకటన ఇవ్వడం గమనార్హం. తన కోసం ఇంతకాలం రామకృష్ణ, నారాయణ పని చేసినందుకు ఈ రకంగా ప్రతిఫలాన్ని చంద్రబాబు సర్కార్ అందిస్తోంది మరి! ఇదే సీపీఎం అనుబంధ పత్రిక ప్రజాశక్తిని ఎండగట్టడాన్ని గమనించొచ్చు. తనను నమ్ముకున్నోళ్లను అన్ని వేళలా చంద్రబాబు ఆదుకుంటారనేందుకు విశాలాంధ్రకు ఇచ్చిన వాణిజ్య ప్రకటనే నిదర్శనం. చంద్రబాబుతో అంటకాగకపోవడం వల్లే సీపీఎంను దూరంగా పెట్టారు.