పుకార్లకు చెక్ పెట్టిన సమంత

గడిచిన 48 గంటలుగా సమంతపై మరోసారి పుకార్లు చెలరేగాయి. ఆమె మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిస్థాయి కోలుకోలేదని, ఇంకా చికిత్స కొనసాగిస్తూనే ఉందని ఆ కథనాల సారాంశం. అది నిజం కూడా. ఆమె…

గడిచిన 48 గంటలుగా సమంతపై మరోసారి పుకార్లు చెలరేగాయి. ఆమె మయొసైటిస్ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిస్థాయి కోలుకోలేదని, ఇంకా చికిత్స కొనసాగిస్తూనే ఉందని ఆ కథనాల సారాంశం. అది నిజం కూడా. ఆమె సైడ్ ఎఫెక్టుల నుంచి కోలుకునేందుకు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది.

ఇప్పటికే 10 నెలల పాటు సినిమాలకు దూరమైన సమంత, ఈ చికిత్సల వల్ల మరికొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇదే కోణంలో ఊహాగానాలు కూడా చెలరేగాయి. ఈ పుకార్లకు సమంత ఫుల్ స్టాప్ పెట్టింది.

ఈ నెల్లోనే సమంత సెట్స్ పైకి రాబోతోంది. ఇంకా చెప్పాలంటే మరో 10 రోజుల్లో ఆమె తన కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతోంది. అయితే అది తెలుగు సినిమా కాదు.

కెరీర్ లో తొలిసారి ఓ మలయాళం సినిమాకు సైన్ చేసింది సమంత. మమ్ముట్టి హీరోగా రాబోతున్న ఆ సినిమా షూటింగ్ ను ఈ నెల్లోనే ప్రారంభించబోతోంది ఈ హీరోయిన్. ఈ మేరకు తన తొలి మలయాళం సినిమాకు ఆమె కాల్షీట్లు కేటాయించింది. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకుడు.

ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించడం ద్వారా తను పూర్తిగా ఫిట్ గా ఉన్నాననే సంకేతాల్ని పంపించింది సమంత. తన సొంత ప్రొడక్షన్ కంపెనీపై సమంత చేయాల్సిన సినిమా మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. మమ్ముట్టి సినిమా కొలిక్కి వచ్చిన తర్వాత ఆ సినిమా విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.