ఫ్యాన్స్ – రికార్డులు.. రికార్డులు

కల్కి సినిమాతో నైజాంలో ఆర్ఆర్ఆర్ రికార్డును దాటేయాలని భావించారు ప్రభాస్ అభిమానులు. తమ హీరో సినిమా రికార్డు సాధించాలని వుంటుంది కదా. కానీ అలా జరగలేదు. కల్కి సినిమా నైజాంలో తొలి రోజు రికార్డుకు…

కల్కి సినిమాతో నైజాంలో ఆర్ఆర్ఆర్ రికార్డును దాటేయాలని భావించారు ప్రభాస్ అభిమానులు. తమ హీరో సినిమా రికార్డు సాధించాలని వుంటుంది కదా. కానీ అలా జరగలేదు. కల్కి సినిమా నైజాంలో తొలి రోజు రికార్డుకు రెండు కోట్లకుపైగా దూరంలో ఆగిపోయింది.

నిజానికి తెలుగు నాట కలెక్షన్లు ట్రాక్ చేసే వ్యవస్థ లేదు. డిస్ట్రిబ్యూటర్‌లు చెప్పిందే కలెక్షన్. అదే అథెంటిక్ ఫిగర్. అందువల్ల రికార్డుల విషయంలో పీఆర్ ఎక్సర్ సైజ్ ఎవరు బాగా చేసుకుంటే వాళ్లకే రికార్డులు వుంటాయి. ఇది జీర్ణించుకోవాల్సిన వాస్తవం.

కల్కి సినిమా ఇరవై రెండు కోట్లకు పైగా షేర్ తెచ్చుకుంటే ఆర్ఆర్ఆర్ రికార్డు నైజాంలో బ్రేక్ అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దాంతో ఫ్యాన్స్ కామెంట్లు, యాంటీ ఫ్యాన్స్ కౌంటర్ కామెంట్లు మొదలయ్యాయి సోషల్ మీడియాలో.

ఈ గడబిడ చూసి నిర్మాత ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసారు.. రికార్డుల కోసం ఎవరూ సినిమాలు తీయరని, సినిమా మీద ప్రేమతో, ఆడియన్స్ మీద అభిమానంతో సినిమాలు తీస్తారని నిర్మాత పేర్కొన్నారు. అంటే తాము రికార్డుల కోసం సినిమా తీయలేదని క్లారిటీ ఇచ్చారన్న మాట.

ఇదిలా వుంటే కల్కి సినిమా నాన్ సీజన్ లో, నెలాఖరులో, అదీ గురువారం నాడు విడుదలయింది. పైగా భారీ రేట్లు. ఈ ప్రభావం అర్బన్ లో అంతగా కనిపించలేదు కానీ బి, సి సెంటర్లలో కనిపించింది. అందువల్ల రికార్డులు కాస్త దూరంలో ఆగిపోయాయి.

రేట్లు సంగతి అలా వుంచితే, బి, సి సెంటర్లలో మంచి పుల్లింగ్ వుండాలంటే, సినిమా రీచ్ అక్కడి వరకు వుండాలి. కల్కి ప్రమోషన్లు సోషల్ మీడియాలో సాగినట్లు, గ్రౌండ్ లెవెల్ లో సాగినట్లు లేదు. అది కూడా కొంత సమస్య అయింది.

2 Replies to “ఫ్యాన్స్ – రికార్డులు.. రికార్డులు”

Comments are closed.