సుకుమార్- బన్నీ.. ఏం జరుగుతోంది

పెద్దవాళ్ల మధ్య సంగతులు బాహాటంగా బయటకు రావు. హీరోకు.. దర్శకుడికి ఏమైనా ఇబ్బందులు వుంటే మధ్యలో నిర్మాత తడిక గా వుండాల్సి వస్తుంది. పుష్ప 2 సినిమా విషయంలో ఇదే పరిస్థితి నెలకొందని విశ్వసనీయ…

పెద్దవాళ్ల మధ్య సంగతులు బాహాటంగా బయటకు రావు. హీరోకు.. దర్శకుడికి ఏమైనా ఇబ్బందులు వుంటే మధ్యలో నిర్మాత తడిక గా వుండాల్సి వస్తుంది. పుష్ప 2 సినిమా విషయంలో ఇదే పరిస్థితి నెలకొందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆగస్టులో విడుదల కావాల్సిన సినిమా.. కానీ డిసెంబర్ కు వాయిదా పడింది. దీనికి కారణం దర్శకుడు సుకుమార్ పని తీరే అని తెలుస్తోంది. తెల్లవారి షూటింగ్ అనగా క్యాన్సిల్ కొట్టిన సందర్భాలు వున్నాయని తెలుస్తోంది. ఇప్పటికి ఇంకా ముఫై రోజులకు పైగా షూట్ పెండింగ్ వుందని తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ ఆగింది. ఒక పక్క దీనికి కారణం సుకుమార్ కు ఫీవర్ అని ఓ టాక్. కాదు, రెగ్యులర్ షూట్ బ్రేక్ అని మరో టాక్,. ఈ తరహా పని తీరుతో హీరో అల్లు అర్జున్ విసిగిపోయినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా ఒకే ప్రాజెక్ట్ మీద వుండిపోయారు బన్నీ. కేవలం పుష్ప 2 లేట్ కావడం వల్లనే అట్లీతో సినిమా తప్పి పోయిందని తెలుస్తోంది. కానీ బన్నీ ఏమీ చేయలేక ఊరుకున్నారు.

ఇప్పుడు కూడా, ఆగస్టు నుంచి డిసెంబర్ కు వెళ్లాక కూడా షూటింగ్ మరింత నెమ్మదించిందని బన్నీ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూట్ ఆగింది. ఇంకా ముఫై రోజులకు పైగా బకాయి వుంది. పోనీ ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్న కంటిన్యూగా షూట్ చేయాల్సి వుంది. డే అండ్ నైట్ షూట్ చేయడానికి బన్నీ సిద్దంగానే వున్నారని, కానీ దర్శకుడి నుంచి ఆ దిశగా ప్రయత్నం లేదని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా హీరోలు కోపరేట్ చేయక దర్శకులు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ హీరో రెడీగా వుండి కూడా ఇబ్బంది పడుతున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కు రెండు నెలల సమయం కనీసం పడుతుంది. సుకుమార్ లాంటి దర్శకులు ఎక్కువ సమయం తీసుకుంటారు. నాలుగు నెలల టైమ్ వుంది. ఇటు షూటింగ్ ఒక నెల అనుకుంటే, అటు మొత్తం మూడు నెలలు సరిపోతుంది. అంటే చివరి నెల మొత్తం ప్రమోషన్లకు కేటాయించవచ్చు.

కానీ ఇదంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. లేదంటే.. బన్నీ అసహనం మరింత పెరిగే అవకాశం వుంది. పైకి చూపించకపోయినా.