భారతీయుడుకు చుక్కెదురు!

భారతీయుడు 2 సినిమాకు ఆంధ్రలో చుక్కెదురు అయింది. భారతీయుడు 2 సినిమాకు అదనపు రేట్లు రాలేదు. ఈ సినిమా ఆంధ్ర హక్కులు ఆసియన్ సునీల్- సురేష్ బాబు- శిరీష్ తీసుకున్నారు. లైకా సంస్థ తరపున…

భారతీయుడు 2 సినిమాకు ఆంధ్రలో చుక్కెదురు అయింది. భారతీయుడు 2 సినిమాకు అదనపు రేట్లు రాలేదు. ఈ సినిమా ఆంధ్ర హక్కులు ఆసియన్ సునీల్- సురేష్ బాబు- శిరీష్ తీసుకున్నారు. లైకా సంస్థ తరపున అదనపు రేట్లకు అప్లయ్ చేసారు. దీంతో సురేష్ బాబుకు వున్న పలుకుబడి గుర్తు తెచ్చుకుని ఇలా జరిగిందేమిటా? అని డిస్కషన్లు మొదలయ్యయి.

తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా సురేష్ బాబును రాజకీయాల్లో ఐడెంటిఫై చేస్తారు. తండ్రి రామానాయడు తెలుగుదేశం ఎంపీగా చేసారు. ఆ తరువాత రాజకీయాలు తనకు నప్పవు అని తప్పుకున్నారు. కానీ సురేష్ బాబుకు పార్టీతో, పార్టీ అధినేతలో మంచి సంబంధాలే వుంటూ వచ్చాయి. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేతలు సురేష్ బాబు వైఖరి పట్ల అసంతృప్తిగా వున్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో వున్నాయి.

దీనికి కారణం చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించనపుడు రాఘవేంద్రరావు తప్ప సినిమా వాళ్లెవరూ స్పందించలేదు. సురేష్ బాబు పూర్తి మౌనంగా వుండిపోయారు. నిజానికి సురేష్ బాబుకు విశాఖలో స్టూడియోకి మంచి స్ధలం కేటాయించింది చంద్రబాబునే. ఆ దృష్టితో అయినా అరెస్ట్ ను ఖండించి వుండాల్సింది. కానీ అలా చేయలేదు. జగన్ తన హయాంలో సురేష్ బాబు విశాఖ స్టూడియోను అమ్మమని వత్తిడి చేసారని వార్తలు వచ్చాయి.

చంద్రబాబు- లోకేష్ ల వైఖరి గతంలో మాదిరిగా లేదు. ఎవరు తమవారు. ఎవరు కాని వారు అనే విషయంలో గత అయిదేళ్లలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే పైపై భజనలకు వారు ఇప్పుడు అస్సలు లొంగడం లేదు. అలాంటి వారిని దగ్గరకు రానివ్వలేదు.

ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ 2 / భారతీయుడు 2 సినిమాకు ఆంధ్రలో అదనపు రేట్లు, అదనపు ఆటలు కావాలని దరఖాస్తు చేసారు. కానీ ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. దానికి రీజన్ కల్కి రేట్ల విషయం కోర్టులో వుండడమే అని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం తలుచుకుంటే ఏదో విధంగా ఇవ్వవచ్చు. కానీ అలా జరగలేదు.

టికెట్ రేట్ల విషయంలో కోర్టు తీర్పు తరువాత ప్రభుత్వ నిర్ణయం వస్తుందేమో? అలా అయితే కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశం తక్కువ. ఈ లోగా వచ్చిన సినిమాలకు కాస్త ఇబ్బందే. లేదూ భారతీయుడు 2 డబ్బింగ్ సినిమా అని కనుక పక్కన పెట్టి వుంటే ఫరవాలేదు. ఇవన్నీ కాకుండా సురేష్ బాబు వ్యవహారం ఏమైనా కనుక టికెట్ రేట్ల వెనుక వుండి వుంటే అది వేరే సంగతి.

ఇదిలా వుంటే టికెట్ రేట్లు ఇవ్వాలంటే చాలా ముందుగా అన్ని రకాల డాక్యుమెంట్లతో, ఖర్చు వివరాలు, జిఎస్టీ వివరాలు అన్నీ ప్రోపర్ గా సబ్ మిట్ చేయాలని, అలా చేయలేదని అందువల్లే రేట్లు రాలేదని కూడా వినిపిస్తోంది.