భర్తపై సలసలకాగే నూనె పోసిన భార్య

కుటుంబ కలహాలతో ఓ భర్త, తన భార్య ఆగ్రహాన్ని చవిచూశాడు. సాధారణంగా భార్యలకు కోపమొస్తే చీపురుకట్ట తిరగేస్తారు. చపాతీ కర్రకు పనిచెబుతారు. ఇంట్లో ఉన్న గిన్నెలు, గ్లాసులు మీదకి విసురుతారు. కానీ ఇక్కడ ఓ…

కుటుంబ కలహాలతో ఓ భర్త, తన భార్య ఆగ్రహాన్ని చవిచూశాడు. సాధారణంగా భార్యలకు కోపమొస్తే చీపురుకట్ట తిరగేస్తారు. చపాతీ కర్రకు పనిచెబుతారు. ఇంట్లో ఉన్న గిన్నెలు, గ్లాసులు మీదకి విసురుతారు. కానీ ఇక్కడ ఓ మహా ఇల్లాలు.. తన భర్తపై సలసల కాగుతున్న నూనెను పోసింది.

దీంతో భర్త ఒళ్లంతా మంటలతో లబోదిబోమన్నాడు. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో ఉంటున్న 44 ఏళ్ల సదయ్యకు, ఆమె భార్యకు ఎప్పుడూ గొడవలే. సదయ్య కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కానీ అది భార్యకు నచ్చలేదు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓసారి పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. ఇటీవల మళ్లీ తిరిగొచ్చింది.

నిన్నంతా బయటతిరిగి రాత్రికి ఇంటికొచ్చిన సదయ్య, భార్యను పిలిచాడు. కానీ ఆమె స్పందించలేదు. దీంతో సదయ్యకు కోపం వచ్చింది. 2 తిట్లు తిట్టాడు. లోపల ఏం చేస్తున్నావంటూ వంట గదిలోకి వెళ్లాడు. అప్పటికే భార్య అతడి కోసం 2 చేతులతో కారంపొడి పట్టుకొని రెడీగా ఉంది. స్టవ్ పై నూనె కూడా బాగా వేడిచేసి పెట్టింది.

భర్త లోపలకు రావడమే ఆలస్యం అతడి కంట్లో కారం కొట్టింది. వేడివేడిగా కాగుతున్న నూనె తీసి అతడిపై పోసింది. వెంటనే కూతురుతో కలిసి పరారైంది. సదయ్యను పోలీసులు హాస్పిటల్ లో జాయిన్ చేసి కేసు నమోదుచేశారు. ఒంటిపై నూనె పోసినంత కోపం ఆమెకు ఎందుకొచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ష‌ర్మిల 'ప్ర‌త్యేక'  స‌మావేశం వెనుక మాస్ట‌రు ప్లాన్ ?

తెలంగాణలో పార్టీ వద్దన్నదే జగన్ భావన