మీడియాకు దూరమైన ‘పురుషోత్తముడు’

ఎప్పుడైతే లావణ్య బయటకొచ్చిందో ఆ వెంటనే రాజ్ తరుణ్ మీడియా ముందుకు రావడం మానేశాడు. అయితే తన సినిమా ప్రచారం కోసం అతడు కచ్చితంగా మీడియాను ఫేస్ చేస్తాడని అంతా అనుకున్నారు. Advertisement కానీ…

ఎప్పుడైతే లావణ్య బయటకొచ్చిందో ఆ వెంటనే రాజ్ తరుణ్ మీడియా ముందుకు రావడం మానేశాడు. అయితే తన సినిమా ప్రచారం కోసం అతడు కచ్చితంగా మీడియాను ఫేస్ చేస్తాడని అంతా అనుకున్నారు.

కానీ కెరీర్ లో తొలిసారి రాజ్ తరుణ్ ప్రచారం చేయకుండానే అతడి సినిమా రిలీజైంది. అదే పురుషోత్తముడు. రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ప్రమోషన్ చేద్దామనుకునే టైమ్ కు లావణ్య ఎపిసోడ్ తెరపైకొచ్చింది. దీంతో రాజ్ తరుణ్ తో సంబంధం లేకుండానే థియేటర్లలోకి వచ్చాడు పురుషోత్తముడు.

ఓవైపు రాజ్ తరుణ్ స్త్రీలోలుడని, అతడికి చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయని లావణ్య ఆరోపిస్తున్న టైమ్ లో.. పురుషోత్తముడు అనే టైటిల్ తో అతడి సినిమా రిలీజవ్వడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

ఇవి చాలదన్నట్టు.. సినిమాలో అతడికి ‘జోవియల్ స్టార్’ అనే బిరుదు ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చను మరింత పెంచింది. జోవియల్ స్టార్ అంటే ఉల్లాసమైన హీరో అని తెలుగులో అర్థం.

ఇక రాజ్ తరుణ్ హీరోగా నటించిన మరో సినిమా తిరగబడరా సామీ. ఈ సినిమా టైటిల్ కు, లావణ్య వివాదానికి ముడిపెడుతూ కూడా చాలా సెటైర్లు వచ్చాయి. ఈ సినిమాను ఆగస్ట్ 2న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

3 Replies to “మీడియాకు దూరమైన ‘పురుషోత్తముడు’”

Comments are closed.