ఆ మిత్రులద్దరి సినిమాలు ఎప్పుడో మరి?

వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి. ఈ పేర్లు రెండు కావు ఒక్కటే. అలాంటి మిత్రులు వారిద్దరు. ఇద్దరి కాంబినేషన్ లో బోలెడు హిట్ లు వున్నాయి. కానీ లేటెస్ట్ గా వచ్చిన ఫ్లాపులు వారిద్దరి…

వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి. ఈ పేర్లు రెండు కావు ఒక్కటే. అలాంటి మిత్రులు వారిద్దరు. ఇద్దరి కాంబినేషన్ లో బోలెడు హిట్ లు వున్నాయి. కానీ లేటెస్ట్ గా వచ్చిన ఫ్లాపులు వారిద్దరి కెరీర్ ను కిందకు లాగేసాయి.

వక్కంతం వంశీ దర్శకుడు కావాలనుకున్నారు. కథకుడిగా సుఖంగా సాగిపోతున్న ప్రయాణాన్ని గతుకుల రోడ్ లోకి లాగారు. నా పేరు సూర్య సినిమాతో దర్శకుడయ్యారు. చేదు అనుభవం మిగిలింది. మళ్లీ రాక రాక రాక చాన్స్ వచ్చింది. నితిన్ తో ఎక్ట్స్రార్డినరీ మాన్ అనే సినిమా అందించారు. ఎక్ట్స్రార్డినరీ డిజాస్టర్ అయింది. అక్కడితో సరిపోతే ఎలా వుండేదో, నిర్మాత అనిల్ సుంకర, బయ్యర్ వైజాగ్ సతీష్ లను కుదేలు చేసిన అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాకు కూడా వక్కంతం నే కథ ఇచ్చారు. ఇలా అన్ని విధాలా అపఖ్యాతి మూటకట్టుకున్న వక్కంతం మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారో తెలియదు.

ఇక వక్కంతం మిత్రుడు దర్శకుడు సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే వుంది. సైరా సినిమాతో కాస్త అటు ఇటు ఇబ్బంది పడ్డారు. ఏజెంట్ సినిమాతో సురేందర్ రెడ్డి మూటకట్టుకున్న బ్యాడ్ నేమ్ ఇంతా అంతా కాదు. కేవలం సినిమా బాగా లేకపోవడం వరకు అయితే ఓకె. బడ్జెట్ విషయంలో కంట్రోలు లేకపోవడం అన్నది పెద్ద సమస్య. టాలీవుడ్ లో అది కీలకంగా చూస్తారు. సైరా, ఏజెంట్ సినిమాలు రెండింటికి అదే సమస్య.

ఇప్పుడు వక్కంతం, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమా వుంది. సినిమా వుంది అంటే స్క్రిప్ట్ రెడీగా వుంది. మరి అది ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుందో ఎవరికీ తెలియదు. పోనీ మరో సినిమా ఏదైనా స్టార్ట్ అవుతుందా? అంటే అనుమానంగానే వుంది. టాలీవుడ్ పరిస్థితి పెద్ద గొప్పగా లేదు.

ఇలాంటి టైమ్ లో ఇటు సురేందర్ కు అయినా, అటు వక్కంతం కు అయినా, కలిసి అయినా సినిమా పడాలి అంటే అద్భుతం జ‌రగాలేమో? ఎందుకంటే వారి రేంజ్ కు తగిన హీరోలు ఎవ్వరూ ఖాళీ లేరు. హీరోలు ముందుకు వస్తేనే నిర్మాతలు ధైర్యం చేస్తారు. లేదంటే కష్టం.

7 Replies to “ఆ మిత్రులద్దరి సినిమాలు ఎప్పుడో మరి?”

  1. దాసరి సుమ కనకల హీరోయిన్ గా ఒక సినిమా తీశారు.అందులో వక్కంతం వంశీ అనే అతను హీరో అని గుర్తు..ఈ ఇద్దరూ ఒక్కరేనా?pl clarify.

Comments are closed.