ఫక్తు కమర్షియల్ కట్ తో వచ్చింది మిస్టర్ బచ్చన్ ట్రయిలర్. రైడ్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ఓ వింటేజ్ స్టయిల్ లవ్ ట్రాక్ ను యాడ్ చేసారు. వింటేజ్ లవ్ ట్రాక్ లో కొత్తదనం హీరోయిన్ భాగ్యశ్రీ. ఎందుకంటే రవితేజకు ఈ వింటేజ్ స్టోరీలు కొత్త కాదు. కొన్నాళ్ల క్రితం డిస్కోరాజా సినిమా కూడా చేసారు. వింటేజ్ లవ్ ట్రాక్ కు మాస్ యాక్షన్ ట్రాక్ అయిన ఇన్ కమ్ టాక్స్ రెయిడ్ ను యాడ్ చేసారు. ఓ బలమైన విలన్ మీద హీరో ఇన్ కమ్ టాక్స్ రెయిడ్ చేయడం అన్నది రెండో ట్రాక్.
ఈ రెండు ట్రాకులను వేరు వేరుగా చూపిస్తూనే ట్రయిలర్ ను కట్ చేసారు. అంటే సినిమా తొలిసగం ట్రయిలర్ లో తొలిసగంలో, మలిసగం దానికి కొనసాగింపుగా చూపించారు. సినిమాలో ఏ విధంగా వస్తుందో ట్రయిలర్ లో అదే విధంగా జోడించారు. అయితే ఈ రెండు పార్ట్ లను ఎలా లింక్ చేసారన్నది సినిమాలో చూడాలి.
ఇప్పటికే వదిలిన పాటల్లోని డ్యాన్స్ బిట్ లు అన్నీ కట్ చేసి, ట్రయిలర్ కు గ్లామర్ కంటెంట్ కింద జోడించారు. తొలిసగంలో సత్య, మలిసగంలో చమ్మక్ చంద్ర వుంటాడని హింట్ ఇవ్వనే ఇచ్చారు.
రవితేజ ధమాకా సినిమా కు స్టోరీ కంటెంట్ కన్నా, గ్లామర్ కంటెంట్, డ్యాన్స్ లు ప్లస్ అయ్యాయి. అదే ఫార్ములాతో బచ్చన్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడ శ్రీలీల ఇక్కడ భాగ్యశ్రీ బోస్. దీనికి వింటేజ్ లుక్ రవితేజ,యాక్షన్ సీన్లు అదనం. పీపుల్స్ మీడియా నిర్మించిన ఈ సినిమా అగస్ట్ 15న విడుదలవుతుంది. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి.
👍
జనం పట్టించుకోరు
ఎలా ఉన్నా థియేటర్లో చూడం
Vc available 9380537747
Vc estanu 9380537747
Raviteja carrier end aipoindhi tickets waste