మరో సినిమా మొదలు.. మొత్తం ఐదు

ఈమధ్య వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. అదే ఊపులో ప్రారంభోత్సవాలు కూడా కానిచ్చేస్తున్నాడు. ఓ సినిమాకు ఇలా గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం, మరో సినిమాకు అలా కొబ్బరికాయ కొడుతున్నాడు. Advertisement ఈరోజు…

ఈమధ్య వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. అదే ఊపులో ప్రారంభోత్సవాలు కూడా కానిచ్చేస్తున్నాడు. ఓ సినిమాకు ఇలా గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం, మరో సినిమాకు అలా కొబ్బరికాయ కొడుతున్నాడు.

ఈరోజు విశ్వక్ సేన్ మరో సినిమా మొదలుపెట్టాడు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ ప్రాజెక్టు.

ఈ సినిమాతో శ్రీధర్ గంటాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు విశ్వక్. ఇతడీ సినిమాకు రచయిత కూడా. విశ్వంభర దర్శకుడు వశిష్ఠ క్లాప్ కొట్టి యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఇదొక యాక్షన్ మూవీ. విశ్వక్ ఇందులో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సంపాద అనే అమ్మాయిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ సంగీత దర్శకుడు.

రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు విశ్వక్. దీపావళికి అతడి నుంచి మెకానిక్ రాకీ వస్తోంది. సెట్స్ పై లైలా సినిమా ఉంది. ఇప్పుడీ పోలీస్ కథను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. త్వరలోనే అనుదీప్ కేవీ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తాడు. ఇవి కాకుండా దాస్ కా ధమ్కీ 2 కూడా రావాల్సి ఉంది.

5 Replies to “మరో సినిమా మొదలు.. మొత్తం ఐదు”

Comments are closed.