రెడ్‌బుక్ ప్ర‌కార‌మే చ‌ర్య‌లు!

ఏపీలో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన రెడ్‌బుక్‌పై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రెడ్‌బుక్ త‌మ‌కు మ్యాండేట‌రీ అని, దాని ప్ర‌కారం చ‌ర్య‌లుంటాయ‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త ప్ర‌భుత్వంలో…

ఏపీలో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన రెడ్‌బుక్‌పై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రెడ్‌బుక్ త‌మ‌కు మ్యాండేట‌రీ అని, దాని ప్ర‌కారం చ‌ర్య‌లుంటాయ‌ని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త ప్ర‌భుత్వంలో చ‌ట్టాలు ఉల్లంఘించి, టీడీపీ కార్య‌క‌ర్త‌ల్ని, ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్టార‌న్నారు. అలాంటి వాళ్ల‌ను వ‌దిలి పెట్టే ప్ర‌శ్నే లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు ఫేక్ స‌ర్టిఫికెట్ల‌తో అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేశాడ‌ని ఆరోపించారు. అలాంటి వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోకూడ‌దా? అని లోకేశ్ ప్ర‌శ్నించారు. రానున్న రోజుల్లో ఇసుక, మ‌ద్యం పాల‌సీల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. పాద‌యాత్ర‌లో భాగంగా ఊరూరా తాను ఈ విష‌యం చెప్పాన‌ని ఆయ‌న గుర్తు చేశారు.

చ‌ట్టం ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు త‌మ‌కు స్ప‌ష్టంగా తీర్పు ఇచ్చార‌న్నారు. విజ‌య‌వాడ‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద శిలాఫ‌ల‌కం తొల‌గించ‌డంపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. జ‌గ‌న్ సైకో మాత్ర‌మే కాదు, ఫేక్ కూడా అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద శిలాఫ‌ల‌కంపై రాజ్యాంగ రూప శిల్పి పేరు కంటే జ‌గ‌న్ పేరు పెద్ద‌దిగా వుంద‌న్నారు. ఈ విష‌య‌మై బాధ‌ప‌డిన ద‌ళిత యువ‌కులు దాన్ని తొల‌గించార‌న్నారు. దానికి గ‌గ్గోలు పెట్ట‌డం ఎందుకని ఆయ‌న ప్ర‌శ్నించారు. విదేశీ విద్య‌కు అంబేద్క‌ర్ పేరు తొల‌గించి, త‌న పేరు పెట్టుకున్న‌ది జ‌గ‌న్ కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

16 Replies to “రెడ్‌బుక్ ప్ర‌కార‌మే చ‌ర్య‌లు!”

  1. I visited earlier , Jagan name is not at all bigger than Ambedkar name , it just looked normal to have their name at the feet of amedkar who inaugurated. Foolish to back these goons and justifying on behalf of them by comparing sizes . if they want to remove names they can do with due process by bringing a GO saying all names should not exceed more than this size. will it be ok if someone comes and demolishes anna canteen saying that someone did not liked yellow color for Govt. sponsored scheme

  2. దుర్మార్గులైన అధికారులను చట్టం ముందు నిలబెడతానని అయన ఊరువాడా తిరిగి చెప్పేడు అది చెయ్యక పొతే మాట తప్పిన వాడు అవుతాడు వీళ్ళను వదిలేస్తే అధికారులకు పట్టపగ్గాలు వుండవు ఐఏఎస్ లేదా ips సాధిస్తే జనాలను పీడించుకు తినటానికి కాదు అని బ్యాండ్ గట్టిగ మొగిస్తేనే తర్వాత అధికారులు తమ అధికారాలను దుర్వినియోగ చెయ్యాలంటే భయ పడతారు

Comments are closed.