జోకర్ కామెంట్స్ ను పట్టించుకోని టాలీవుడ్

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి, ప్రభాస్ పై నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. కల్కిలో ప్రభాస్ జోకర్ లా కనిపించాడంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. దీనిపై ప్రభాస్ అభిమానులు భగ్గుమన్నారు. కానీ టాలీవుడ్ మాత్రం ఈ…

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి, ప్రభాస్ పై నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే. కల్కిలో ప్రభాస్ జోకర్ లా కనిపించాడంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. దీనిపై ప్రభాస్ అభిమానులు భగ్గుమన్నారు. కానీ టాలీవుడ్ మాత్రం ఈ కామెంట్స్ ను లైట్ తీసుకుంది.

ప్రభాస్ స్థాయి ఏంటి, అతడి స్టామినా ఏంటనే విషయం అందరికీ తెలిసిందే. ఏ బాలీవుడ్ హీరోకు అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. అలాంటి హీరోపై మరో హీరో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కచ్చితంగా టాలీవుడ్ రియాక్ట్ అవ్వాల్సిందే.

కానీ ఇక్కడ ప్రభాస్ పై విమర్శలు చేసిన వ్యక్తి హీరో కాదు, ఆ మాటకొస్తే అతడే పెద్ద జోకర్. మంచి కమెడియన్ గా బాలీవుడ్ లో అతడికి పేరుంది. కాబట్టి అలాంటి జోకర్ చేసిన వ్యాఖ్యల్ని టాలీవుడ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

అప్పటికీ సుధీర్ బాబు లాంటి కొంతమంది ఈ వ్యాఖ్యలపై స్పందించారు. కుంచిత మనస్తత్వం ఉన్నవాళ్లు నోరు పారేసుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

నిజానికి అర్షద్ వార్సి లాంటి ఒకరిద్దరు బాలీవుడ్ లో ఉన్నారు. సౌత్ సినిమా జాతీయ స్థాయిలో ఎదుగుతుంటే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే అప్పుడప్పుడు తమ బుద్ధిని ఇలా బయటపెడుతున్నారు. అయితే అలాంటి వాళ్లంతా గమనించాల్సిన విషయం ఏంటంటే, సౌత్ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి కూడా చేరుకుంది. తమ విమర్శలతో, బాడీ షేమింగ్ స్టేట్ మెంట్స్ తో ఎవ్వరూ దీన్ని ఆపలేరు.

8 Replies to “జోకర్ కామెంట్స్ ను పట్టించుకోని టాలీవుడ్”

  1. Dear journalist. he told that the charecter in Kalki looks like joker in first half doing all non sense as he was expected something rebel like character by Prabhas . he did not commented Prabhas as Joker

Comments are closed.