‘అనుమతులు’ కూడా కామెడీ అవుతున్న వేళ!

హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, నాలాలు ఆక్రమించిన నిర్మాణాలను నిర్మొహమాటంగా కూల్చివేస్తూ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదులుతోంది. హైడ్రా దూకుడుతో చెరువు భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. Advertisement…

హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, నాలాలు ఆక్రమించిన నిర్మాణాలను నిర్మొహమాటంగా కూల్చివేస్తూ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదులుతోంది. హైడ్రా దూకుడుతో చెరువు భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

పార్టీల ముద్ర లేని నాగార్జున వంటి సెలబ్రిటీ కి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం దగ్గరి నుంచి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ మద్దతుతో జరిగిన ఆక్రమణలను తొలగించడం, భారత రాష్ట్ర సమితి నాయకులు చెరువు స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడం వరుస కార్యక్రమాలు గా జరుగుతున్నాయి.

భారాస అగ్ర నాయకులు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరి రెడ్డి కి చెందిన విద్యాసంస్థల నిర్మాణాలు కూడా చెరువు భూముల్లో ఉన్నాయని వాటిని కూడా కూల్చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని ఒకవైపు వార్తలు వస్తున్నాయి. మరొకవైపు చెరువులు, నాలాలు ఆక్రమించిన అక్రమార్కులు ఎంత పెద్ద వారైనా సరే కూల్చివేతలు చేపట్టి తీరాల్సిందే అంటూ సిపిఐ నారాయణ, మరికొందరు బిజెపి నాయకులు కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా అనుమతులు ప్రకారమే నిర్మాణం చేపట్టారు- అనే ప్రతి విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ‘ప్రభుత్వ అనుమతులు’ అనే వ్యవహారమే ఒక ఫార్సులాగా తయారవుతుంది.

పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థల నిర్మాణాలు చెరువు భూముల్లో ఉన్నాయని తేలడంతో వాటిని కూల్చడానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ భూములను కాపాడడానికి గులాబీ దళానికి చెందిన అగ్ర నాయకులందరూ రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు తో మాత్రమే తమ ఆస్తులను కూల్చివేయడానికి, ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తున్నదనే విమర్శలతో వారు చెలరేగుతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి చేపట్టిన నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు అన్నీ ఉన్నాయని, అనుమతులు లేకుండా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు.

పదేళ్లపాటు గులాబీ నాయకులు రాజ్యం చేసిన సమయంలో.. చెరువు భూములను ఆక్రమించినప్పుడు అనుమతులు పుట్టించుకోవడం వారికి సునాయాసమైన పని. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అధికారులను ప్రలోభ పెట్టి లేదా బెదిరించి.. పాలక పక్షానికి చెందిన నాయకులు ‘అనుమతులు’ తెచ్చుకున్నంత మాత్రాన.. వారు ఆక్రమించిన భూములు చెరువు భాగానికి సంబంధించినవి కాకుండా పోతాయా? అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది.

తమ పార్టీ అధికారంలో ఉండగా.. తామే ఆక్రమణలకు పాల్పడుతూ.. అవన్నీ సరైన చర్యలే అని తామే అనుమతులు ఇచ్చేసుకుని.. తీరా ఇప్పుడు చెరువుల పరిరక్షణ కోసం కొత్త ప్రభుత్వం కూల్చివేత చేపడుతుంటే.. తమకు అనుమతులు ఉన్నాయంటూ గోల చేయడం రాజకీయ ప్రేరేపితం గానే కనిపిస్తోంది.

తమాషా ఏమిటంటే.. తమ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులను కూల్చేస్తున్నారని ఆరోపిస్తున్న బిఆర్ఎస్ ప్రముఖులు ఎవరూ.. చెరువు స్థలాల్లోకి చొరబడలేదు అనే మాట చెప్పడం లేదు. అనుమతులు ఉన్నాయి అనే మాట మాత్రమే వాడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి సర్కారు కూడా.. ఈ బూటకపు అనుమతుల బాగోతాలను పక్కనపెట్టి.. చెరువు స్థలాల పరిరక్షణలో ముందుకు దూసుకు వెళుతూ ఉండడం విశేషం.

18 Replies to “‘అనుమతులు’ కూడా కామెడీ అవుతున్న వేళ!”

  1. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థల నిర్మాణాలు చెరువు భూముల్లో ఉన్నాయి కూల్చి తీరాల్సిందే, చెరువులో అక్రమ కట్టడాల వలన అమాయకుల ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది

  2. నాగార్జున గారు కి ఏ పార్టీ తో అనుబంధం లేదా?? మతి ఉంది రాస్తున్న రాతలేనా ఇవి నిన్న మొన్నటి వరకు మీరే చెప్పారు కదా ఆయన ఎవరికీ ఎంత దగ్గర వ్యకి అని

  3. కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఒక్క దానం నాగేందర్ కి మాత్రమే అలాంటి ప్రాపర్టీ ఉందా?

    1. కమలం(గా)గాల్లవి కుడా వున్నాయ్..అసలైన బుల్ డోజర్ యాక్షన్ ఏంటో చుస్తావు…తుమ్మిడికుంట నాలా ని బీజేపీ ఎంపీ అక్రమన..స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు

  4. మళ్ళీ పొరపాటున తెరాస అధికారం లోకి వస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళ మీద పడతారు మన ఏపీ, తమిళనాడు లాగా!

  5. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి టార్గెట్ ఎంత పెట్టారో మరి!

      1. అంటే నేను రాసింది నిజమేనన్న మాట! అదీ కాక కాంగ్రెస్ కేంద్రం లో అధికారం లో ఉన్నపుడు అంబానీ, adani లని వాడుకునేది అన్న మాట!

  6. మళ్ళీ పొరపాటున తెరాస అధికారం లోకి వస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళ మీద పడతారు మన ఏపీ, తమిళనాడు లాగా! anthega mari

  7. టిల్లు రావు చేసిన ప్రతి సెటిల్మెంట్ కూడా తిరగదొడగలిగితే రేవంత్ సత్తా తెలుస్తుంది.

Comments are closed.