బాబులో చెడ్డ గుణం ఇదే!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిలో చెడ్డ గుణం ఏంటంటే… త‌న గురించి తానే గొప్ప‌లు చెప్పుకోవ‌డం. ఫ‌లానా నాయ‌కుడు మంచి చేశార‌ని ప్ర‌జ‌లు చెప్పుకుంటే, అది స‌ద‌రు లీడ‌ర్‌కు గౌర‌వంగా వుంటుంది. దివంగ‌త నేత‌లు ఎన్టీఆర్‌, వైఎస్సార్…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిలో చెడ్డ గుణం ఏంటంటే… త‌న గురించి తానే గొప్ప‌లు చెప్పుకోవ‌డం. ఫ‌లానా నాయ‌కుడు మంచి చేశార‌ని ప్ర‌జ‌లు చెప్పుకుంటే, అది స‌ద‌రు లీడ‌ర్‌కు గౌర‌వంగా వుంటుంది. దివంగ‌త నేత‌లు ఎన్టీఆర్‌, వైఎస్సార్ ఎప్పుడూ తమ గురించి తామే గొప్ప‌లు చెప్పుకోవ‌డం చూడ‌లేదు. ఈ ఇద్ద‌రు నేత‌లే కాదు, నిజంగా జ‌నం కోసం ప‌ని చేసే వారెవ‌రైనా త‌మ గురించి తాము ప్ర‌శంస‌లు కురిపించుకోరు. అది సంస్కారం కూడా కాదు.

అదేంటే కానీ, చంద్ర‌బాబు మాత్రం కాస్త భిన్న‌మైన నాయ‌కుడు. బాబు ఏం చేసినా, చేయ‌క‌పోయినా గొప్ప‌లు చెప్ప‌డానికి ప్ర‌త్యేకంగా బ‌ల‌మైన మీడియానే వుంది. ఈ మీడియా గ‌ప్పాలు చాల‌వ‌న్న‌ట్టు, తాజాగా చంద్ర‌బాబు త‌న గురించి తానే ఆహా, ఓహో అని చెప్పుకోవ‌డం విన‌డానికి, చూడ‌డానికి ఇబ్బందిప‌డే వాళ్లు లేక‌పోలేదు.

ఏడాది క్రితం బ‌స్సులో ఉన్న త‌న‌ను అన్యాయంగా అరెస్ట్ చేశార‌ని, ఇప్పుడు అదే బ‌స్సులో ఉంటూ వ‌ర‌ద బాధితుల కోసం ప‌ని చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. అప్పుడు త‌న కోసం ప్ర‌జ‌లు వ‌చ్చార‌ని, ఇప్పుడు వాళ్ల కోసం తాను ప‌ని చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఏ పేరుతో పిలిచినా ప‌లుకుతాన‌ని ఆయ‌న త‌న‌దైన స్టైల్‌లో అన్నారు.

నివాసం ఉన్న ప్రాంతంలో కాకుండా, మ‌రెక్క‌డికైనా వెళ్లి బ‌స్సులో ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. గ‌తంలో విశాఖ‌లో హుదుద్ తుపాను వ‌చ్చిన‌ప్పుడు, 10 రోజులు చంద్ర‌బాబు బ‌స్సులో ఉండి సహాయ‌క చ‌ర్య‌ల్ని ప‌ర్య‌వేక్షించ‌డం ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు క‌దా? వ‌ర‌ద‌ల్లో బాబు ఇల్లు కూడా మున‌క‌కు గురైంద‌న్న‌ది అంద‌రికీ తెలుసు. ఆ విష‌యాన్ని ఆయ‌నే ఒప్పుకున్నారు.

ఇప్పుడేమో బ‌స్సులో ఉండి, మీ కోసం ప‌ని చేస్తున్నా అనే బిల్డింప్ మాట‌లు ఎందుక‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌లెవ‌రూ బాబును ప్ర‌శంసించ‌లేద‌ని, త‌న‌కు తానే భుజాలు త‌ట్టుకోవ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ని ప్ర‌త్య‌ర్థులు మండిప‌డుతున్నారు.

41 Replies to “బాబులో చెడ్డ గుణం ఇదే!”

  1. డప్పు కొట్టే వాడంటే నేనే కొత్త దేముడు అంటాడు. యుగపురుషుడు గోల already చూస్తున్నాము కదా నికృష్టమైన రూపంలో గోదావరి గట్టు kada .

  2. సీబీన్ తాను చేసిందే చెప్పుకుంటారు, జగన్ ఏమీ చెయ్యకుండానే ఇంకొకరు చేసింది కూడా తానే చేసినట్టు డప్పు కొట్టుకుంటాడు.

  3. CBN suffers from inferiority in comparison with popularity of NTR and YSR. This self boasting and bhajana by yellow media and supporters is a medicine for this psychological issue.

    1. Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu Ani proved

      Anduke CBN ni 3 rd time cm gaa ennukunnaaru prajalu

  4. ఓకే బాబు గారి ఇల్లు మునిగిందే అనుకుందాం. ఆయన సిఎం హోదాలో ఏ five star హోటల్ లో అయినా stay చేయొచ్చు, కానీ బస్ లో ఉండటం గొప్పే కదా. నీకు ఏదైనా మీ జగన్ చేస్తేనే గొప్ప.

  5. చేసిన పనే చెప్పుకుంటున్నాడు కదా…చెయ్యనివి చేసినట్టు చెప్పట్లేదు కదా… ఉత్తుత్తి బటన్ అస్సలు నొక్కటం లేదు కదా…అవసరం ఉంది జనాల మధ్యలో ఉన్నాడు .రాత్రి, పగలు కష్టపడ్డాడు, అందరు మంత్రుల్ని కూడా అందుబాటులో ఉంచాడు, లండన్ వెళ్ళడం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ లేడుగా…ఇంకా ఎందుకు వీడికి కడుపు మంట

  6. చూసే కోణం బట్టి ఉంటుంది. నిజంగా చంద్రబాబు మంచి చేస్తున్నప్పుడు కూడా మీరు అది చంద్రబాబు

    లోపంగా చూస్తున్నారు. వాస్తవానికి బాబు గారు ఏది

    చేసిన మీకు తప్పుగా అనిపిస్తుంది. అదే జగన్ రెడ్డి

    ఎన్ని అరాచకాలు చేసిన మీకు ఒప్పుగా అనిపిస్తుంది

    చంద్రబాబుకి బలమైన మీడియా ఉందంటున్నారు.

    మరి జగన్ రెడ్డి సంగతేంటి.. జగన్ రెడ్డిని సపోర్ట్

    చేస్తూ, గ్రేట్ ఆంధ్ర, సాక్షి, NTV, TV 9, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే. మీకు ఇష్టం లేని

    నేతల మీద బురద జల్లుడం మానుకొని మీడియా

    విలువలు పాటించడం మీ గ్రేట్ ఆంధ్ర కి కూడా మంచిది.

  7. ఎవరికి తెలుసు?
    CBN ఇల్లు ఎక్కడ మునుగింది నేను అక్కడే ఉంటా మా ఇల్లు కూడా మునగలేదు..
    ఎందుకు GA అన్నీ అబద్దాలు రాస్తావ్
  8. “బిల్డప్” అని కూడా రాయడం చేతగాక, “బిల్డింప్” అని రాశావు. అలాంటి నువ్వు కూడా

  9. Prajalu prasamsinchina me great Andhra kallaki YCP party kallajodu undemo andukani meku kanipinchatledu. Meru anta manchi Panulu chesunte enduku 11 seatle vastay. Antha goramga enduku vodipoyaru. YCP adikaram lo unnapudu chesina darunalu, goralani yenduku prasninchaledu…? Medi oka journalism, thu me bathukulu.

  10. Mari em chesthadu..CBN ki pani chesi goppalu cheppukovalani okkate korika..Jagan annaki ala kadu ga..avineethi chesi silent ga jananal sommu migali anedi korika..ade theda

  11. He never told any thing like that. Intact 420 told in assembly that his rule was chala chala chala bagundhi over CBN. Great Andhra shut your misinformation and help flood effected people

  12. Mr.N.T.Ramarao and Mr.N.Chandrababu Naidu never beat the drum because they are great leaders. But Mr. Y.S.R. what for he never beat his drum, because he has not done good for people except allowing his son, kith and kin to loot, grabe, grabe, and do factionism in the State without knowledge and pain to people of Andhra Pradesh State and the result are being faced by the people at present. What a great difference between grate and circastick grate.

Comments are closed.