ఐఫోన్: రేటు తగ్గింది.. ఫీచర్లు పెరిగాయి

యాపిల్ ఐఫోన్ కొత్త మోడల్స్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా రేట్లు ఆకాశాన్ని తాకడం కామన్. అదే టైమ్ లో పాత మోడల్ ధరలు గణనీయంగా తగ్గించడం కూడా అంతే కామన్. అయితే ఈసారి అలా…

యాపిల్ ఐఫోన్ కొత్త మోడల్స్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా రేట్లు ఆకాశాన్ని తాకడం కామన్. అదే టైమ్ లో పాత మోడల్ ధరలు గణనీయంగా తగ్గించడం కూడా అంతే కామన్. అయితే ఈసారి అలా జరగలేదు. ఐఫోన్ రేట్లు తగ్గించింది, ఫీచర్లు పెంచింది.

ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధరను రూ. 1,19,900 గా నిర్ణయించింది యాపిల్. ఐఫోన్ 15 ప్రో ప్రారంభ ధర (రూ.1,34,900)తో పోలిస్తే ఇది 15వేల రూపాయలు తక్కువ. అదే విధంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరల్ని కూడా సవరించింది.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ హై-ఎండ్ ఫోన్ (1 టీబీ స్టోరేజ్) కొనాలంటే రూ.1,99,900 రూపాయలు పెట్టాల్సి ఉంది. కానీ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ హై-ఎండ్ (1 టీబీ స్టోరేజీ) ధరను రూ.1,84,900కే ఫిక్స్ చేసింది యాపిల్.

ఇండియా విషయంలో యాపిల్ వ్యూహాత్మకంగా అడుగులువేస్తోందనే విషయం ఈ ధరలతో స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయలు కమ్ముకుంటున్న వేళ.. ఇండియా మార్కెట్ పై మరింత పట్టు సాధించే లక్ష్యంతో యాపిల్ ఇలా స్వల్పంగా ధరలు తగ్గించింది.

శాంసంగ్, మోటరోలా, వన్ ప్లస్ లాంటి కంపెనీలు హై-ఎండ్ ఫీచర్లతో ప్రీమియం ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. వాటి ధరలకు కాస్త దగ్గరగా ఐఫోన్లను అందుబాటులో ఉంచితే, భారతీయులంతా తమవైపు ఆకర్షితులవుతారనేది ఐఫోన్ ఎత్తుగడ. అందుకే స్వల్పంగా రేట్లు తగ్గించింది.

ఇది కచ్చితంగా ఐఫోన్ సేల్స్ పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, 70-80 వేలు పెట్టి ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వినియోగదారుడు, మరో 10వేలు అదనంగా పెట్టి ఐఫోన్ మోడల్ కొనడానికే మొగ్గుచూపిస్తాడు.

ఇక తాజాగా లాంచ్ అయిన ఐఫోన్ 16 మోడల్ లో ఫీచర్ల విషయానికొస్తే.. ఓవరాల్ గా అన్ని మోడల్స్ లో స్క్రీన్ సైజ్ పెంచింది. లార్జర్ డిస్ ప్లేతో పాటు, కెమెరా ఫీచర్లను మరింత అత్యుత్తమంగా తయారుచేసింది. బ్యాటరీ కెపాసిటీ కూడా పెరిగింది. దీనికితోడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న అత్యాధునిక ఏఐ ఫీచర్లను కూడా ఐఫోన్16లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

5 Replies to “ఐఫోన్: రేటు తగ్గింది.. ఫీచర్లు పెరిగాయి”

  1. బాగా పెరిగాయి…15 – 25 వేల మధ్య దొరికే budget android phones లో కూడా AMLOED 90 Hz మరియు USB 3.1 ఇస్తుంటే అడుక్కుతినే Cook గాడు USB 2.0 ఇస్తున్నాడు.

  2. బాగా పెరిగాయి…15 – 25 వేల మధ్య దొరికే budgett androidd phonez లో కూడా AMLOEDd 90 Hz మరియు USBx 3.1 ఇస్తుంటే అడుక్కుతినే Cookk గాడు USBx 2.0 ఇస్తున్నాడు.

  3. 2 years old model basic iPhone 50k lo festival offer ki vastundi danni oa 3 or 4 years vadochhu. iPhone lo goppa vishayam emiti ante first lo konnappudu ela smooth ga untundo after 2 years kuda alane untundi. Phone lo pratidi high quality sound display camera speed vibration. oa sari one hour pina water lo undipoyindi no damage. Samsung lo build quality sari ga ledu.

Comments are closed.