విగ్రహ రాజకీయాల్లో రేవంత్ లౌక్యం!

రేవంత్ రెడ్డి దూకుడుకు కుదేలవుతున్న గులాబీ శ్రేణులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే పార్టీ ప్రాభవం రోజురోజుకూ దెబ్బతింటూ వస్తోంది. ఏదో ఒకటి చేసి పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని వారికి…

రేవంత్ రెడ్డి దూకుడుకు కుదేలవుతున్న గులాబీ శ్రేణులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే పార్టీ ప్రాభవం రోజురోజుకూ దెబ్బతింటూ వస్తోంది. ఏదో ఒకటి చేసి పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని వారికి కోరికగా ఉంది. కానీ ఏం చేస్తే నిజంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుందో వారికి తోచడం లేదు.

ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు భారాస రాష్ట్రవ్యాప్తంగా ప్లాన్ చేసిన ఆందోళన కార్యక్రమాలు కూడా మొక్కుబడిగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలు అన్నింటికీ పాలాభిషేకం చేస్తామని అంటున్న వాళ్లు.. అసలు ఇన్నాళ్లపాటూ పదేళ్లపాలనలో తెలంగాణ తల్లికి ఇచ్చిన విలువ ఎంత? అనేది ఖచ్చితంగా తెరమీదకు వస్తోంది. పైగా రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ప్రజామోదం ఉంటోంది. ఏకపక్షంగా వాటిని తప్పు పట్టడానికి సాధ్యంకాని విధంగా ఆయన లౌక్యనీతి ప్రదర్శిస్తున్నారు.

తెలంగాణకు ఒక అద్భుతమైన సచివాలయాన్ని కేసీఆర్ నిర్మింపజేశారు. ఆ సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని తొలగించేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ. కనీసం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన మాత్రం చేయలేదు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి రకరకాల కథనాలున్నాయి. సచివాలయం ఎదురుగా ఉండే స్థలం విగ్రహాల ప్రతిష్ఠాపన రూపేణా చాలా విలువైనది.

నగరం నడిబొడ్డున ఎంతో అద్భుతమైన ప్రదేశం. ఒకవైపు సచివాలయం, మరోవైపు తెలంగాణ జ్యోతి, లుంబిని పార్క్, హుసేన్ సాగర్, ట్యాంక్ బండ్.. ఇలా ఆ ప్రదేశానికి చాలా విలువ ఉంది. అంత గొప్ప చోటును ప్రస్తుతానికి ఖాళీగా ఉంచేయాలనే భారాస సర్కారు డిసైడ్ అయినట్లుగా గుసగుసలు ఉన్నాయి.

శాశ్వతంగా తెలంగాణలో తమ పాలనే నడుస్తూ ఉంటుందని వారు అనుకున్నారు. ఆ ప్రదేశాన్ని ఖాళీగా ఉంచితే.. భవిష్యత్తులో తెలంగాణ జాతిపిత కేసీఆర్ విగ్రహం పెట్టుకోవచ్చునని ఆశపడ్డారు. ఇప్పుడు రేవంత్ సర్కారు రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించేసరికి వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఉండాల్సిందని కోరుతూ, రాష్ట్రంలో ఆమెకు పాలాభిషేకాలు చేస్తున్నారు.

తెలంగాణ తల్లిపై భక్తి నిజమే అయితే ఇన్నాళ్లు వారెందుకు పెట్టలేదు. ఈ ప్రశ్న ప్రజల్లో ఉంది. పైగా రేవంత్ రెడ్డి చాలా లౌక్యంగా.. తెలంగాణ తల్లిని సచివాలయం ఎదుట కాదు.. తెలంగాణ రాష్ట్రం గుండెల్లోనే ఉంటుందన్నట్టుగా.. సచివాలయం ప్రాంగణంలోపలే పెడతానని అనడం ఇంకా గొప్ప విషయం. ఈ మాటకు తెలంగాణ ప్రజలు ఫిదా అయ్యారు. దాంతో.. కేవలం దుగ్ధతో భారాస చేస్తున్న విమర్శలకు, రాద్ధాంతానికి విలువ లేకుండా పోయిందని ప్రజలు అనుకుంటున్నారు.

6 Replies to “విగ్రహ రాజకీయాల్లో రేవంత్ లౌక్యం!”

  1. గట్లనే కెసిఆర్ గాడి విగ్రహం కూడా ఏదో ఒక స్మశానం లో రిజర్వు చేసుకుని, కెసిఆర్ చచ్చుడు కార్యక్రమం పెట్టుకుంటే మనశాంతి గా పోతాడు.

  2. పీవీ నరసింహారావు విగ్రహం ఐతే పర్ఫెక్ట్ గా ఉండేది రాజీవ్ గాంధీ ది కాకుండా

  3. సచివాలయం ప్రాంగణం లోపల ఎవరు వెళ్లి చూస్తారు? అతి తెలివితేటలూ కి మళ్ళీ ఈ మీడియా చిడతలు!

Comments are closed.