పూనమ్ కౌర్.. అసలు.. మీకేం కావాలి?

అసలు తనకు జ‌రిగిన అన్యాయం ఏమిటి? త్రివిక్రమ్ అవకాశాలు రాకుండా చేసారా?

ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ లో అన్యాపదేశాల ముసుగు తీసేసి దర్శకుడు త్రివిక్రమ్ మీద అరోపణల అస్త్రం ఎక్కుపెట్టారు. చిరకాలంగా పూనమ్ కౌర్ ట్వీట్‌ల యుద్దం చేస్తూనే వున్నారు. కానీ త్రివిక్రమ్ కు పూనమ్ కు మధ్య ఏం జ‌రిగింది అన్నది ఎవరికీ తెలియదు. అలాగే అప్పట్లో పవన్ కళ్యాణ్ కు పూనమ్ కు మధ్య ఏం నడించింది అన్నది ఎవరికీ తెలియదు.

కాలం గడచిపోయింది.

ఇప్పుడు త్రివిక్రమ్ టాప్ డైరక్టర్, పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి.

పూనమ్ నటించడమే లేదు. కాంగ్రెస్ కు అనుకూలంగా ట్వీట్ లు వేస్తుంటారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంటారు. ఏవేవో వ్యాపకాలు పెట్టుకున్నారు.

ఇలా ఎవరి దోవన వాళ్లు వున్నారు. మరి ఇప్పుడు ఎందుకు పూనమ్ తమ వ్యవహారాన్ని కెలుకుతున్నట్లు? అసలు పూనమ్ కు ఏం కావాలి? పూనమ్ కోరుకుంటున్న జ‌స్టిస్ ఏమిటి? త్రివిక్రమ్ మీద ఏ విధమైన చర్య తీసుకోవాలని పూనమ్ కోరుకుంటున్నారు. ఎప్పుడో జ‌మానా కాలంలో మా సంస్థ కు ఫిర్యాదు చేసానని, కానీ స్పందన లేదని, స్పందన వుండి వుంటే చాలా మంది సేవ్ అయ్యేవారని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడైనా చర్య తీసుకోవాలని అంటున్నారు.

అప్పట్లో చేసిన ఫిర్యాదులో ఏముంది?

ఇప్పుడు మళ్లీ అదే ఫిర్యాదు చేసారా?

కొత్త విషయాలు ఏమైనా వున్నాయా?

ఇక్కడ పూనమ్ వైపు నుంచి లోపాలు లేదా తప్పులు కూడా కనిపిస్తున్నాయి. తనకు ఏం కావాలి అన్నది క్లారిటీగా ఎందుకు చెప్పడం లేదు. ట్విట్టర్ లోకి వచ్చి, పబ్లిక్ గా మాట్లాడినపుడు, అన్నీ మాట్లాడాలి కదా, సగం సగం ఎందుకు మాట్లాడడం? తన సమస్య ఏమిటో చెప్పాలి కదా? త్రివిక్రమ్ వల్ల బోలెడు మంది నష్టపోతే ఈమెకు ఎందుకు? నష్టపోకపోతే ఎందుకు? తనకు ఏం జ‌రిగిందో చెప్పాలి. తన దగ్గర వున్న అడియో రికార్డులు లేదా ఇతర ఎవిడెన్స్ ల కాపీలను బయటపెట్టకపోవచ్చు. కానీ ఏం వున్నాయో, ఏం జ‌రిగిందో చెప్పాలి కదా.

చాంబర్ పెద్దలు ఏం చెబుతున్నారు. బాక్స్ పెట్టాం అందులో వేయండి అన్నారు. నేరుగా ఇవ్వండి అన్నారు. ఇక్కడ మెయిల్ ఎందుకు? పోనీ ఓపెన్ కావడం ఇష్టం లేదు అనుకుంటే మెయిల్ పంపినట్లు ట్విట్టర్ లో ట్వీట్ వేయడం ఎందుకు?

ఇదంతా యాగీ చేయడం కోసం చేస్తున్నట్లుంది తప్ప, పక్కాగా ఫలితం కోసం కాదన్నట్లు వుంది. నిజంగా త్రివిక్రమ్ వల్ల తనకు అన్యాయం జ‌రిగిందని అనుకుంటే పూనమ్ నేరుగా మీడియా ముందుకు వచ్చేయవచ్చు. కెరీర్ భయం లేదు. ఇప్పుడు నటించడం లేదు. అందువల్ల తనకు జ‌రిగింది అనుకునే అన్యాయం ఏదైనా వుంటే ఓపెన్ అయిపోవచ్చు. అలా ఓపెన్ కాలేను, ప్రాణ భయం అనుకుంటే పూర్తిగా సైలంట్ గా వుండాలి.

మధ్యలో జ‌స్ట్ ఇలా కెలికేసి అలా మాయం కావడం ఎందుకు? ఇటు ఫ్యాన్స్, అటు ఫ్యాన్స్ కొట్టుకోవడానికి తప్ప మరెందుకు పనికి రాదు. త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరక్టర్ ను కౌన్సిల్ పెద్దలు వివరణ అడుగుతారా? చెప్పను అంటే ఏం చేస్తారు? బహిష్కరించగలరా? అలాంటి చర్యల వల్ల ఒరిగేది ఏముంది? పూనమ్ ఇలా కౌన్సిల్ వంటి సంఘాల ద్వారా ఏమీ సాధించలేరు. ఇలాంటి చిన్న లాజిక్ అమెకు తెలియదా?

మరెందుకు ఈ రచ్చ? ఫైట్ చేయాలంటే ఓపెన్ గా వచ్చి ఫైట్ చేయడం. లేదు అంటే మౌనంగా వుండడం.

అంతకన్నా ముందుగా అసలు తనకు జ‌రిగిన అన్యాయం ఏమిటి? త్రివిక్రమ్ అవకాశాలు రాకుండా చేసారా? మరేంటి అన్నది తెలియాలి. పూనమ్ తనకు జ‌రిగిన‌ అన్యాయం అన్నది అందరూ నిజ‌మే, అన్యాయమే అన్నట్లు వుండాలి. అంతే కానీ పూనమ్ ఏవేవో ఊహించుకుని, అది జ‌రగలేదని, అది అన్యాయం అని, దానికి త్రివిక్రమ్ నే కారణం అనుకుంటే సరికాదు.

ముందు అది తేల్చుకుని, తరువాత ఎలా పోరాడాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి. అలా పోరాడడం కూడా ఏ ఫలితం అశించి అన్నది కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. లేదంటే జ‌స్ట్ వన్ డే వ్యవహారంగా ముగిసి అభాసు పాలు కావడం తప్ప ఫలితం ఏమీ వుండదు.

34 Replies to “పూనమ్ కౌర్.. అసలు.. మీకేం కావాలి?”

  1. IPPUDU CHETSHUNNA EE MEE TOO AROPANALLO ANNI SATYA DHORAALU .AMMAYILU TELIVI MEERI POYAARU .ANTHA EASY GAA COMMITMENT LU ICHHI MOSA POYE STHITHI LO EVARU LERU THESUKUNE STHTHI LO MAGAALU LERU .DHEENI KI KAVALSINDHI ATTENTION SYMPATHY ANTHE MATTER LEDHU

  2. Google takeout లొ దొరికిన YPS లు, విద్యాసాగర్! పరారి లొ ఉన్న కుక్కల విద్యాసాగర్.

    ఈ వార్త ఎదిరా GA?

    1. ఆధారాలు, ఆధారాలు అంటే ఏమిటో అనుకున్నా..ఈ బోడి googlee takeoutt వా? Courtx లలో audiox , videox లే పెద్దగా అంగీకరింపబడవు. వీటినే ఉపయోగించేట్టయితే ఆ కలకత్తా casex ఎప్పుడో తేలిపోయేదిగా!

  3. సూర్యోదయాన్ని అరచేతిలో ఆపలేనట్టు, టాలెంట్ వున్న వాళ్ళని ఎవరు ఆపలేరు. పూనం కి ఒక ఛాన్స్ ఇస్తామని, ఇవ్వక పోయి ఉండొచ్చు.

  4. GA నువ్వేనా..ఇంత సెటిల్ గా మాట్లాడు తున్నవా … త్రివిక్రమ్ నీ ఇరికించాలని కదా నువు చెప్పాలి..

  5. “త్రివిక్రమ్ గారు తన సినిమాలో నాకు తప్పకుండా అవకాశం ఇస్తారు.ఇందు కోసం ఏదో ఒక క్యారెక్టర్ సృష్టిస్త్తారు “-అత్తారింటికి దారేది సక్సెస్ మీట్ లో నటి బంగారం కామెంట్..ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించని బెంగుళూరు బంగారం.

  6. తప్పు చేసిన వాడ్ని ఎమ్మెల్సీ చేసి పక్కన పెట్టుకోవడానికి అందరూ జగన్ రెడ్డి లా ఉంటారనుకుంటున్నావా రా ఆరికట్ల .

  7. పూనం కౌర్ తో త్రివిక్రమ్ కానీ వేరెవరన్నా కానీ తప్పుగా ప్రవర్తిస్తే ముమ్మాటికి తప్పే..

    కానీ యాక్టింగ్ పరంగా ఆమె చాలా వీక్, త్రివిక్రమ్ అవకాశాలు ఇవ్వలేదు సరే, మిగతా వాళ్లు కూడా ఎందుకు ఇవ్వలేదు? 2009 లో శౌర్యం అనే సినిమా లో గోపీచంద్ కి చెల్లి గా చూసిన గుర్తు, అంటే 15 ఇయర్స్ బ్యాక్..

    యూట్యూబ్ ఇంటర్ లో కూడా ఆమె చెప్పేవి వింటే బై పోలార్ అనే డౌట్ రాక మానదు (ఆమె ఆరోగ్యాన్ని కించపరచాలని కాదు నా ఉద్దేశం)

    పవన్ కళ్యాణ్ పేరు చెప్తే సిగ్గుపడిపోవటం ఇలా ఏవేవో వింత సమాధానాలు 

  8. చాలా తెలివైనదానిని అని ఆమె విశ్వాసం.. అడపా దడపా ఏవో మర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ఏదో అలా అల్పసంతోషం పొందుతూ తన ఉనికిని కాపాడుకుంటుంది.. అయితే జనాలకి ఆమెని అర్ధం చేసుకునే అంత గొప్ప తెలివి లేదని తెలుసుకునే తెలివి ఆమెకు లేదు పాపం…

  9. మీరు ఏదో ఆశిస్తున్నారు GA గారూ.. అది అందీ అందనట్లు… దొరికీ దొరకనట్లు… అవుతుంది. పాపం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. 😂

  10. Edo meeru ild rojuki oka article raasi tanalanti valanni lime lite unchutarani ila chestundi anthe. and meeru gorrelu laaga articles mida articles rastaru vere ee issue lenatlu

Comments are closed.