ఎన్టీఆర్ కి, నానికి ఒకే తరహా ప్రచారమా?

ఇంకా చెప్పాలంటే, తమిళనాట నాని చేసిన ప్రచారమే అంతోఇంతో బాగున్నట్టు, కాస్త మెరుగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. దేవర ప్రచారం మరీ తీసికట్టుగా ఉంది. ప్రెస్ మీట్ పెట్టారు, అంతా ముక్తసరిగా మాట్లాడారు. మమ అనిపించారు.…

ఇంకా చెప్పాలంటే, తమిళనాట నాని చేసిన ప్రచారమే అంతోఇంతో బాగున్నట్టు, కాస్త మెరుగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. దేవర ప్రచారం మరీ తీసికట్టుగా ఉంది. ప్రెస్ మీట్ పెట్టారు, అంతా ముక్తసరిగా మాట్లాడారు. మమ అనిపించారు. ఈ మాత్రం దానికే పాన్ ఇండియా అప్పీల్ వస్తే గొప్ప విషయమే అనుకోవాలి.

కొన్ని రోజుల కిందటి సంగతి.. సరిపోదా శనివారం సినిమా ప్రచారం కోసం నాని అండ్ గ్యాంగ్ చెన్నైలో ల్యాండ్ అయింది. మొత్తంగా ఓ వైబ్ కనిపించింది. ఇటు ఎస్ జే సూర్య, అటు నాని, మధ్యలో ప్రియాంక కలిసి రక్తి కట్టించారు.

మరీ ముఖ్యంగా మీడియాతో ఇంటరాక్షన్ రంజుగా సాగింది. ఎన్నో అంశాలు తెరపైకొచ్చాయి, వాటికి నాని, ఎస్ జే సూర్య ఇచ్చిన సమాధానాలు వైరల్ అయ్యాయి.

అలాంటి వైరల్ కంటెంట్ దేవర తమిళ ప్రచారంలో ఒక్కటి కూడా కనిపించలేదు. ప్రింట్ మీడియాతో ఏం మాట్లాడారనేది బయటకురాలేదు. అన్నింటికంటే ముఖ్యంగా అసలు తమిళ ఆడియన్స్ దేవర సినిమా ఎందుకు చూడాలనే ప్రశ్నకు సమాధానమే దొరకలేదు చెన్నై ప్రెస్ మీట్ తో.

దేవర నిస్సందేహంగా పాన్ ఇండియా సినిమా. అందులో ఎవ్వరికీ ఇసుమంత కూడా అనుమానం లేదు. ఆ స్థాయికి తగ్గట్టే ముంబయి ప్రమోషన్ ను గ్రాండ్ గా చేశారు, ముగించారు. చెన్నై ప్రెస్ మీట్ లో, ప్రమోషన్స్ లో అంత గ్రాండ్ నెస్ కనిపించలేదు. కనీసం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ముక్తసరిగా అనిరుధ్ తో 2 లైన్ల పాట పాడించారు.

తమిళనాట దేవరకు హైప్ తీసుకురావాలంటే ఇది సరిపోదు. అక్కడి ఆడియన్స్ కు మరింత రీచ్ అవ్వాలంటే ఇంకేదైనా చేయాలి. ఈ కోణంలో దేవర యూనిట్ ఆలోచిస్తే బెటర్. మొన్నటికిమొన్న విక్రమ్, తన సినిమా ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాల్లో కలియతిరిగాడు. ఎన్టీఆర్ అంత కష్టపడగలడా?

దేవర-1 తమిళ ప్రమోషన్స్ అప్పుడే ముగిసిపోలేదు. ‘ఎన్టీఆర్ అండ్ కొ’ కొత్తగా ఏమైనా చేస్తుందేమో చూడాలి.

6 Replies to “ఎన్టీఆర్ కి, నానికి ఒకే తరహా ప్రచారమా?”

  1. Saripoda sanivaram ekkuva Tamil flavor unna cinema, heroine popular Tamil lo. Peru ki pratinayakudainaa cinema ni mosina sj Surya tamil. Devara ki anirudh tappa ae factor ledhu tamil audience ni attract cheyataniki

  2. మన వాళ్ళు ఎంత ప్రచారాలు చేసినా తమిళ ప్రేక్షకులు మన సినెమాలు చూడరు, అందులోను రెగ్యులర్ యాక్షన్ ఫార్మాట్ లో సాగుతున్న ఈ సినెమాను పట్టించుకోరు

Comments are closed.