శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజక వర్గంలో బీజేపీ, టీడీపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ధర్మవరంలో తాము చెప్పిందే జరగాలని టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ తేల్చి చెప్పారని అంటున్నారు. ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లిఖార్జున్ అనే అధికారి మంత్రి సత్యకుమార్ సిఫార్సుతో వచ్చారు. అయితే తమకు ఇష్టం లేని మల్లిఖార్జున్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని పరిటాల వర్గం స్పష్టం చేసింది.
తమ సమ్మతి లేకుండా మల్లిఖార్జున్ బాధ్యతలు తీసుకుంటే కాళ్లు విరగ్గొడుతామని పరిటాల వర్గం హెచ్చరింది. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున్‌పై దాడికి యత్నించడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెబుతోంది.
గత ఎన్నికల్లో బీజేపీ నాయకుడు సూరికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాకుండా అడ్డుకునే క్రమంలో ఆ పార్టీకి చెందిన సత్యకుమార్‌ను పరిటాల వర్గం ఆహ్వానించింది. అయితే ఇప్పుడు సత్యకుమార్ మేకులా తయారయ్యాడని, తమకు సంబంధం లేకుండా అధికారుల నియామకంతో పాటు పనుల్ని కేటాయిస్తున్నారని పరిటాల వర్గం రగిలిపోతోంది.
రోజురోజుకూ ధర్మవరంలో బీజేపీ, టీడీపీ మధ్య విబేధాలు పెరగడం రెండు పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది. మంత్రి సత్యకుమార్ ఏదీ మాట్లాడకపోయినా, తాను చేయదలుచుకున్నది సైలెంట్‌గా చేసుకెళ్తున్నారని పరిటాల వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమను తొక్కే పని చేస్తున్నారని ఆ వర్గం ఆరోపిస్తోంది.
Ha… ha
Call boy works 9989793850
సత్యకుమార్ ఏమీ మాట్లాడక పోవడమా?? మొన్ననే కదా అసలు అన్నీయ్య ఎలా సీఎం అయ్యాడో ..అసలు ఇలాంటి వాడిని సీఎం చేసినందుకు భవిష్యత్తు తరాలు క్షమించవు అన్నాడు!