చైతూ-అఖిల్-నాగ్.. సేమ్ లుక్

నాగార్జున ఎప్పుడూ క్యాజువల్ గా కనిపిస్తారు. సినిమా కోసం మేకోవర్ అయినా ఆ లుక్ ను దాచిపెట్టడం, మీడియాకు దూరంగా ఉండడం లాంటివి పెద్దగా జరగవు. ఈసారి కూడా అదే జరిగింది. సైమన్ లుక్…

నాగార్జున ఎప్పుడూ క్యాజువల్ గా కనిపిస్తారు. సినిమా కోసం మేకోవర్ అయినా ఆ లుక్ ను దాచిపెట్టడం, మీడియాకు దూరంగా ఉండడం లాంటివి పెద్దగా జరగవు. ఈసారి కూడా అదే జరిగింది. సైమన్ లుక్ లో ప్రత్యక్షమయ్యారు నాగ్.

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో నాగార్జున కూడా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారి విలన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు సైమన్. ప్రస్తుతం ఆయన ఇదే గెటప్ లో కనిపిస్తున్నారు.

రీసెంట్ గా కూలీ సినిమాకు సంబంధించి వీడియో లీక్ అయింది. ఓ యాక్షన్ సీన్ లో వైట్ అండ్ వైట్ సూట్ ధరించి, చేతిలో సుత్తి పట్టుకొని, ఓ వ్యక్తిని కొట్టి చంపే సీన్ అది. ఆ వీడియోలో నాగ్ లుక్ బాగా వైరల్ అయింది.

ఇప్పుడు అదే లుక్ తో నాగ్ కనిపిస్తున్నారు. తండ్రి ఏఎన్నార్ శతజయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన వేడుకలో సైమన్ లుక్ లో కనిపించారు నాగ్. కూలీ సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సినిమా షూట్ కంప్లీట్ అయ్యేంతవరకు నాగార్జున ఇదే లుక్ మెయింటైన్ చేయబోతున్నారు.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం అక్కినేని హీరోలంతా గుబురు గడ్డం, జులపాల జుట్టుతో కనిపిస్తున్నారు. తండేల్ కోసం నాగచైతన్య, కొత్త సినిమా కోసం అఖిల్, కూలీ కోసం నాగార్జున భుజాల వరకు జుట్టు పెంచారు. సుశాంత్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. హీరోలంతా ఒకే లుక్ లో కనిపిస్తున్నారు.

4 Replies to “చైతూ-అఖిల్-నాగ్.. సేమ్ లుక్”

  1. King allways king

    కూలి లో నాగ్ ది విలన్ పాత్ర కాదురా బాబూ

    రజనీకాంత్, నాగార్జున మల్టి స్టారర్ మూవీ

Comments are closed.