తిరుపతి లడ్డూలో ‘మా’ లొల్లి

శ్రీవారి మహాప్రసాదం తిరుపతి లడ్డూ చుట్టూ నడుస్తున్న చర్చ-రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇది రకరకాల మలుపులు తిరుగుతోంది. రాష్ట్రాన్ని దాటి కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడీ అంశం మరోసారి ‘మా’ లొల్లికి…

శ్రీవారి మహాప్రసాదం తిరుపతి లడ్డూ చుట్టూ నడుస్తున్న చర్చ-రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇది రకరకాల మలుపులు తిరుగుతోంది. రాష్ట్రాన్ని దాటి కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడీ అంశం మరోసారి ‘మా’ లొల్లికి ఆజ్యం పోసింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా నటులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ‘నువ్వెంతంటే నువ్వెంత’ అనే వరకు వెళ్లారు ఇద్దరూ. “పవన్ కల్యాణ్ సినిమా మార్నింగ్ షో వసూళ్ల పాటి చేయదు నీ సినిమా బడ్జెట్” అంటూ చాలా పెద్ద కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్ అప్పట్లో. దాన్ని మంచు విష్ణు కూడా అంతే సమర్థంగా తిప్పికొచ్చారు.

ఇప్పుడీ ఇద్దరూ మరోసారి మాటల యుద్ధానికి తెరతీసినట్టు కనిపిస్తోంది. తిరుపతి లడ్డూ ఇష్యూకు సంబంధించి పవన్ కల్యాణ్ ను విమర్శించారు ప్రకాష్ రాజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్, ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి అనవసర భయాలు కల్పిస్తున్నారని.. కేంద్రంలో ఉన్న ఆయన స్నేహితుల్ని ప్రసన్నం చేసుకునేలా పవన్ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. ఇప్పటికే దేశంలో చాలా మతఘర్షణలున్నాయి, ఈ వివాదాన్ని ఇంకా పైకి తీసుకెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

దీనిపై మంచు విష్ణు ఫైర్ అయ్యాడు. ప్రకాష్ రాజ్ అంతగా అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు విష్ణు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ సమగ్ర విచారణ కోరారని, ప్రకాష్ రాజ్ అంతలా ఆవేశపడాల్సిన అవసరం లేదన్నారు.

పైపెచ్చు ఇలాంటి ఇష్యూలో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు తలదూరిస్తే, అది మతపరమైన రంగు పులుముకుంటుందేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాడు. మీ హద్దుల్ని మీరు ఉంటే మంచిదంటూ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు.

పవన్ కల్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తే.. మధ్యలో మంచు విష్ణు అందుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా ఇద్దరి మధ్య గతంలో ఉన్న విభేదాల నేపథ్యంలో.. ఈ ఇష్యూ మీద వాళ్లు మరోసారి మాటల యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

18 Replies to “తిరుపతి లడ్డూలో ‘మా’ లొల్లి”

  1. గ్రే*ట్ ఆం*ద్ర! మొత్తానికి ప్యాలస్ లో నిమ్మళంగా రెస్ట్ తీసుకుంటున్న జగ*న్ నీ జై*లు కి పం*పడానికి కంకణం కట్టుకున్నవావ ఏంది!

    అధ*ర్మరెడ్డి నో*రు తెరిస్తే, తన చేత ఆ దరి*ద్రం ప*నులు చెపిం*చిన జ*గన్ సం*గతి పోలిసు రికార్డుల్లో ఎక్కుతుంది. వెంటనే జ*గన్ ను బొ*క్కలోకి తోస్తారు కో*ర్టు వాళ్ళు.

  2. YV సుబ్బ రెడ్డి కొర్ట్ కి వెళ్ళింది, GA చెపుతునట్టు CBI విచరణ వెయమని కాదు. తన మీద విచారణ ఆపమని.

    .

    newindianexpress.com/states/andhra-pradesh/2024/Sep/21/andhra-yv-subba-reddy-files-petition-in-hc-against-vigilance-probe

    1. TTD former chairman and MP YV Subba Reddy on Friday filed a petition in the Andhra Pradesh High Court, seeking a directive to quash the Vigilance and Enforcement Department probe against him for alleged irregularities committed during his stint as the head of the TTD Trust Board.

      .

      He explained that the TTD is an autonomous body and takes decisions collectively. Any probe by the Vigilance department amounts to compromising the TTD’s autonomy, he added. The Vigilance Department can probe only government departments, he said.

    2. TTD former chairman and MP YV Subba Reddy on Friday filed a petition in the Andhra Pradesh High Court, seeking a directive to quash the Vigilance and Enforcement Department probe against him for alleged irregularities committed during his stint as the head of the TTD Trust Board.

    3. TTD former chairman and MP YV Subba Reddy on Friday filed a petition in the Andhra Pradesh High Court, seeking a directive to qu@sh the Vigilance and Enforcement Department probe against him for alleged irregularities committed during his stint as the head of the TTD Trust Board.

      .

      He explained that the TTD is an autonomous body and takes decisions collectively. Any probe by the Vigilance department amounts to compromising the TTD’s autonomy, he added. The Vigilance Department can probe only government departments, he said.

  3. నా బోంద . ఒకరు వేరే మతం. ఇంకొకరి పైకి ఒకటి, ఇంట్లో ఇంకొకటి. దొందు దొందే.

  4. నిరక్షరాస్యులు అది చదుకున్న అజ్ఞానులు ఎక్కువ ఉండడం వలన మరియు మతపరమైన విషయాలు ఎవడు చెప్పిన విషయం పరిజ్ఞానం సమస్య తలా తోక తెలియకుండా ఎవరో ఒకర్ని నిందించే జనాలు ఎక్కువగా ఉన్నారు. మొదటగా బీజేపీ లీడర్ లు వల్లే హిందూ మతాన్ని కనిపెట్టినట్టు మాట్లాడతారు. లీడర్ లు అందరూ పబ్లిక్ తన ఇమేజ్ పెంచుకుని తన స్వార్థ ప్రయోజనాలకోసం ఎలాంటి సున్నిత మైన ఇష్యూ లను ప్రస్తావిస్తారు. నెయ్యి కూడా అనిమల్ ఫాట్ ఏ. అసలు ఇప్పుడు ఇప్పుడు నాటి ఆవు నెయ్య తో లడ్డు చేసే సామర్థ్యం టీటీడీ బోర్డు కు ఉందా. ఒకప్పుడు ౫ ఏళ్లకు ఒకసారి తిరుపతి కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సంవత్సరానికి ౫ సార్లు వెళ్తున్నారు. లడ్డు బిజినెస్ అయిపోయింది. సుబ కాంట్రాక్టర్ లు కూడా హిందువు లే కదా వాళ్ళు ఎక్కడ నుంచి కొనొకొకొని వచ్చారు. కాంద్ర బాబు స్తయి వ్యక్తి నిజం గ అనిమల్ ఫాట్ ఉన్న సెన్సిటివ్ ఇష్యూ దృష్ట్యా బయటకు చెప్పకుండా ఇన్వెస్టిగేట్ చేసి వార్న్ చెయ్యాల్సిది. ఆయనకు మరియు చాలామందికి దేవుడు మీద నమ్మకం లేదు. వాళ్లకు దేవుడు అంటే పబ్లిక్ కి నేను నమ్ముతాను అని ప్రూవ్ చేసుకోడానికి ఫొటోస్ కి వచ్చి వెళ్లారు. మఅంచు బాబులు ఫీజు రేయింబర్సు డబ్బు కోసం బాబు ని కాకా

    పడుతున్నారు.

Comments are closed.