ఒత్తిడులు ఉన్నాయ్.. మెత్తబడేది ఎవ్వరు?

కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీ మధ్య వ్యవహారం రచ్చకెక్కి సుమారు నెలరోజులు కావస్తోంది. ఈలోగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాదంబరి…

కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీ మధ్య వ్యవహారం రచ్చకెక్కి సుమారు నెలరోజులు కావస్తోంది. ఈలోగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాదంబరి బెజవాడ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత.. ఆమె మీద గతంలో కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడి ఉంది. వారి మీద విచారణ సాగుతోంది. ఇప్పుడు పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్.. డెహ్రాడూన్ లోని ఒక రిసార్టులో పోలీసులకు దొరికారు. అయితే విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నది ఏంటంటే.. కీలకంగా విచారణ ఎదుర్కొంటున్న నలుగురిలో ఒత్తిడులకు ఎవరు మెత్తబడతారు? ఎవరు లొంగిపోతారు? అనేది ముఖ్యం అని!

ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి లక్ష్యమూ ఆశయమూ కాకపోవచ్చు. కావలిస్తే వారికి మళ్లీ పోస్టింగులు మంచివే ఇస్తారు కూడా. అలాగే కుక్కల విద్యాసాగర్ కూడా వారికి మెయిన్ టార్గెట్ కాదు. వారికి వైసీపీలో పెద్దతలకాయల పేర్లు కావాలి. ఆ పేర్లు ఈ నలుగురిలో ఎవరో ఒకరి నోటి గుండా రావాలి. వీరు వెల్లడించే వివరాల్లో.. వైసీపీ పెద్దతలకాయల పేర్లు కీలకంగా ధ్వనించాలి. అప్పుడు వాళ్లను కూడా పట్టుకొచ్చి జైల్లో వేయాలి. ఇదే టార్గెట్ తో విచారణ పర్వం సాగవచ్చుననే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.

ఐపీఎస్ అధికారుల్లో విశాల్ గున్నీ ఇప్పటికే.. ఈ కేసు వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదని.. సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయని, సీనియర్ ఐపీఎస్ ఆంజనేయులు పిలిపించి తమకు పని అప్పగించారని వెల్లడించినట్టుగా విచారణలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

ఆంజనేయులు లెవెల్లో కాకుండా, ఆయనను పురమాయించిన ఆ పై వ్యక్తులు ఎవరు అనేది పోలీసులకు కావాలి. కుక్కల విద్యాసాగర్ కూడా ఈ గేమ్ లో ఒక పావుగా తనను తాను ప్రొజెక్టు చేసుకుంటే బహుశా పోలీసులు మన్నిస్తారేమో.. కానీ, ఆయన వైసీపీ పెద్ద తలకాయల వ్యూహంలో భాగంగానే అలా జరిగిందని చెప్పడాన్ని పోలీసులు కోరుకుంటారనేది అంచనా.

ఫలానా పేర్లు, ఫలానా కారణాలు ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్న ఈ నలుగురి నోటినుంచి బయటకు రావాలని వారు ఆశిస్తారు. ఆ మేరకు విచారణలో తీవ్రంగా ప్రలోభపెడతారు.. ఒత్తిడికి గురిచేస్తారు. మరి ఈ నలుగురిలో ఎవరు తొందరగా మెత్తబడతారో, ఇంకా ఎవరెవరి మెడకు ఈ కేసు చుట్టుకుంటుందో వేచిచూడాలి.

10 Replies to “ఒత్తిడులు ఉన్నాయ్.. మెత్తబడేది ఎవ్వరు?”

  1. వాడు CM అయ్యింది .STATE .ని develop చెయ్యడానికి కాదు ..వాడికి నచ్చిన పై..సాచి..క పనులు చెయ్యడానికి.

    ప్రజలు బ..రించ…లెక వం..గొపె…ట్టెసారు..ఇక జివితంలొ వాడ్ cm కాలెడు

    1. Ippudu baaga chestunaru ga dongala party na kodukulu schools ni peeki padadobbutunnaru cbse lepesaru mundu vaati kosam matladara kinda gorri 100 rojulu em peekado danikosam matladara Anni caselu pettadam tappa okkati kuda prove cheyleka Nana sankalu naakutunnaru aaa pk gaadu gudda noru muskoni kurchunnadu miru sagam sagam knowledge na kodukulu matladataru😂😂😂

  2. ఇది మారీ బావుంది!!

    దీని వెనుక జగన్ ఉన్నాడు అని చిన్న పిల్లొడికి కూడా అర్ధం అవుంది. కాని ఆ దిశగా మాత్రం విచారణ చెయకూడదు, అలా చెయటం నేరం గొరం అనట్టు రాస్తావు ఎమిటిరా

  3. పెద్ద తలకాయలకు తెలియకుండా ఇంత పెద్ద తప్పు చేస్తారా? వీళ్ళకి అంత అవసరం ఏమి వచ్చింది?

  4. oreyi erripooka cheyalchinadi antha nuvvu anukone pedda talakayalu chesarani ardham avuthundi.kakapothe vallakante munde nuvvu cheppavu peddatalakayalu ani.donga ani donga chebuthada neelaga poramboka.neelanti vari vallane jaganki ee paristhithi vachindi pattindi raa erripooka.

    vapunu choopi balupu ani dabbalu kottavu kadara poramboku gaa eppudaina inka meeku ardham kavadam ledu kadara erripooku gaa.

  5. ఇంకెవరు బ్రో మీ సకల శాఖమంత్రి సజ్జల, వస్తాడు చూడు, నీకు తెలిసే ఉండలే…

Comments are closed.