ఊబిలో కూరుకుపోతున్న చంద్ర‌బాబు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రోజురోజుకూ ఊబిలో కూరుకుపోతున్నారు. అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి, ఇంత త్వ‌ర‌గా ప‌రిపాల‌న‌లో తేలిపోతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. క‌ళ్లెదుటే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. మ‌రోవైపు ఘోరంగా ఓడిపోయిన వైఎస్…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రోజురోజుకూ ఊబిలో కూరుకుపోతున్నారు. అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి, ఇంత త్వ‌ర‌గా ప‌రిపాల‌న‌లో తేలిపోతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. క‌ళ్లెదుటే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. మ‌రోవైపు ఘోరంగా ఓడిపోయిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కూట‌మి చ‌ర్య‌లే క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో పైకి లేపుతున్నాయి.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు, చేప నూనె క‌లిపార‌నే చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. ముఖ్య‌మంత్రి స్థాయిలో చంద్ర‌బాబు ఆరోపించ‌డం, గ‌త ప్ర‌భుత్వ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్రిస్టియ‌న్ కావ‌డంతో జ‌నం కూడా అనుమానించారు. ఎక్కువ మంది నమ్మారు. నిజం గ‌డ‌ప దాటే లోపు, అబ‌ద్ధం దేశ‌మంతా చుట్టేసింది.

చేతిలో అధికారంతో పాటు బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ వుండ‌డంతో జ‌గ‌న్‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు చేసినా న‌మ్మించొచ్చ‌ని తిరుమ‌ల ప్ర‌సాదంపై ఆరోప‌ణ‌లు చేశారు. రెండు మూడు రోజుల పాటు టీడీపీకి రాజ‌కీయంగా క‌లిసొచ్చిన‌ట్టే క‌నిపించింది. ఆ త‌ర్వాత వైసీపీ తేరుకుని, వాస్త‌వాలేంటో మాట్లాడ్డం జ‌గ‌న్‌తో స‌హా ఆ పార్టీ నాయ‌కులు మొద‌లు పెట్టారు.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో వైసీపీ పిటిష‌న్ వేయ‌డం, విచార‌ణ‌లో భాగంగా అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంతో చంద్ర‌బాబుతో స‌హా కూట‌మి నేత‌లు షాక్‌కు గుర‌య్యారు. ఇప్పుడేమీ మాట్లాడ‌లేని ద‌య‌నీయ స్థితిలో కూట‌మి నేత‌లు ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై తిట్ట‌ని వాళ్లు లేరు.

ప్ర‌త్య‌ర్థిని రాజ‌కీయంగా ఇర‌కాటంలో ప‌డేసి, ల‌బ్ధి పొందేందుకు చివ‌రికి తిరుమ‌ల ప్ర‌సాదాన్ని కూడా వాడుకుంటారా? అని నిల‌దీస్తున్నారు. ఇంతకాలం చంద్ర‌బాబుకు దేశ వ్యాప్తంగా ఉన్న ఇమేజ్‌… తిరుమ‌ల ప్ర‌సాదంపై అబద్ధాలు చెప్పార‌ని తేల‌డంతో తీవ్రంగా దెబ్బ‌తింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే త‌న‌కు తెలియ‌కుండానే చంద్ర‌బాబు పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. ఎందుకిలా అవుతున్న‌దో కూడా కూట‌మి నేత‌ల‌కు దిక్కుతోచ‌డం లేదు.

45 Replies to “ఊబిలో కూరుకుపోతున్న చంద్ర‌బాబు”

    1. Kalthi jariginattu chupinchamani adigindhi

      Lab report icharu

      Mari a ghee laddu lo use chesara ? Ani adigindhi. No answer

      EO Conference and press meet lo No Ani cheppinaka

      CBN nuv endhuku Ila annav ?

      Asal ghee use chesara ledha annadaniki kuda Answer ledhu

      Frst positive report vasthe inko chota endhuku test cheyaledhu

      Inni days endhuku bayatiki cheppaledhu

      E SIT ni a time endhuku (reports time) lo bayatiki veyaledhu

      Prathidhi No Answer

      Astadigbandhanam ayyaru

  1. పేరిన నెయ్యి లో ఇరుక్కున్నాడు నెయ్యి కి కూడా కోపం వచ్చింది. సుప్రీం court కు కూడా నెయ్యి వాసన తెలుసు. అందుకే టక్కున తప్పు పట్టింది.

  2. వందలాది మొట్టికాయలు తిన్న మా అన్నయ్య బాగా ఉన్నాడంట..

    ఒక్క మొట్టికాయ తో చంద్రబాబు పని అయిపోయుందంట ..

  3. ఊబి చంద్రబాబు దయితే జగన్ ది గట్టెక్కిన బాపతా? తాడేపల్లి కలలు అలా ఉంటాయి. ఊబి మొదటినుండి గ్రేట్ ఆంధ్రా కే కనిపిస్తోంది. జగన్ క్యాడర్ ఏమయ్యింది? పాపం తిరుపతి పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నట్టు? బాబు కి ఢోకా లేదు. జగన్ కి బాకా ఊదేవాడు లేడు. ఏవో ఆంధ్రా పత్రికలు తప్ప

  4. Bokmem kaadhaa, tirupathi laddu aaropanalu abaddham ayithe aa vishayam lo janam jagan ni thittatam aaputharemo kaani cbn ni janaalu niladhesesthru ani expect cheyaku.. Alaa niladheeyali anedhi mee korika matrame, vaasthavam ga jarigedhi kaadhu. Bcoz ttd ni jagan nasanam chesadu anedhe ap lo unna majority hindhuvulu nammedhi. Ee okka vishayan lo jagan bayatapadinaa jagan midha negativity alaage untundhi ttd vishayam lo.

  5. It is heard in media that this is just to divert the attention of AP people on his 100 days ruling from his failure on promises he has given and to hide Amaravati flood affected.

    It is in the media that whole CBN’s political career happening with publicity stunt at state and national levels. With his sound media support he can manage any system which even cannot be managed by national level top political person

  6. ఇప్పటి దాకా కేంద్రంలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. అంటే ప్రధానమంత్రి జుట్టు మన బాబు గారి చేతిలో ఉండేది. ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం తరువాత అంతా తారుమారు అయ్యి ఇప్పుడు బాబు గారి జుట్టు మోడీ గారి చేతిలోకి పోయింది.

    తాను తీసుకున్న గోతిలో తనే పడటం అంటే ఇదేనేమో !!

  7. Ga గాడికి తీట ఆగట్లేదు కోర్టు ఆధారాలు అడిగింది ఆధారాలు సమర్పించినా తరువాత ga గాడు వైసిపి 🐏 తలకాయ గుద్దలొ పెట్టుకుంటారు

  8. ఇలాంటి చెత్త వార్తలు రాస్తే జనాలకు ఎక్కవు…పిచోళ్ళ కింద లెక్కేస్తారు

  9. రొంబా సంతోషం ఈ ga గాడికి ఈ సంతోషంతో ఉబ్బితబ్బి అయిపోయి బీపీ వచ్చి ఈ ముసలోడు సచ్చే లా వున్నాడు

  10. టిడిపి కంటే సైకో పావలా గాడి ఓవరాక్షన్ నీ మాత్రం జనాలు ఛీదరించుకుంటున్నారు.. బలమైన సంతాన ధర్మం కోసం ప్రాణాలు అర్పిస్త అంటున్నాడు.. ఆ పని చేస్తే ప్రజల కోసం పని చేసే కొత్త DCM వస్తాడు అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు..

  11. గ్రేట్ ఆంధ్ర చెబుతున్నట్లు లడ్డూ విషయంలో చంద్రబాబు ఇమేజ్ ఏమీ డామేజ్ కాలేదు అలాగే.. గ్రేట్ ఆంధ్ర చెబుతున్నట్లుగా జగన్ ఏ మాత్రం బలం కూడా పుంజుకున్నది కూడా ఏమీ లేదు. అంతా గ్రేట్ ఆంధ్ర భ్రమ మాత్రమే

  12. బాబు గారికి ఏమి అవ్వదు… మీరు ఎన్ని తప్పుడు వార్తలు వడ్డీంచిన కూడా… సైకో లేకపోవటం వలన ఇప్పుడు రాష్ట్రం హాయిగా ఉంది

Comments are closed.