లడ్డూపై కోర్టు కామెంట్ల అనంతరం..!

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నది వెనకటికి సామెత. దేశంలో కోర్టుల పరిస్థితి అలాగేె వుంది. వివాదాస్పద కేసులు, వివాదాస్పద కామెంట్లు, పరిధి దాటిన మాటలు, ఇలాంటివి అన్నీ చాలా కలిసి…

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నది వెనకటికి సామెత. దేశంలో కోర్టుల పరిస్థితి అలాగేె వుంది. వివాదాస్పద కేసులు, వివాదాస్పద కామెంట్లు, పరిధి దాటిన మాటలు, ఇలాంటివి అన్నీ చాలా కలిసి కోర్టులను సోషల్ మీడియాలోకి తీసుకువస్తున్నాయి. ఒకప్పుడు న్యాయమూర్తులు అంటే ఎవరు, ఏమిటి అన్నది ఎవరికీ తెలిసేది కాదు. కోర్టులతో పనులున్న వారికి తప్ప అసలు కోర్టు పద్దతులు తెలిసేవి కాదు. న్యాయమూర్తులను ఎవరైనా కలవడం అనే మాట పెద్దగా వినిపించేది కాదు. ఫోటోలు కనిపించేవి కాదు.

కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. రాజ‌కీయ ప్రేరేపిత వాజ్యాలు పెరిగిపోయాయి. అలాంటి కేసుల్లో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా అప్పుడప్పుడు వినిపించడం మొదలైంది. న్యాయమూర్తులు పబ్లిక్ లోకి రావడం, నీరాజ‌నాలు అందుకోవడం కూడా మామూలు అయింది. ఒకప్పుడు రిటైర్డ్ న్యాయమూర్తులు అంటే ఏదైనా కమిషన్ వేస్తే అవకాశం వుండేది. ఇప్పుడు పదవులు వెదుక్కుంటూ వెళ్తున్నాయి.

లాయర్లుగా వుంటూ రాజ‌కీయాలతో చెట్టాపట్టాలు వేసుకుని, రాజ‌కీయ నాయకుల తరపున వాదించి తరవాత న్యాయమూర్తులుగా మారుతున్న వారు ఇవ్వాళ రేపు కొత్త కాదు. దశాబ్దాల కాలంగా జ‌రుగుతోంది. ఎనభయ్యవ దశకంలో ఒక మారుమూల జిల్లాలో ఎస్సై మీద చేయి చేసుకున్న లాయర్ తరువాత కాలంలో న్యాయమూర్తి అయ్యారని వార్తలు వినిపించాయి. అలాగే అదే జిల్లాలో అత్యాచార ప్రయత్న అరోపణలు ఎదుర్కున్న లాయర్ కూడా న్యాయమూర్తి అయ్యారన్న వార్తలు వుండేవి.

ఇవి ఇప్పుడు ఎందుకు తవ్వడం అంటే ఏ న్యాయవాది ఎప్పుడు న్యాయమూర్తిగా మారతారో, ఎప్పుడు ఏ కేసు సదరు న్యాయమూర్తి ముందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అలాంటి కేసు ప్రొసీడింగ్స్ లేదా తీర్పు టైమ్ లో పాత వ్యవహారాలన్నీ బయటకు తీయడం అన్నది ఇప్పుడు సోషల్ మీడియాకు పెద్ద పనిగా మారింది.

గతంలో చీటికి మాటికీ తేదేపా కోర్టులకు ఎక్కి వైకాపాను చికాకు పెట్టింది. అప్పుడు న్యాయమూర్తుల మీద పరిథికి మించిన కామెంట్లు వచ్చాయి. అలా చేసిన వారి మీద కేసులు కూడా పడ్డాయి. చీఫ్ జ‌స్టిస్ కాబోయే న్యాయమూర్తి మీద నేరుగా లేఖ రాసే సాహసాలకు దిగారు నాటి పాలకులు. గమ్మత్తేమిటంటే ఇప్పుడు అలాంటి వాళ్ల పేర్లు కీలక పదవులకు వినిపిస్తున్నాయి. అది వేరే సంగతి

నిన్నటికి నిన్న తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం సహేతకమైన వ్యాఖ్యానాలే చేసింది. ఈ లాజికల్ ప్రశ్నలు జ‌నాల్లో వినిపిస్తున్నవే. అందువల్లే కొర్టు కామెంట్లు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ముందుగా కోర్టు జ‌స్ట్ ఇనీషియల్ కామెంట్లు మాత్రమే చేసింది, ఇంకా తుది తీర్పు వుంది అప్పుడు చూద్దాం అనే పాయింట్ ను తెలుగుదేశం పట్టుకుంది. కోర్టు గట్టిగా చివాట్లు పెట్టింది అనే స్టాండ్ ప్రచారాన్ని యాంటీ తెలుగుదేశం వర్గాలు తీసుకున్నాయి.

కానీ ఇంతలోనే మరో పాయింట్ పీకారు. ఈ కేసు చూస్తున్న ఇద్దరు గౌరవ న్యాయమూర్తుల్లో ఒకరు 2013లో జ‌గన్ తరపున కేసులు వాదించారు అంటూ పాత లెక్కులు బయటకు తీసారు. నిజానికి గతంలో వైకాపా చేసింది ఇలాంటి పనే. ఇప్పుడు తేదేపా చేస్తున్నదీ అదే పని.

ఇలా అయితే ఇక న్యాయమూర్తుల బాధ్యతల నిర్వహణ మరింత కత్తి మీద సాముగా మారిపోతుంది. నాట్ మీ బిఫోర్ అనే టైపు వార్తలు ఎక్కువగా వినిపించే అవకాశం వుంది.

అంతా.. అంతా.. మారిపోతున్న రాజ‌కీయాలు లేదా దిగజారుతున్న రాజ‌కీయాల ప్రభావం. అంతే.

10 Replies to “లడ్డూపై కోర్టు కామెంట్ల అనంతరం..!”

  1. Any way thete are two judges in panel, if they both deliver same verdict then there will be no problem. AP govt should come forward and proactively ask independent enquiry else no one trusts the allegations made by babu.

    1. ఆ తు!గ్ల!క్ కామెంట్స్ చేసిన జడ్జి ఇంతకముందు నీచుడు జగన్ రెడ్డి కి బెయిల్ ఇప్పించినప్పుడు 2013 లో లాయర్ …చీప్ ట్రిక్స్ తో కాదు, బహిరంగంగా చెప్పుకుంటున్నాడు వాడిని కొనేశాము అని

  2. దొంగ పట్టుబడనంత మాత్రాన మంచోడు అయిపోడు లడ్డులు గతం లో తిన్న వాళ్లకు వైసీపీ ప్రభుత్వం లో తిన్న లడ్డు ను compare చేసుకోకుండా వుండరు వాళ్లకు తెలుసు దొంగ ఎవరో 320 రూపాయలకు స్వచ్ఛమైన ఆవునెయ్య ఇప్పుడు ఇస్తారో లేదో తెలిసి పోతుంది పోటులో వున్నా కార్మికులకు తెలుసు

  3. మన ఇంటికి డైలీ డెలివరీ అయ్యి మనం కాఫీ కి , పెరుగుకి వాడే మిల్క్ బ్రాండ్ క్వాలిటీ మీద డౌట్ వచ్చి ల్యాబ్ లో చెక్ చేయిస్తే యూరియా ,స్టార్చ్ , గ్లూకోస్ తో adulateration జరిగింది అని రిపోర్ట్ వచ్చింది ! వెంటనే ఆ సప్లయర్ ని కాన్సిల్ చేసి వేరే బూత్ నుంచి వేరే బ్రాండ్ మిల్క్ స్టార్ట్ చేశాము అనుకోండి ..

    రాజ్యాంగ సంస్థ లో కే సు వేశాము !

    ఆ పాలే మీరు కాఫీ కి, పెరుగుకి వాడుతున్నారు అని సాక్ష్యం ఏంటి? అని ఎవరైనా అడిగితే ? ఆ లాజిక్ కి ఆ అతి తెలివి కి ఏం సమాధానం చెప్తారు?

    సరే అని ఆ పాలే కాఫీ కి పెరుగు కి వాడిన సాక్ష్యం కూడా చూపిస్తే… నెక్స్ట్ ఆ పెరుగు అవి ఆ ఇంట్లో మనుషులు తిన్నారు అని సాక్ష్యాలు ఉన్నాయా అంటారా?

    పోనీ మనుషులు తిన్నట్టు కూడా సాక్ష్యం చూపిస్తే … మీరే కల్తీ చేసుకొని తినలేదు అని సాక్ష్యాలు ఉన్నాయా ? అంటారా

    ఇలాంటి చా వు తెలివితేటలు, తమ వృత్తి అయిన దొం గ త నాలు చేసి దొరికి కూడా ఎవరు చెయ్యలేదు అని ప్రజలని బెదిరించి బతికెయ్యడం లాంటి అధమ స్థాయి చర్యల వల్లనే ఆ పార్టీ కి 11 సీట్లే ఇచ్చారు ప్రజలు.

    మన కో ర్టు లు /జ డ్జ్మెం ట్ లు కూడా అలాగే ఉన్నాయి .

    1. ఆబ్బో నీ వాదన సూపర్ రా ….నీ పేరు కూడా వాడకుండా ఎవరికి అందని లాజిక్ తో ……. ఒక్కటి మాత్రం అర్ధమైంది పొద్దున్నే లేచి నీళ్ళు కాకుండా వాళ్ళదే గ్లాస్ లో పట్టుకుని తాగుతున్నావ్ అని సూపర్ ehe 👍👏

      1. నీ దగ్గర ఉంటె నీ వాదన వినిపించు .. నా పేరు కిరణ్ కుమార్ రె డ్డి ప్రకాశం జిల్లా కనిగిరి .. ఒంగోలు లో టిప్ టాప్ టవర్స్ లో ఉంటాను .. వచ్చి పీకోనేది పీకో .. నువ్వు గాని నీ పార్టీ పో రం బో కు లు గాని .. కుప్పం ప్రసాద్ నీ క్లాస్లోమెంట్ ఇంటర్మీడియట్ వరకు . ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా ? నీ పార్టీ వాళ్ళు పెట్టె అశుద్ధం తిని తిని బుర్ర పాడైపోయింది రా మీకు . చె త్త నా కొ డ కా .

Comments are closed.