వినాశ‌కాలే… విప‌రీత బుద్ధి!

స‌హ‌జంగా ఎవ‌రికైనా దేవుళ్లంటే భ‌క్తితో పాటు భ‌యం వుంటుంది. దేవుళ్ల‌ను విశ్వ‌సించే వారిలో పాప‌భీతి వుంటుంది. త‌ప్పులు చేస్తే, దేవుళ్ల‌కు స‌మాధానం చెప్పుకోవాల్సి వుంటుంద‌ని భ‌యంతో ఎంతోకొంత జాగ్రత్త‌గా వుంటారు. దేవుళ్ల‌లో తిరుమ‌ల శ్రీ‌వారు…

స‌హ‌జంగా ఎవ‌రికైనా దేవుళ్లంటే భ‌క్తితో పాటు భ‌యం వుంటుంది. దేవుళ్ల‌ను విశ్వ‌సించే వారిలో పాప‌భీతి వుంటుంది. త‌ప్పులు చేస్తే, దేవుళ్ల‌కు స‌మాధానం చెప్పుకోవాల్సి వుంటుంద‌ని భ‌యంతో ఎంతోకొంత జాగ్రత్త‌గా వుంటారు. దేవుళ్ల‌లో తిరుమ‌ల శ్రీ‌వారు ఎంతో ప్ర‌త్యేకం. క‌లియుగ దైవంతో పెట్టుకుంటే, ఎంత‌టి వారైనా స‌ర్వ‌నాశ‌నం అవుతార‌ని ఉదాహ‌ర‌ణ‌ల‌తో కూడా చెబుతూ హెచ్చ‌రిస్తుంటారు.

అయితే క‌లియుగ దైవానికి తాను ప‌ర‌మ భ‌క్తుడిగా చెప్పుకునే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎందుకో ఆ దేవ‌దేవుని విష‌యంలో త‌ప్పు చేశార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీపై విచార‌ణ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రికి సుప్రీంకోట్టు త‌లంటింది. రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఇంత బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అని సుప్రీంకోర్టు నిల‌దీసింది. ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని ఆధారాలు చూపాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నిల‌దీసింది. దీంతో ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది స‌మాధానం లేక త‌డుము కోవాల్సి వ‌చ్చింది.

దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు కామెంట్స్‌తో ఆనందానికి లోన‌వుతున్నారు. అయితే సుప్రీం ఘాటు కామెంట్స్‌తో కూట‌మి నేత‌లు షాక్‌కు గుర‌య్యారు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే గ‌త ప్ర‌భుత్వంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని దేశ‌మంతా గుర్తించింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబునాయుడిపై సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

చంద్ర‌బాబునాయుడు అధికారం కోసం జ‌నానికి అబ‌ద్ధాలు చెప్పార‌ని గుర్తు చేస్తున్నారు. బాబుకు జ‌నం, జ‌గ‌న్ అంటే భ‌యం లేద‌ని, చివ‌రికి ఏడుకొండ‌ల స్వామి అన్నా భ‌యం లేక‌పోతే ఎలా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌సాదం విష‌యంలో చంద్ర‌బాబు ఏ మాత్రం భ‌య‌భ‌క్తులు లేకుండా అబ‌ద్ధాల్ని అల‌వోక‌గా చెప్ప‌డం అంటే… వినాశ‌కాలే విప‌రీత బుద్ధిగా చూడాలని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. తిరుమ‌ల అంటే ప్ర‌పంచం వ్యాప్తంగా హిందువుల ఆరాధ‌న క్షేత్ర‌మ‌ని చంద్ర‌బాబు విస్మ‌రించి, ఇదేదో జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ తీయ‌డానికి ప‌నికొస్తుంద‌నే త‌న మార్క్ కామెంట్స్ చంద్ర‌బాబు చేశార‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబుకు ఇది మాయ‌ని మ‌చ్చ‌గా చెబుతున్నారు.

అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించ‌కున్న కూట‌మి…చ‌క్క‌గా పాల‌న చేయ‌కుండా, మ‌తాన్ని అడ్డం పెట్టుకుని జ‌గ‌న్‌ను ఏదో చేయాల‌ని అత్యుత్సాహంలో అస‌లుకే ముప్పు తెచ్చుకుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇవాళ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను దేశ‌మంతా చుల‌క‌న‌గా చూస్తున్నారు. దీని నుంచి చంద్ర‌బాబు స‌ర్కార్ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

41 Replies to “వినాశ‌కాలే… విప‌రీత బుద్ధి!”

  1. వివేకా హత్య చేసింది చంద్రబాబు అని విచారణ చేయకుండా జగన్ రెడ్డి ఎలా చెప్పాడు ? సుప్రీమ్ కోర్ట్ దీనిపైనా ఏమి స్పందిస్తుంది ?

  2. “అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించ‌కున్న కూట‌మి…చ‌క్క‌గా పాల‌న చేయ‌కుండా…”

    ఎవడ్రా చక్కని పాలన అంటూ దుర్భాషలాడేది? నేడే pensioners కళ్ళల్లో ఆనందం. పెరిగిన విద్యుత్ charges మధ్యతరగతి చేసుకున్న పుణ్యం. అడ్డమైన హామీలు ఇస్తే ఆ వచ్చిన అధికార నుండి సవ్యమైన పాలన కూడా ఆశించడం…

  3. నీకు, మీ పార్టీ కు సుప్రీమ్ కోర్ట్ మీద, న్యాయమూర్థులు చేసే వ్యాఖ్యలు మీద వున్న గౌరవం చూసి వచ్చిన ఆనంద భాష్పాలకు

    కళ్ళు చెమర్చి ఏమి కనపడడం లేదు.

  4. కొంచెం ఆత్రం తగ్గింంచుకుని సీబీఐ లేదా సిట్ విచారణ ముగిసిన తరువాత ఇచ్చే రిపోర్ట్ వరకు వెయిట్ చెయ్యి. రేపు కల్తీ జరిగిందని, లేదా తిరుమల లో వేరే అవినీతి జరిగింది అని పొరపాటున బయట పడితే నీ వ్యాసలు అన్ని బూమరంగ్ అవుతాయి.

    ముఖ్యంగా సుప్రీమ్ కోర్ట్ కల్తీ జరగలేదు అని తీర్పు చెప్పలేదు. కేవలం ప్రశ్నలు అడిగారు మరియు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడిగారు.

    తుది తీర్పు వచ్చేవరకు వెయిట్ చేద్దాము.

    1. తిక్కలోడా టీటీడీ లో ఏమి జరగలేదు అంత మీ బాబు చేసాడు డ్రామా ఎలక్షన్ మీటింగ్ ల ఏదో నోటికి వస్తే అది మాట్లాడి నాడు

  5. నిజంగా బాబు కేవలం ఆరోపణలు చేయాలంటే ఎలక్షన్స్ ముందు చేసేవాడు. ఎలాగూ అతనికి నెట్వర్క్ ఉంటుంది టీటీడీ లో. అధికారం వచ్చేవరకు అఫిషియల్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేవరకు వైట్ చేసి మాట్లాడాడు. జూలై లో రిపోర్ట్ వస్తే ఇప్పుడు మాట్లాడాడు. అయినా కొంత మంది తిట్టారు ఇంత లేట్ గా చెప్తాడేంటి అని . ఒకవేళ ఇంకా సెకండ్ ఒపీనియన్ కోసం వెయిట్ చేసి చెప్పుంటే ఇన్ని నెలలు ఏం చేస్తున్నాడని అనే వాళ్ళు. ఎలా అయినా ఇబ్బందే ఆయనకి.

        1. 2nd opinion theeskoniki late ayyi unte accept chesevalu..but first report ne late ga chesar kabati confirm cheskokunda endhuku press meet lo cheparu ani adigindi court

  6. ఏంటి GA 3 రాజధాను లు అన్నప్పుడు ఇలాంటి ఆర్టికల్ రాయలేదు.
    ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టండి ఏపీలో అన్వసరం అన్నప్పుడు ఇలాంటి ఆర్టికల్ రాయలేదు.
    వివేకా హత్య చేసింది చంద్రబాబు అని అన్నప్పుడు ఇలాంటి ఆర్టికల్ రాయలేదు
    లడ్డులో గోరమైన కల్తీ జరిగింది ఇది తప్పు అన్నప్పుడు బలే రాసావే.. మనదీ Patent వినాసకాలే విపరీత బుద్ది
  7. What made Jagan change the ghee supplier? Why cow ghee is coming at such low cost ? Has anyone questioned this Christian CM what business he has in Indian Temples? Why did he appoint another Christian relative as TTD chairman? We Hindus are tolerating everything these Christians and Muslims are doing to destroy sanathana dharma and our beliefs.

    1. Hello Boku …. As per law tender lo evaru low ki coat chesthey valla ke istharu…nuv kuda antha kante low coat chesi tender dakinchukovachu…antha matrana aa tender theeskuna valu quality Leni supply cheyamani kaadu…pachakamerlatho kakunda normal person ga alochisthey nijama kada thelusthadi

  8. Babu got into over confidence that whatever he says people believe as he enjoys mighty media and planned a plot to hurl mud on opponents so that he can make way for lokesh with no competitor

  9. ఒక హోటల్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడి చేసి కల్తీ చేయడానికి సిద్ధంగా ఉన్న పదార్ధాలను కనుగున్నాడు

    కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు & మీడియాలో వార్తలు: ఆ హోటల్లో కల్తీ జరుగుతుంది

    కొంతమంది జడ్జిలు: కస్టమర్స్ వాటితో చేసినవి తినలేదుగా. కస్టమర్లు తిన్న వాటిలో కల్తీ జరిగిందని రుజువైందా?

  10. ఒరే ఆరికట్ల తెగ చించుకొని ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాయమాకా కొంచెం ఓపిక పట్టు గురువారం వరకు ..

    1. సిట్ విచారణ ఆపమని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదు

    2. సిట్ విచారణ అయినా, సిబిఐ విచారణ అయినా, తప్పు చేసిన వాడు భయపడాలి..

    3. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన నెయ్యి వచ్చింది అనేది నిజం.. కోర్టు ఒప్పుకుంది.. టెస్ట్ లో తేలినట్టు కూడా కోర్టు ఒప్పుకుంది

    4. గతంలో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి వాడిన నెయ్యితో చేసిన లడ్డూ నుంచి వాసన వస్తున్నట్టు, నాణ్యత లేనట్టు భక్తులు చెప్పారని కూడా కోర్టు చెప్పింది.

    5. అంటే ఒక వేళ టెస్ట్ చేయకపోతే, ఈ నలుగు కూడా వాడేసేవారే కదా ?

    6. ఇక 50 ఏళ్ళు నుంచి నెయ్యి సప్లై చేస్తున్న నందినిని ఆపేసి, టెండర్ నిబంధనలు మార్చేసి AR డైరీకి ఇచ్చింది నిజం, వాళ్ళు జంతు కల్తీ నెయ్యి ఇచ్చింది నిజం.

    6. జంతు కొవ్వు వాడినట్టు ఆధారాలు ఏవి అని కోర్టు అడుగుతుంది. సిట్ విచారణ అందుకే కదా.. పట్టుబడిన నెయ్యి కంటే ముందు, ఎప్పటి నుంచి ఈ ఘోరం చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెల్చటానికే సిట్ వేసింది. పోనీ సిట్ మీద నమ్మకం లేకపోతే సిబిఐ , లేకపోతే FBI.. ఏది వచ్చినా, బయట పడుతుంది కదా..

    ఇక్కడ కోర్టు చెప్పింది, ఒక సియంగా మాట్లాడే ముందు, అన్నీ బేరీజు వేసుకుని మాట్లాడాలని.. ఆయన ప్రజల నుంచి గత 5 ఏళ్ళుగా వస్తున్న ఫీడ్ బ్యాక్ ని బట్టి మాట్లడారు.. జగన్ తిరుమలలో చేసిన దారుణాల పై పోరాడిన వాడిగా మాట్లాడారు.. అలాగే తన ముందుకి వచ్చిన రిపోర్ట్ ని చూసి ఆధారాలతో మాట్లాడారు.

  11. ఒరే ఆరికట్ల తెగ చిం చు కొని ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాయమాకా కొంచెం ఓపిక పట్టు గురువారం వరకు ..

    1. సిట్ విచారణ ఆపమని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదు

    2. సిట్ విచారణ అయినా, సిబిఐ విచారణ అయినా, తప్పు చేసిన వాడు భయపడాలి..

    3. పం ది కొ వ్వు, గొ డ్డు కొ వ్వు కలిసిన నెయ్యి వచ్చింది అనేది నిజం.. కో ర్టు ఒప్పుకుంది.. టెస్ట్ లో తేలినట్టు కూడా కో ర్టు ఒప్పుకుంది

    4. గతంలో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి వాడిన నెయ్యితో చేసిన లడ్డూ నుంచి వాసన వస్తున్నట్టు, నాణ్యత లేనట్టు భక్తులు చెప్పారని కూడా కో ర్టు చెప్పింది.

    5. అంటే ఒక వేళ టెస్ట్ చేయకపోతే, ఈ నలుగు కూడా వాడేసేవారే కదా

    6. ఇక 50 ఏళ్ళు నుంచి నెయ్యి సప్లై చేస్తున్న నందినిని ఆపేసి, టెండర్ నిబంధనలు మార్చేసి AR డైరీకి ఇచ్చింది నిజం, వాళ్ళు జం తు క ల్తీ నెయ్యి ఇచ్చింది నిజం.

    6. జం తు కొ వ్వు వాడినట్టు ఆధారాలు ఏవి అని కో ర్టు అడుగుతుంది. సిట్ విచారణ అందుకే కదా.. పట్టుబడిన నెయ్యి కంటే ముందు, ఎప్పటి నుంచి ఈ ఘో రం చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెల్చటానికే సిట్ వేసింది. పోనీ సిట్ మీద నమ్మకం లేకపోతే సి బి ఐ , లేకపోతే F B I.. ఏది వచ్చినా, బయట పడుతుంది కదా..

    ఇక్కడ కోర్టు చెప్పింది, ఒక సియంగా మాట్లాడే ముందు, అన్నీ బేరీజు వేసుకుని మాట్లాడాలని.. ఆయన ప్రజల నుంచి గత 5 ఏళ్ళుగా వస్తున్న ఫీడ్ బ్యాక్ ని బట్టి మాట్లడారు.. జగన్ తిరుమలలో చేసిన దా రు ణా ల పై పో రా డి న వాడిగా మాట్లాడారు.. అలాగే తన ముందుకి వచ్చిన రిపోర్ట్ ని చూసి ఆధారాలతో మాట్లాడారు.

  12. ఒ రే ఆ రి క ట్ల తె గ చిం చు కొని ఆ ర్టి క ల్స్ మీద ఆ ర్టి క ల్స్ రాయమాకా కొంచెం ఓపిక పట్టు గురువారం వరకు ..

    1. సి ట్ విచారణ ఆపమని సుప్రీం కో ర్టు ఎక్కడా చెప్పలేదు

    2. సి ట్ విచారణ అయినా, సి బి ఐ విచారణ అయినా, త ప్పు చేసిన వాడు భయపడాలి..

    3. పం ది కొ వ్వు, గొ డ్డు కొ వ్వు కలిసిన నెయ్యి వచ్చింది అనేది నిజం.. కో ర్టు ఒప్పుకుంది.. టెస్ట్ లో తేలినట్టు కూడా కో ర్టు ఒప్పుకుంది

    4. గతంలో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి వాడిన నెయ్యితో చేసిన లడ్డూ నుంచి వాసన వస్తున్నట్టు, నాణ్యత లేనట్టు భక్తులు చెప్పారని కూడా కో ర్టు చెప్పింది.

    5. అంటే ఒక వేళ టెస్ట్ చేయకపోతే, ఈ నలుగు కూడా వాడేసేవారే కదా ..

    6. ఇక 50 ఏళ్ళు నుంచి నెయ్యి సప్లై చేస్తున్న నందినిని ఆపేసి, టెండర్ నిబంధనలు మార్చేసి AR డైరీకి ఇచ్చింది నిజం, వాళ్ళు జం తు క ల్తీ నెయ్యి ఇచ్చింది నిజం.

    6. జం తు కొ వ్వు వాడినట్టు ఆధారాలు ఏవి అని కో ర్టు అడుగుతుంది. సి ట్ విచారణ అందుకే కదా.. పట్టుబడిన నెయ్యి కంటే ముందు, ఎప్పటి నుంచి ఈ ఘో రం చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని తెల్చటానికే సిట్ వేసింది. పోనీ సిట్ మీద నమ్మకం లేకపోతే సిబిఐ .. ఏది వచ్చినా, బయట పడుతుంది కదా..

    ఇక్కడ కో ర్టు చెప్పింది, ఒక సియంగా మాట్లాడే ముందు, అన్నీ బేరీజు వేసుకుని మాట్లాడాలని.. ఆయన ప్రజల నుంచి గత 5 ఏళ్ళుగా వస్తున్న ఫీడ్ బ్యాక్ ని బట్టి మాట్లడారు.. జ గన్ తిరుమలలో చేసిన దా రు ణా ల పై పోరాడిన వాడిగా మాట్లాడారు.. అలాగే తన ముందుకి వచ్చిన రిపోర్ట్ ని చూసి ఆధారాలతో మాట్లాడారు.

  13. రాజకీయ నాయకులు అబద్ధాలు మాట్లాడుతారు. మనం నిజాయితీ గా మాట్లాడాలి. నిజాయితీ లేనప్పడు మాట్లాడటం waste.

  14. ఒరేయ్ గడిదా తిరుమల లో జగన్ అనే దరిద్రుడు అన్నీ తప్పులే చేశాడు అందరకీ తెలుసు

Comments are closed.