ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకోగానే తిరుమలకు వెళ్లారు. దైవ దర్శనం అనంతరం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వం ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తుందని గొప్పగా చెప్పారు. వైసీపీ హయాంలో పరిపాలన గాడి తప్పిందని, దాన్ని సరైన మార్గంలో పెడతానని బాబు చెప్పిన మాటల్ని జనం నమ్మారు.
అయితే బాబు మాటలకు, చేతలకు చాలా తేడా కనిపిస్తోంది. తాజాగా రూ.2 లక్షల వేతనంతో టీటీడీలో పని చేసేందుకు ముగ్గురు మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ ఉద్యోగులు కావాలని ఒక కార్పొరేషన్ సంస్థ తరపున నోటిఫికేషన్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఉద్యోగానికి ఎంపికైన వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.
ఇదిలా వుండగా ఈ ఉద్యోగ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో టీటీడీ సొమ్మును తన వాళ్లకు దోచిపెట్టేందుకు కూటమి సర్కార్ అవసరం లేకపోయినా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగుల్ని నియమించుకోడానికి నోటిఫికేషన్ ఇవ్వడంపై రెగ్యులర్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఎంబీఏ పట్టభద్రులై, 10 నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన వారు అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈవో, అడిషనల్ ఈవో, లేదా జేఈవో కార్యాలయంలో పని చేయాల్సి వుంటుంది. కేవలం టీడీపీకి చెందిన ముఖ్యుల సంబంధీకులను ఇప్పటికే రెడీ చేసుకుని, మొక్కుబడిగా ప్రకటన ఇచ్చినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే చంద్రబాబు ఆరోపణలతో కూటమి అభాసుపాలైంది. ఇప్పుడు ఇలాంటి ఉద్యోగ ప్రకటనలతో మరింతగా చెడ్డపేరు తెచ్చుకునే అవకాశం వుంది. తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో ఇచ్చే సొమ్మును, ఇలా తమ వాళ్లకు రకరకాల పేర్లతో అప్పనంగా కట్టబెడుతుండడం ఏ ప్రక్షాళనకు సంకేతమో చంద్రబాబే చెప్పాలి.
Call boy jobs available 9989793850
vc available 9380537747
ఎరా 2 లక్షల కోసం ఆర్టికల్ రాసావు .. జగన్ ప్రభుత్వం లో సలహాదారుల పేరుతో వందల కోట్లు దోచారు గా అప్పుడు రాలేదా నీ చెయ్యి
Vadu thinnafu kabatti meeru thinali antav….super
జగన్ చేసినట్లే చంద్రబాబు కూడా చేస్తున్నాడు అని రాసుంటే పద్ధతిగా ఉండేది.
వాడు వందల కోట్లు తిన్నప్పుడు మేము వేల కోట్లలో తినొద్దా?
మేము తినాలి అని కాదు .వాడు రాసిన ఆర్టికల్ కి నేను నా వే లో సంధానం చెప్పాము .
Emo theliyadu gurthuku ledu