భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లో అలయ్‌బలయ్ విభేదాల్ని సృష్టించడం గమనార్హం. దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్, తెలంగాణ నాయకుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెళ్లడంపై సీపీఐలో భిన్నవాదనలు వినిపించాయి.
ప్రొఫెసర్ సాయిబాబా మృతికి కారణమైన జాతీయ అధికార పార్టీలో భాగస్వామిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను చూస్తూ … అలయ్‌బలయ్‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ గైర్హాజరు కాగా, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాత్రం వెళ్లడం చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పాల్గొనడం విశేషం.
అలయ్‌బలయ్‌కి వెళ్లకపోవడానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పిన కారణాలేంటో తెలుసుకుందాం.
తన రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మీరు అలయ్‌బలయ్ కార్యక్రమానికి రాలేనని, క్షమించాలని నారాయణ కోరారు. మీకు తెలుసు… ప్రముఖ మేధావి, ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నా అతన్ని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లారు. పదేళ్ల తర్వాత ఆయన్ని గౌరవ న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసిందని నారాయణ వెల్లడించారు.
తాను, తన పార్టీ ప్రొఫెసర్ సాయిబాబా రాజకీయాల్ని అంగీకరించకపోవచ్చని నారాయణ తెలిపారు. కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రపంచం నుంచి సాయిబాబాను దూరం చేయడానికి ప్రధాన కారణం రాజ్యమే అనడంలో సందేహం లేదన్నారు. మీరు పెద్దవారని, కానీ అంతిమంగా ఆ ప్రభుత్వానికే ప్రాతినిథ్యం వహిస్తున్నారని బండారుకు నారాయణ గుర్తు చేయడం గమనార్హం. ఆహ్వానానికి ధన్యవాదాలు తెలుపుతూనే, నిరసనగా మీ కార్యక్రమానికి తాను రాలేనని నారాయణ స్పష్టం చేశారు.
ఇదే విషయమై కూనంనేని స్పందన కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. రాజకీయాలకు అతీతంగా వేదికల్ని పంచుకుని, మానవత్వాన్ని చాటుకునే వేదిక అలయ్‌బలయ్ అని కూనంనేని సాంబశివరావు తెలిపారు. అందుకే తాను అలయ్‌బలయ్‌కి వెళ్లినట్టు ఆయన తెలిపారు. ఒకేపార్టీలోనే వైరుధ్యాలను గమనించొచ్చు.
Call boy works 9989793850