‘సంక్రాంతి’ సినిమా సంక్రాంతికే!

వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి రావడం అన్నది అల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. వెంకటేష్ సినిమా సంక్రాంతికి నడిచినట్లు మిగిలిన టైమ్ ల్లో నడవడం అంటే చాలా వరకు…

వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి రావడం అన్నది అల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. వెంకటేష్ సినిమా సంక్రాంతికి నడిచినట్లు మిగిలిన టైమ్ ల్లో నడవడం అంటే చాలా వరకు సినిమా మీద అధారపడి వుంటుంది. అదే సంక్రాంతికి అంటే ఈజీ వాక్. అయితే ఇక్కడ కూడా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అయితేనే అన్నది కండిషన్. సంక్రాంతి వస్తున్నాం అన్నది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అటు ఫన్, ఇటు యాక్షన్ మేళవించిన సినిమా.

అందుకే ఎలాగైనా సంక్రాంతికే రావాలని హీరో వెంకటేష్ పట్టుదలగా వున్నారు. దాంతో నిర్మాత శిరీష్ కూడా ఓకె అన్నట్లు తెలుస్తోంది. దీపావళికి ఓ అప్ డేట్ ఇస్తూ, విడుదల డేట్ అనౌన్స్ చేసే అవకాశం వుంది. ఒక దశలో సినిమాను తాను తీసేసుకుని, తమ సురేష్ బ్యానర్ ద్వారా వెంకటేష్ విడుదల చేసుకుంటారనే వార్తలు వినిపించాయి. కానీ సంక్రాంతికి, సరైన ఫ్యామిలీ సినిమా అని తెలిసిన తరువాత నిర్మాత శిరీష్/దిల్ రాజు ఎందుకు వదలుకుంటారు?

అందువల్ల నేరుగా సంక్రాంతికే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. పైగా అన్నీ తమ పంపిణీ సినిమాలే వుంటే, థియేటర్లు సర్దుబాటు చేసుకోవడానికి సులువు అవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్, బాలయ్య- సితార సంస్థ సినిమా రెండూ ఫిక్స్ అయివున్నాయి.

ఇక తేలాల్సింది గీతా సంస్థ నిర్మించిన థండేల్ సినిమా ఒక్కటే. అది సంక్రాంతి వస్తుందా, వెనుక్కు వెళ్తుందా అన్నది చూడాల్సి వుంది.

7 Replies to “‘సంక్రాంతి’ సినిమా సంక్రాంతికే!”

  1. This movie should be released for Sankranti as this may be a perfect family entertainer and title can be justified, although Dil Raju’ s Game changer is releasing for Sankranti 2025 that does not mean that another movie can’t be released,

    same case happened for 2023 Sankranti both Waltair veeraiah and Veersimhareddy from mytri movies releaser

  2. This is perfect family entertainer for Sankranti and title is Apt , for both movies Game changer and Sankranti ki vastunnam are produced by Dil Raju’ and there is no rule that two movies cannot be released at the same time from same producer, already in 2023 mytri movies produced both Waltair veeraiah and Veera simhareddy released at the same season .

  3. “ తమ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘దంగల్‌’ మూవీ రూ.2000 కోట్లు వసూలు చేసినప్పటికీ తమకు మాత్రం కోటి రూపాయిలు మాత్రమే అందాయని (హీనపక్షం 1900 కోట్లయినా ఇచుండాలని) భాజపా నేత మరియు రెజ్లర్‌ అయిన బబితా ఫొగాట్‌ కీలక ఆరోపణలు చేశారు.”

Comments are closed.