రియల్ ఎస్టేట్: హైదరాబాద్- అమరావతి

వాగ్దానం చేసిన ఏ పథకాలు ఇవ్వకుండా, అమరావతి అని చంద్రబాబు, ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తే జనం ఎలా ఓట్లేస్తారు

తెలుగువాళ్లకి ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాజధానులు. రాష్ట్రం రెండుగా విడిపోయి పదేళ్లయినా ఇప్పటికీ ఆంధ్ర ప్రజలకి, అక్కడి నాయకులకి హైదరాబాదే ప్రీతి. ఎందుకంటే దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలం నుంచీ హైదరాబాద్ ఎదుగుదల అంతా ఇంతా కాదు.

“మీ రాష్ట్రం మీకుంది కదా పోండి..” అని కొందరు తెలంగాణ వాదులు అన్నా, హైదరాబాద్ ప్రగతిలో తమ పాత్ర ఎంతో ఉందని, ఆంధ్రలో అన్ని ఊళ్లని వదిలేసి హైదరాబాదునే పెంచి పోషించామని, కనుక తమకు పూర్తి హక్కు హైదరాబాదు మీద కూడా ఉందని చెప్తారు ఆంధ్రులు. నిజానికి ఈ దేశంలో ఏ నగరంలోనైనా స్థిరపడే హక్కు అందరు భారతీయులకీ ఉంటుంది. వద్దని, పొమ్మని ఎవరు ఎవర్నీ అనడానికి వీల్లేదు.

అలాగని ఆంధ్రలో మరో నగరం లేదన్నట్టుగా అందరూ హైదరాబాదుకే వలసరావడం సరైనదా? విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుడితే, ఆ తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి దానిని వ్యతిరేకించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చేసిన మాట వాస్తవం. అలాగని తాను రాజధానిగా ఎంచుకున్న వైజాగునైనా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కి అనువైన ప్రాంతంగా క్రేజ్ తీసుకురాగలిగాడా అంటే అదీ లేదు.

ఎంతసేపూ ఆంధ్రులు హైదరాబాదులో ఇళ్లు కొనుక్కోవడం తప్ప, తెలంగాణ ప్రజలకి వైజాగులో ఇల్లు కొనాలన్న ఆలోచన ఎందుకు రాదు? అక్కడ సముద్రముంది, అందమైన నగరం, మంచి రోడ్లు, స్మార్ట్ సిటీగా పేరు, పర్యాటక స్థలం.. ఇన్ని ఉన్నా వైజాగ్ కి ఆ స్థాయి క్రేజ్ రాబట్టకపోవడం అందరి ముఖ్యమంత్రుల పెద్ద ఫెయిల్యూర్.

సరే.. ఇప్పుడు విషయానికొస్తే చంద్రబాబు కాస్త స్పీడుగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ కాలమే కలిసి రావట్లేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 26 వేల కోట్ల అప్పు తెచ్చారు. కానీ ఈ మధ్యన సంభవించిన వరదలు అమరావతి ఇమేజ్ ని దెబ్బ తీసాయి. అమరావతిలో పెట్టుబడులు పెడదామనుకున్న పెట్టుబడుదారులకి వేరే దారులు వెతుక్కునేలా చేసాయి. అయినప్పటికీ అవన్నీ మర్చిపోయేలా, అమరావతిపై ఆశక్తి పెంచేలా కొన్ని పనులు చేసుకొస్తున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా ఎపి ఫిల్మ్ ఫెడెరేషన్ వాళ్లకి అమరావతి, వైజాగ్, తిరుపతి మూడు ప్రాంతాల్లోనూ సువిశాలమైన ఫిల్మ్ క్లబ్ కట్టబోతున్నారట బాబుగారు. సభ్యులకి ఈ మూడు చోట్ల సౌకర్యాలు పొందే వెసులుబాటు ఉంటుందట. త్వరలోనే దీనికి శంకుస్థాపన జరగనుందని ఒక వార్త చలామణీలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిక్రియేషన్ కోసం ఫిల్మ్ నగర్ క్లబ్ లో శాశ్వత సభ్యత్వం కల్పించబడుతుందట. సువిశాల ప్రాంగణం, విశాలమైన లైబ్రరీ, క్రికెట్ నెట్, టెన్నిస్ కోర్టు, వాలీబాల్ కోర్టు, షెటిల్ కోర్టు, స్నూకర్ టేబుల్ తదితర స్పోర్ట్స్, జిమ్, యోగా సెంటర్, బార్ & రెస్టారెంట్, ఒపెన్ ఆడిటోరియం, ఒపెన్ ధియేటర్, స్విమ్మింగ్ పూల్, పంక్షన్ హాల్, గెస్ట్ రూమ్స్ తదితర వసతులతో అమరావతి కేంద్రంగా గుంటూరు జిల్లా తాడేపల్లి నందు ఫిల్మ్ నగర్ క్లబ్ ముందుగా ప్రారంభం జరుపుకుంటుందన్నది సినిమా రంగంలో చక్కర్లు కొడుతున్న వార్త.

సరే..దీనివల్ల ఒరిగేదేమిటని సామాన్యులు అడగొచ్చు. క్రమంగా ఈ క్లబ్ చుట్టూ స్థలాల విక్రయం, అక్కడొక ఫిల్మ్ నగర్ వస్తాయి. మార్కెట్ ధరకి నాలుగో వంతో, ఆరో వంతో రేట్లకి స్థలాలు ఇస్తుంటే కొనే సినిమావాళ్లు చాలామందే ఉంటారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ అలా పెరిగిందే కదా!

సినిమా వాళ్లకి కేటాయించి ఊరుకుంటే మిగిలిన వాళ్లు ఆగుతారా? అందుకే అడిగేదాకా ఆగకుండా జర్నలిస్టులకి, డాక్టర్లకి, ఇంజనీర్స్ కి, న్యాయవాదులకి ఇలా పంచుకుంటూ వెళ్లే తంతు నడుస్తుంది. హైదరాబాదులో జూబ్లీ హిల్స్ పెరిగింది ఇలాగే. ఎమ్మెల్యే కాలనీలు, ఎంపీ కాలనీలు ఎలాగూ ఉంటాయి. ఆల్రెడీ న్యాయమూర్తులకి కూడా ఒక కాలనీ కేటాయించడం జరిగింది.

సినిమా, మీడియా, బ్యూరోక్రాట్స్, న్యాయ శాఖ.. అందరూ వస్తే అమరావతి గురించి పాజిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. క్రమంగా రియల్ బూం రావడం, పెట్టుబడులు పెరగడం వంటివి జరుగుతాయి. పెద్ద కంపెనీలకి చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఎన్ని వందల ఎకరాలు కట్టబెట్టినా అమరావతి గురించి పాజిటివ్ టాక్ పెరగాలంటే సమాజాన్ని ప్రభావితం చేయగలిగే రంగాలకు ఆ ఎదుగుదల ఫలాలను అందించడం ఒక మార్గం. చంద్రబాబు అందులో సిద్ధహస్తుడు.

ఇక తెలంగాణ విషయానికొస్తే రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అని, “ఫ్యూచర్ సిటీ” అని రియల్ ఎస్టేట్ కి బూం తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఆయన ఎత్తుకున్న హైడ్రా చర్యలు, మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి కౌంటర్ ప్రొడక్టివ్ అవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేస్తే తప్ప ఆయన ఏ సిటీ అని చెప్పినా, ఎటువైపు అభివృద్ధి తలపెట్టినా ప్రజలకి, పెట్టుబడుదారులకి నమ్మకం కుదరడం కష్టం.

ముచ్చెర్ల వైపు ఫోర్త్ సిటీ ఒకెత్తైతే, మేడ్చల్ తూప్రాన్ మధ్యన ఓ.ఆర్.ఆర్ మరియు ప్రతిపాదిత ఆర్.ఆర్.ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) మధ్యన నూతన నగరం ఏర్పాట్లకు తెర లేపుతున్నట్టు కూడా వార్తలున్నాయి. ఆలోచనలు బానే ఉన్నాయి. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు టైపులో వివిధ శాఖల, రంగాల వాళ్లకి స్థలాల పంపిణీ చేసి ఆయా ప్రాంతాలకి క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు.

అయితే ఇక్కడొకటే టెన్షన్. 2027లో జమిలి ఎన్నికలంటున్నారు. అదే జరిగితే చంద్రబాబు, రేవంత్ రెడ్డిల పదవీకాలం అర్ధాంతరంగా ముగిసి ఎన్నికల రణానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. అంటే చేతులో ఇంకా రెండున్నరేళ్లే ఉన్నాయనుకోవాలి. ఇంత తక్కువ సమయంలో అనుకున్న లక్ష్యాల దిశగా వెళ్లడం, సాధించడం సాధ్యమా అనేది చూడాలి. ఎన్నికలయ్యాక మళ్లీ ప్రజలు తమకే పదవి కట్టబెడతారని ఎవ్వరూ అనుకోలేరు.

ఐదేళ్ల పాలనలో జగన్ కి రెండేళ్లు కరోనాలో పోయి, ఆ సమయంలో ఎంతో గొప్పగా సేవలందించాడని చెప్పుకున్నా, తక్కిన మూడేళ్లల్లో జనానికి స్కీములు పంచినా దారుణంగా ఓడించారు ప్రజలు. అలాంటిది వాగ్దానం చేసిన ఏ పథకాలు ఇవ్వకుండా, అమరావతి అని చంద్రబాబు, ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి కాలక్షేపం చేస్తే జనం ఎలా ఓట్లేస్తారు. కేవలం రియల్ ఎస్టేట్ వైపు దృష్టి సారిస్తే సరిపోదు. సామాన్యులకి కనీసం చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి.

ఆంధ్రలో అన్ని ఊళ్లల్లోనూ రోడ్లని బాగుచేయాలి. తెలంగాణలో హైడ్రా జనం మీద కాకుండా రాజకీయ కబ్జాదారుల మీద ఉక్కుపాదం మోపాలి. అప్పుడే ప్రజలకి నమ్మకం కుదిరేది, ప్రభుతం మీద సానుకూలత పెరిగేది. చేతిలో ఉన్న పుణ్యకాలంలో ఏ ముఖ్యమంత్రి ఎంత సాధిస్తాడో చూడాలి.

శ్రీనివాసమూర్తి

18 Replies to “రియల్ ఎస్టేట్: హైదరాబాద్- అమరావతి”

  1. అన్ని చంద్రబాబె చెయాలి, జగన్ మాత్రం పంచుతూ వొటుబంకు రాయజీలు చెస్తె చాలు అంటవా!

  2. జనం నీల బుర్రా బుధి లేకుండా పథకాల కోసం ఎదురు చూడటం లేదు. 11 వచ్చిన నీ తొక్కాలో బుర్రా కి ఇది అర్ధం కాలేదు

  3. జనానికి వారి జీవన ప్రమాణం పెరగాలి. దానికి ఉద్యోగాలు కావలి.

  4. Ga నువ్వొక logic missed… ఏ ఒక్కడూ పథకాలు claim cheyyatley….ఇసక వదిలేసి మంచి మందు పోస్తున్నాడు cbn…నువ్వు తప్ప beggers సైతం busy busy సంపాదనలో….తొక్కలో opinions నీవి…మారాల్సింది నువ్వు…ప్రజలు govt కాదు

  5. ఇలాNti వ్యతిరేక ఆలోచనల వల్ల మన పార్టీ సంక నాకి పోయింది .అమరావతి అభివృద్ధి అయితే ఎంత మంది కు ఉపాధి వస్తుంది. అప్పుడు మనం వేసే 10 వెలు 5 వెలు ఒక లెక్క లోకి రాదు

  6. అభివృద్ధి జరగాలి దానికి రియల్ ఎస్టేట్ ముద్ర వేయొద్దు పైగా మనకి అమరావతి ముఖ్యం

  7. RR gaadi debbaki hyderabad real estate allakallolam ayipoyindi. ika andaru AP new capital ki q kattalsinde. Congress hydra tho hyderabad real estate ki chesina damage antha intha kaadu.

  8. వైసీపీ ప్రభుత్వం ప్రజలను బురిడీ కొట్టిద్దాం అనుకుని వైసీపీ నే బురిడీ కొట్టింది.

    ఎవరు ఏమన్నా ఆంధ్ర ప్రదేశ్ దేశంలో డబ్బున్న రాష్ట్రం lo okati ..

    కావాలంటే ఎదో ఒక బ్యాంక్ లో డీమానిటైజేషన్ స్టేట్ మెంట్స్ ఉంటాయ్ తెప్పించుకుని చుడండి.

    పంటలు, పసు, aqua, NRI, మైన్స్, hrbers మొదలైనవి .. సంపద ఇప్పటికే ఉంది

    రియల్ ఎస్టేట్ లో, కంపెనీల తేవటం లో మాత్రమే మనం వెనుక ఉన్నాం… ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ విషయాల మీద దృష్టి పెడితే చాలు మిగతవి 20 ఏళ్ళు అన్నీ అవే వచ్చేస్తాయ్.

Comments are closed.