కొన్ని రోజుల కిందటి సంగతి. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా అట్టహాసంగా మొదలైంది. ఆ వెంటనే రెగ్యులర్ షూట్ అన్నారు, కానీ కుదర్లేదు. అక్టోబర్ నుంచి షూటింగ్ అన్నారు. కట్ చేస్తే, అక్టోబర్ నెల కూడా గడిచిపోతోంది.
నిజానికి ఈ నెలలో చిన్న షెడ్యూల్ పెట్టుకోడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడు. కానీ 2 ఇబ్బందులొచ్చాయి. వీటిలో ఒకటి ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడం, అతడు వార్-2 సినిమా సెట్స్ పైకి వెళ్లాడు.
నీల్ సినిమాకు, వార్-2కు లుక్ లో తేడాలు వస్తున్నాయి. అందుకే ముందుగా వార్-2 షెడ్యూల్ పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్. ఇక మరో సమస్య ఏంటంటే, మైత్రీ నిర్మాతలు ఇప్పుడు మరో పెద్ద సినిమాపై దృష్టి పెట్టే పొజిషన్ లో లేరు. వాళ్లకు కనీసం మరో నెల రోజులైనా టైమ్ కావాలి.
ఈ కారణాల వల్ల తారక్-నీల్ సినిమా సెట్స్ పైకి రాలేదు. తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే 2026 సంక్రాంతికి సినిమాను తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు నిర్మాతలు.
ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రష్మిక పేరు వినిపించింది. తాజాగా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇంకా ఎవ్వర్నీ ఫిక్స్ చేయలేదు.
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
ఎప్పుడు వచ్చినా థియేటర్ లో చూడం