పుష్ప 2 నాన్ థియేటర్ 420 కోట్లు!

పుష్ప 2 నాన్ థియేటర్ అదాయం 420 కోట్లు.. థియేటర్ అదాయంతో కలిపితేె 1000 కోట్ల బిజినెస్ జ‌రిగినట్లు అనుకోవచ్చని వెల్లడించారు

ఏ సినిమా బిజినెస్ కూడా అఫీషియల్ గా ప్రకటించరు. మీడియా సంస్థలు తెలుసుకుని రాసినా అది అఫీషియల్ కాదు. రోజులు మారుతున్నాయి, సినిమా వ్యాపారంలో బ్లాక్ తగ్గి వైట్ పెరుగుతోంది. నాన్ థియేటర్ ఇన్ కమ్ అన్నది పూర్తి గా వైట్ మీదే జ‌రుగుతుంది. ఇలాంటి నేపద్యంలో పుష్ప 2 నాన్ థియేటర్ అదాయం ఎంత అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు అధికారికంగా సమాధానం ఇచ్చారు నిర్మాత నవీన్ ఎర్నేని.

పుష్ప 2 నాన్ థియేటర్ అదాయం 420 కోట్లు అని నవీన్ ప్రకటించారు. థియేటర్ అదాయంతో కలిపితేె 1000 కోట్ల బిజినెస్ జ‌రిగినట్లు అనుకోవచ్చని వెల్లడించారు. పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించేందుకు మీడియా మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో అన్ని ప్రాంతాల నుంచి పుష్ప 2 బయ్యర్లు వచ్చారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, నార్త్ ఇండియా బయ్యర్లు హాజ‌రయ్యారు. అలాగే నైజాం, వెస్ట్ గోదావరి బయ్యర్లు కూడా వచ్చారు.

పుష్ప 2 సినిమా అలస్యం కావడానికి కేవలం బెటర్ మెంట్ కోసం తప్ప మరేం కాదని, అక్కడక్కడ కాస్త గ్యాప్ లు కూడా వచ్చాయని మైత్రీ రవి వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ ను సంప్రందించిన తరువతే విడుదల తేదీని ఓ రోజు ముందుకు జ‌రిపామన్నారు. ఓవర్ సీస్ లో బుధవారం విడుదలైతే అడ్వాంటేజ్‌ వుంటుందని ఇలా చేసామన్నారు. మన దగ్గర మిడ్ నైట్ షో లు వుంటాయన్నారు.

పుష్ప అనేది ఇప్పుడు ఓ బ్రాండ్ అని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ అన్నారు. నార్త్ బెల్ట్ తో పాటు ఈసారి వెస్ట్ బెంగాల్ లో కూడా విడుదల చేస్తున్నామని అనిల్ టాండన్ అన్నారు. కర్ణాటకలో రికార్డు సృష్టిస్తామని అభిలాష్ రెడ్డి చెప్పారు.

9 Replies to “పుష్ప 2 నాన్ థియేటర్ 420 కోట్లు!”

Comments are closed.