ఇకపై జానీ మాస్టర్ పరిస్థితేంటి?

కోరి వివాదాలు తెచ్చుకోవడం ఎందుకు, సినిమాను ఇబ్బందుల్లో పెట్టుకోవడం ఎందుకని కొంతమంది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది.

లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.. కేసు నమోదైంది.. జైళ్లో 2 వారాలకు పైగా ఉన్నాడు.. ఇప్పుడు బెయిల్ వచ్చింది.. ఈ దశ ఎవరికైనా ఇబ్బందికరమే. సెలబ్రిటీలకు ఇది మరింత ఇబ్బంది పెట్టే విషయం. జీవితంలో ఎవ్వరూ కోరుకోని ఈ స్టేజ్ ను చవిచూశాడు జానీ మాస్టర్.

గడిచిన కొన్ని రోజులుగా జానీ మాస్టర్ పై పుంఖానుపంఖాలుగా వార్తలు, కథనాలు, చర్చావేదికలు నడిచాయి. కొన్ని ఆడియో టేపులు, ఇంకొన్ని వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఈ వ్యవహారాన్ని ఎంతలా వాడుకోవాలో అంతలా సోషల్ మీడియా వాడేసుకుంది.

ఈ క్రమంలో చేతివరకు వచ్చిన జాతీయ అవార్డును కూడా కోల్పోయాడు జానీ మాస్టర్. ఇలా జీవితంలో బ్యాడ్ ఫేజ్ చూసిన ఈ కొరియోగ్రాఫర్.. ఇప్పుడు ఫ్రెష్ గా ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చాడు.

ఇకపై జానీ మాస్టర్ కు అవకాశాలు వస్తాయా? అతడు మరోసారి స్టార్ హీరోల సినిమాలకు పని చేయగలడా? టీవీ కార్యక్రమాల్లో కనిపించగలడా?

గతంలో వచ్చినట్టు ఈసారి అతడికి వరుసగా అవకాశాలు వస్తాయని చెప్పలేం. అలా అని రావని కూడా చెప్పలేం. ఎందుకంటే, పోలీస్ కేసులు, కోర్టు కేసులు చవిచూసిన చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు కెరీర్ లో వెనకబడిన దాఖలాలున్నాయి. ఇలాంటి వ్యక్తుల్ని ఇండస్ట్రీలో కొంతమంది ప్రోత్సహించరు, మరికొంతమంది మాత్రం కేవలం టాలెంట్ ప్రాతిపదికగా అవకాశాలిస్తారు కాబట్టి, ఆ కోవలో జానీ మాస్టర్ కు అవకాశాలు రావొచ్చు.

మరి పెద్ద హీరోల సంగతేంటి? ఇప్పటికే ఓ స్టార్ హీరో జానీ మాస్టర్ కు యాంటీ అయినట్టు, అతడిపై కేసు పెట్టిన బాధితురాలిగా అండగా ఉంటానని సందేశం పంపినట్టు కథనాలు వచ్చాయి. జానీ మాస్టర్ ను తమ సినిమాలోకి తీసుకుంటే ఎవరైనా ఏమైనా అంటారేమో.. ఓ సెక్షన్ విమర్శలకు దిగుతుందేమో.. మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయేమో.. ఇలా ఎన్నో అనుమానాలు, భయాలుంటాయి.

కోరి వివాదాలు తెచ్చుకోవడం ఎందుకు, సినిమాను ఇబ్బందుల్లో పెట్టుకోవడం ఎందుకని కొంతమంది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ అంటే ఇష్టపడే హీరోలు కొంతమందున్నారు. ఎవరేమనుకున్నా వాళ్లు తిరిగి తమ సినిమాల్లో ఛాన్సులివ్వడం గ్యారెంటీ.

రాజకీయంగా నిలదొక్కుకుంటాడా?

అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినీ జానాలకు మనసులో ఉన్నప్పటికీ బయటకు అనరు, రాజకీయాల్లో అలా కాదు. జానీ మాస్టర్ పై ఉన్న కేసును ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ విచ్చలవాడిగా వాడుకోవడానికి రాజకీయ నాయకులకు సర్వహక్కులుంటాయి. ఈ కోణంలో జానీ మాస్టర్ కు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. దీని కంటే ముందు, జనసేన పార్టీలో తన స్థానం ఏంటనేది ముందుగా జానీ మాస్టర్ ఓ అవగాహనకు రావాల్సి ఉంటుంది.

24 Replies to “ఇకపై జానీ మాస్టర్ పరిస్థితేంటి?”

  1. కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి జనం మర్చిపోయాక తిరిగి పాలిటిక్స్ లో ఆక్టివ్ అవుతాడులే పృథ్వి లాగా.

  2. గుంటూరు నించి పక్కా.. ఎన్ని కేసులు ఉంటే అంత ఫ్రీ పబ్లిసిటీ.. అంత హీరోయిసమ్.. అంత ఫ్యాన్ ఫాలోయింగ్.. అదీ మన సమాజ స్థితి…

  3. ఇయన urgent గా రాజకియల్లొకి వచ్చి పికెదెముంది

    వాళ్ళ నాయకుడికె ఎమి చెయ్యాలొ అర్థం కాక దీక్షలు చెసుకుంటున్నాడు

  4. అంటే ఏంట్రా నీ ఉద్దేశం, వాడు బయటికి వచ్చి జనసేన కేంద్ర కార్యాలయం ముందు ఎర్ర తుండుతో ఉరిపోసుకు చావమంటావా ఏంటి ?

  5. వేస్ట్ న్యూస్, పనేమీ లేదు మీకు, false కేసు కు ఇంత ఓవర్ తెలంగాణా పోలీస్ పనేమీ లేనట్లు, తెలంగాణా పోలీస్ అంతా డబ్బే, లేకుంటే ఎపుడో జరిగిన ఇన్సిడెంట్ కు ఇపుడు కేసులు ఏంది, తూ ఏమైపోతుంది తెలంగాణా సమాజం అండ్ పోలీస్

  6. కళాకారులుకి రాజకీయ నాయకులు అంత అదృష్టం ఉండదు. జైల్ జీవితం గడిపినా… అవినీతి ఆరోపణలు ఉన్నా… కిడ్నాప్ కేసు లు బహిరంగం గా అందరికీ తెలిసినా… జనాలు వారిని క్షమించి ఎన్నుకుంటూ ఉంటారు. కానీ కళాకారులకు ఒక మచ్చ పడితే అవకాశం ఇవ్వడానికి కూడా జనాలు జంకుతారు.

  7. బెయిలు వచ్చేసింది అంటే మేటర్ సెటిల్ అయ్యింది అని అర్ధం. ఎన్ని లక్షలు ముట్ట జెప్పాడో కానీ ఇక శిక్ష అయిపోయింది. మిగతా నాటకాలు న్యాయవాదులు వేస్తూ కాలయాపన చేసి, కేసులో బలమైన సాక్ష్యాలు లేవని తీర్పులిప్పిస్తారు. ఇదంతా షరా మాములేగా.

  8. పట్టుబడ్డ వ్యభిచారి, నకిలీదళిత ప్రభుత్వఉద్యోగికి సిగ్గుండదు. కోర్టులో లంచాలిచ్చి, బెయిలు లేదా స్టే తెచ్చుకుని అదే వృత్తిలో కొనసాగుతారని, మళ్ళి షరా మామూలే.. అంతా కుటుంబసభ్యులకు తెలుసు. కానీ కుటుంబసభ్యులను జడ్జీలు కోర్టుకు పిలిచి, నిజాన్ని అడిగి , నకిలీదళిత అని నిర్ధారించుకోవడం ఎప్పుడో మానేశారు. అంతా పోలీసులు,లాయర్లు కుమ్మక్కై వారి నకిలీబంధువులు, నకిలీ సాక్ష్యాలు, చనిపోయిన వారిపై బేతాళకథలు చెప్పి, అనుకూల మైన తీర్పులు వచ్చేటట్టు వారి జడ్జీలకు లంచాలిస్తారు. నాటకాలు ఎవరికి తెలియదు?

  9. వీడిదో కుక్క బతుకు…ఈ కుక్క కాట్లు తిన్నోళ్లు కోసం రాయకుండా కరిచిన కుక్కమీద జాలేంటిరా

  10. 16 నెలలు జై లు లో చిప్పకూడు తిన్నవాళ్ళే సీఎం లు అవ్వగా లేనిదీ .. ఈయన మల్లి కోలుకోలేదు అంటావా ?

Comments are closed.