హరీశ్ శంకర్ పై డబుల్ ప్రెషర్

పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తీస్తున్నాడు హరీశ్. తమిళ్ లో వచ్చిన తేరి సినిమాకు ఇది రీమేక్ అనేది ఓపెన్ సీక్రెట్. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికి సినిమా…

పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తీస్తున్నాడు హరీశ్. తమిళ్ లో వచ్చిన తేరి సినిమాకు ఇది రీమేక్ అనేది ఓపెన్ సీక్రెట్. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికి సినిమా రిలీజై ఉండేది. కానీ అలా జరగలేదు.

ఈ సినిమా ఇప్పటికే రిలీజైనట్టయితే కేవలం ఒకే ఒక్క సినిమా (తేరి)తో పోలిక ఉండేది. కానీ ఇప్పుడీ మూవీని 2 సినిమాలతో కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును.. తేరి సినిమాకు హిందీ రీమేక్ కూడా రెడీ అయింది. రిలీజ్ కు సిద్ధమైంది.

హిందీలో ఈ రీమేక్ పేరు ‘బేబీ జాన్’. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ట్రయిలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రయిలర్ బాగుంది, మాస్ జనాలకు ఎక్కేలా ఉంది. క్రిస్మస్ కానుకగా సినిమా థియేటర్లలోకి రాబోతోంది. కీర్తిసురేష్, వామికా గాబి హీరోయిన్లుగా నటించారు.

భవిష్యత్తులో ఏదో ఒక టైమ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ సినిమాను ఇటు తేరితో పాటు, అటు బేబీ జాన్ తో కూడా కంపేర్ చేయడం చేస్తారు ప్రేక్షకులు. బేబీ జాన్ హిట్టయినా, ఫ్లాప్ అయినా కంపారిజన్ మాత్రం తప్పనిసరి.

సాధారణంగా రీమేక్ ను మాతృకతో మాత్రమే పోలుస్తుంటారు. కానీ ఈసారి ఒకటికి 2 రీమేక్స్ అయ్యాయి. కాబట్టి ఇది కచ్చితంగా హరీశ్ శంకర్ కు అదనపు ఒత్తిడి కిందే లెక్క. తను అనుకున్న పాయింట్ ను పవన్ కల్యాణ్ తో ప్రజెంట్ చేస్తూనే, తేరి, బేబీ జాన్ లకు మించిన విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ ను అతడు తెరకెక్కించాల్సి ఉంటుంది.

తేరి సినిమాకు రీమేక్ అంటే ఒప్పుకోవట్లేదు హరీశ్ అండ్ గ్యాంగ్. కేవలం పాయింట్ మాత్రమే తీసుకొని, చాలా మార్పుచేర్పులు చేశామంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ను అసలు రీమేక్ గా చూడొద్దనేది వీళ్ల విజ్ఞప్తి. వీళ్లు చెప్పినంతమాత్రాన ప్రేక్షకులు ఈ 2 సినిమాలతో కంపేర్ చేయడం మానేస్తారా..!

8 Replies to “హరీశ్ శంకర్ పై డబుల్ ప్రెషర్”

Comments are closed.