ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లారు. కేంద్రంలోని పెద్దలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి, ఇతర పెండింగు ప్రాజెక్టుల గురించి చర్చించినట్టుగా వార్తలు వచ్చాయి. సహకార శాఖకు నిధుల విషయ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి.
కేవలం ఇంతేనా? ఈ విషయాలు మాట్లాడడానికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారా? కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే హడావుడిగా బయల్దేరి ఢిల్లీ వెళ్లినది ఇందుకేనే అనే రకరకాల అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడ వెనుక సీక్రెట్ ఎజెండా మరొకటి ఉన్నదని కూడా అనుకుంటున్నారు.
సరస్వతీ పవర్ భూములను ఆలంబనగా చేసుకుని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలని పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. వారి కుటుంబ తగాదాగా ఈ వివాదం బయటకు వచ్చిన రోజునే పవన్ కల్యాణ్ అప్రమత్తమై సరస్వతీ పవర్ కు చెందిన వాటిలో ప్రభుత్వ భూములు ఉన్నాయేమో చూడాలని అధికార్లను ఆదేశించారు.
రెండురోజులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు లేవని ఎమ్మార్వో తేల్చిచెప్పారు. అయితే ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత.. అక్కడ అటవీ భూములు ఉన్నట్టు ప్రజలు చెప్పారని పవన్ కొత్త పాట అందుకున్నారు. రైతులు తిరిగి భూములు అడుగుతున్నారని చెబుతున్నారు. ఆమేరకు జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది.
దానికి తోడు ఏ విషయంలో అయితే జగన్ అనుచరులు భయపడుతున్నారో దాన్ని నిజం చేయాలని కూడా పవన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. తల్లికి గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన వాటాలు చేతులు మారితే నిబంధనలు ఉల్లంఘించినట్టు అయి, బెయిలు రద్దవుతుందనేది జగన్ వర్గం చేస్తున్న వాదన. అందుకే ఆ డీడ్ చెల్లకుండా చేయాలని ట్రిబ్యునల్ కు వెళ్లారు. అయితే ఆస్తులు ఈడీ కబ్జాలో ఉండగా ఎంఓయూ చేయడం కూడా ఉల్లంఘనే కదా.. అందుకే బెయిలు రద్దు కావాలి కదా అని షర్మిల వాదించారు.
ఇప్పుడు అవే మాటలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దయ్యేలా పావులు కదపడానికి పవన్ కల్యాణ్ అమిత్ షా తో కలిసి మంత్రాంగం నడిపినట్టు తెలుస్తోంది. ఎటూ వాళ్లు వ్యక్తంచేస్తున్న కారణమే గనుక.. బెయిలు రద్దుచేసినా.. ప్రజలకు రాజకీయకోణం ఉన్నదని అర్థం కాదని ఆయన చెబుతున్నట్టు సమాచారం.
నిన్నటిదాకా జగన్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ తనను కేసులనుంచి కాపాడుకోవడానికి వెళ్లినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళితే జగన్ ను మరింతగా కేసుల్లో ఇరికించడానికే అనే ప్రచారం షురూ అవుతోంది.
మొత్తానికి అన్నయ్యని శంకర గిరి మాన్యాలు పట్టిస్తారు అంటావ్
అమిత్ షా బాత్రూమ్ లో ఉండి విన్న సాక్షి చైర్మన్ భారతి ?
Good, arrest jagan like Trump n CBN got arrested previously
Call boy jobs available 9989793850
నిన్న ఆర్టికల్ లో పవన్ కి క్లాస్ పీకటానికి రమ్మన్నారు అని రాసావు కదా