విజయనగరం జిల్లాలో బొబ్బిలి సంస్థానాధీశుడిగా ఆ వంశం ప్రస్తుత తరంలో రాజకీయాల్లో రాణించిన వారుగా మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు ఉన్నారు. అయన బొబ్బిలి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ రాలేదు. ఆయన తమ్ముడు బేబీ నాయనకు అవకాశం ఇచ్చారు. విజయనగరం ఎంపీ సీటుకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయిస్తారు అని ప్రచారం సాగినా అది ఎందుకో జరగలేదు.
అలా సుజయ క్రిష్ణ రంగరావు రాజకీయానికి కొంత బ్రేక్ పడినట్లు అయింది. ఆయనకు రెండవ విడత నామినేటెడ్ పదవుల పంపిణీలో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పదవి దక్కింది. ఇది కేబినెట్ ర్యాంక్ పదవి అవునో కాదో తెలియదు.
అయితే మంత్రిగా కేబినెట్ ర్యాంక్ పదవిలో ఉంటూ అదే కీలకమైన శాఖలకు మంత్రిగా గతంలో పనిచేసిన రంగారావుకు నామినేటెడ్ పదవి ఇవ్వడం ఆయనకు తగిన న్యాయం జరిగినట్లేనా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.
ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని కూడా ఆ మధ్య దాకా ప్రచారం సాగింది. మంత్రిగా చేసిన వారిలో ఆయనకు ఈ పదవి ఇచ్చారు. మిగిలిన వారు అంతా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన ఆశావహులే ఎక్కువగా ఉన్నారు.
రానున్న ఎన్నికల్లో అయినా కీలక అవకాశాలు ఆయనకు ఉంటాయని అనుచరులు అభిమానులు భావిస్తున్నారు. ఇపుడు ఆయనకు దక్కిన ఈ పదవి ఆయనకు ప్రమోషనా లేక డిమోషనా లేక ప్రోత్సాహమా అన్నది మాత్రం అంతా తర్కించుకునే పరిస్థితి అయితే ఉంది.
ఇదే అన్నయ్య ఇచ్చి ఉంటే ఆహా ఓహో ఆయనకి ప్రమెషన్ దక్కింది అని రాసేవారు కదా..
vc available 9380537747
ఈ తొక్కలో లాజిక్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి సీనియర్ ఉండగా లెల్ల అప్పి రెడ్డి లాంటి వాడిని పక్ష నేత గా చేసినప్పుడు రాలేదా?ఆ మాటకి వస్తే ఇప్పుడు మండలి పక్ష నేత అయిన బొత్స కన్నా కూడా ఉమ్మారెడ్డి సీనియర్
ఇది కాబినెట్ ర్యాంక్ పదవి అవునో కాదో తెలియదు //
ఇంకెందుకు రా నీ జర్నలిజం ?
నీ బాదేంటి బామ్మర్ది……
అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం…
వాళ్లకు లేని బాధ నీకేంటి,,,,,,, ఓహో ఇలా రెచ్చగొడితే మీ woner పార్టీ లోకి వస్తారనా నీ తాపత్రయం….
అది జరగదులేమ్మా…… ఎందుకంటె జగన్ కేవలం మీ లాంటి paytm కూలీలకు మాత్రమే నచ్చుతాడు.