వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాలంలో తీసుకున్న ప్రతినిర్ణయాన్ని రద్దు చేసేయడం, ఏదో ఒక విధంగా అది తప్పుడు విధానం అని ప్రచారం చేయడం మాత్రమే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తున్నదా అనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు సర్కారు ఇప్పటిదాకా.. జగన్ సర్కారు చేసిన పాలన వల్ల దెబ్బతిన్నాం అనే మాటలతోనే కాలం గడుపుతున్నది. అదే రీతిగా.. కొత్తగా నియామకం అయిన తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి కూడా గత ప్రభుత్వ కాలంలో జరిగిన నిర్ణయాలు అన్నీ కూడా లోపభూయిష్టాలు అని నిరూపించడానికి తాపత్రయపడుతున్నది.
భక్తులకు సౌకర్యంగా ఉన్న విధానాలను కూడా రద్దు చేసేసి వాటి గురించి మసిపూసి మారేడుకాయ చేసి.. అవినీతి జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేయడానికి సాహసిస్తున్నది. వివిధ రాష్ట్రాల టూరిజం శాఖలు, ఆర్టీసీ తదితర సంస్థల ద్వారా మంజూరు అయ్యే రూ.300 దర్శనం టికెట్ల కేటాయింపు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ.. ఆ విధానాలను పూర్తిగా రద్దు చేయడమే ఇందుకు తాజా నిదర్శనం.
గత ప్రభుత్వ కాలంలో టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలు, ఐఆర్సీటీసీ వంటి సంస్థలు, ఆర్టీసీ సంస్థల ద్వారా తిరుమలకు వచ్చే ప్రయాణికులు రూ.300 టికెట్లను ప్యాకేజీలో భాగంగా పొందే అవకాశం కల్పించింది.
రోజుకు మొత్తం 5400 టికెట్లు వీరందరికీ కలిపి కేటాయిస్తూ వచ్చారు. దీనివల్ల.. తిరుమలేశుని భక్తులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ఆయా రాష్ట్రాల టూరిజం సంస్థలు కూడా అభివృద్ధి చెందుతాయనేది ఆ నిర్ణయం వెనుక ఉన్న సంకల్పం. ఈ విధానం చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తూ వచ్చింది.
టూరిజం ప్యాకేజీలతో వచ్చే భక్తులకు ఇతర వసతులు కూడా టూరిజం శాఖలు కల్పించేవి. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుడా టూరిజం బస్సులో రావడం, వారు చూపించిన చోట స్నానపానాలు ముగించుకోవడం.. రూ300 ప్రత్యేక దర్శనం చేసుకోవడం.. తిరిగి అదే బస్సులో వెళ్లిపోవడం అనేది వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసేశారు.
ఆయా టూరిజం సంస్థల ప్యాకేజీ టికెట్లు విక్రయించే ఏజంట్లు రెండింతలు, మూడింతలు ధరలకు దర్శనం టికెట్లు అమ్ముతున్నారనే ఆరోపణల మీద ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొత్త పాలకమండలి వ్యవహారం చూస్తే.. తలనొప్పిగా ఉన్నదంటే తల తీసేద్దాం అనే ధోరణిలో ఉన్నదే తప్ప.. అందుకు మందు వేద్దాం అనే తీరుగా లేదని విమర్శలు వస్తున్నాయి. వీటిని రద్దు చేయడం వల్ల ప్రభుత్వరంగంలోని ఆయా రాష్ట్రాల టూరిజం సంస్థలకు నష్టం మాత్రమే కాదు. ప్రజలకు చాలా ఇబ్బంది కూడా.
టూరిజం ద్వారా వస్తే బస గురించి ఎలాంటి చింత కూడా లేకుండా స్నానపానాలు ముగించుకుని దర్శనం చేసుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడు రోజుకు 5400 టికెట్ల మేర భక్తులు బస కోసం, వసతి కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి. ఇదంతా తిరుమలలో మరింత గందరగోళం సృష్టించడానికి కారణం అవుతుంది. ఏజంట్లు ఎక్కడైనా బ్లాకులో అమ్ముతున్నారంటే.. అలాంటి పోకడల్ని కట్టడి చేయడానికి మార్గాలు చూడకుండా.. ఏకంగా టూరిజం ద్వారా టికెట్ల విక్రయాలనే రద్దు చేసేయడం తగదని పలువురు అంటున్నారు. టీటీడీ ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని కోరుతున్నారు.
Ivi regular ga velle vaalaki difference thelusthundhi
This is really bad
vc available 9380537747
నేను ఏపీ/ తెలంగాణ టూరిజం ద్వారా కొన్ని సార్లు వివిధ ప్యాకేజీలలో తిరుమలకు వెళ్లి వచ్చాను. దర్శనం, వసతి గురించి ఏ చింతా లేకుండా చక్కగా యాత్ర జరిగిపోయింది.
ఇది రద్దు చేస్తే నాలాంటి నిజమైన యాత్రికులకు ఇబ్బందే…
నిజంగా తప్పలు వుంటే సరిచేయాలిగాని, తీసేశాంటం అంటం కరెక్ట్ కాదు. టూరిజం ప్యాకేజీ, 2019 ముందుకూడా cnb హయాంలో కూడా వుంది. Actually it is very convenient.
ఇది ఒకరకంగా తప్పుడు నిర్ణయం అనిపిస్తోంది..
పోయినసారి మేము వాడుకున్నాము… ఆఖరి నిమిషం లో ప్రయాణం వల్ల… 1500 పెట్టి కొన్నాము..
ఒక రకంగా చుస్తే.. లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది..
ఇంకోరకం గా చుస్తే.. దర్శనం దొరికింది డబ్బులు పోయినా అనిపిస్తుంది
Call boy jobs available 7997531004
Call boy works 7997531004