కమెడియన్ కు కోటి రూపాయలు

ఒక్కోసారి అంతే.. చిత్రాలు జరుగుతుంటాయ్. చిన్న సినిమా అనుకుని ప్రారంభిస్తారు. అది కాస్తా పెద్ద సినిమాగా మారిపోతుంటుంది. వైవా హర్ష మంచి కమెడియన్. అయితే ప్రతి సినిమాలో ఓ మాదిరి పాత్రలే వుంటాయి. అంటే…

ఒక్కోసారి అంతే.. చిత్రాలు జరుగుతుంటాయ్. చిన్న సినిమా అనుకుని ప్రారంభిస్తారు. అది కాస్తా పెద్ద సినిమాగా మారిపోతుంటుంది. వైవా హర్ష మంచి కమెడియన్. అయితే ప్రతి సినిమాలో ఓ మాదిరి పాత్రలే వుంటాయి. అంటే పది రోజులు, ఇరవై రోజులు షూట్ వుండేవి. అలా కాకుండా డెభై ఎనభై రోజులు షూట్ వుండే సినిమాలు కూడా అప్పడప్పుడు తగులుతుంటాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో వున్న పద్దతి ఏమిటంటే హీరో, హీరోయిన్లను పక్కన పెడితే మిగిలిన వారందంరికీ కాల్ షీట్ కు ఇంత రెమ్యూనిరేషన్ వుంటుంది. అది రోజుకు ముఫై వేల నుంచి మూడున్నర లక్షల వరకు వుంటుంది. నటుడి బట్టి, అతగాడి డిమాండ్ ను బట్టి ఈ రేటు అటు ఇటు మారుతూ వుంటుంది.

అయితే సినిమా మొత్తం ఫుల్ లెంగ్త్ రోల్ వున్నపుడు, డెభై ఎనభై రోజులు వర్క్ వున్నపుడు నిర్మాత, దర్శకుడు కలిసి ముందుగా మాట్లాడతారు. డైలీ కాల్ షీట్ లెక్కలు కాకుండా బల్క్ పేమెంట్ ఇచ్చేలా ఒప్పించుకుంటారు. దాని వల్ల రేటు తగ్గుతుంది. కానీ రాబోతున్న ఓ సినిమాకు ఇలా జరగలేదట. సారంగపాణి జాతకం అనే సినిమాలో వైవా హర్ష ది కీ రోల్. దాదాపు సెకండాఫ్ సినిమా అంతా అతగాడు వుంటాడు. దానికి చాలా వర్కింగ్ డేస్ కావాలి. కానీ బల్క్ గా బేరం ఆడడం మానేసి డైలీ కాల్ షీట్ల లెక్కన పే చేసారట.

దాంతో దగ్గర దగ్గర కోటి రూపాయల రెమ్యూనిరేషన్ ఈ ఒక్క సినిమాకే కిట్టినట్లు అయిందని సమాచారం. వైవా హర్ష కు మాత్రమే కాదు, ఇందులో నటించిన వెన్నెల కిషోర్ కు, మిగిలిన క్యారెక్టర్ నటులకు ఇలా డైలీ కాల్ షీట్ల లెక్కన మంచి కిక్కిచ్చే రెమ్యూనిరేషన్లు దక్కినట్లు తెలుస్తోంది.

సారంగపాణి జాతకం సినిమాకు దర్శకుడు ఇంద్రగంటి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రాసాద్. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలవుతుంది.

3 Replies to “కమెడియన్ కు కోటి రూపాయలు”

Comments are closed.