తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజం

కూట‌మి పాల‌న‌లో తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజం ప‌డింద‌ని ఆ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ చేశారు.

కూట‌మి పాల‌న‌లో తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజం ప‌డింద‌ని ఆ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ చేశారు. ప‌బ్‌ల పేరుతో అమ్మాయిల‌తో అశ్లీల నృత్యాలు చేయించే కార్య‌క్ర‌మాలు తిరుప‌తిలో నిర్వ‌హించ‌డం క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌న్నారు. తిరుప‌తిలో త‌న చిన్న‌ప్ప‌టి నుంచి రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో ప‌బ్‌ల పేరుతో అశ్లీల కార్య‌క్ర‌మాల గురించి ఎప్పుడూ విన‌లేదు, క‌న‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తిలో ప‌విత్ర‌త‌ను, విశిష్ట‌త‌ను కాపాడాల‌ని ఆయ‌న సీఎం చంద్ర‌బాబును కోరారు. తిరుప‌తిలో మ‌ద్యం విక్ర‌యాలు తెల్లవార‌క‌నే ప్రారంభిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌విత్ర‌మైన తిరుప‌తి న‌గ‌రంలో అశ్లీల‌, విశృంఖ‌ల కార్య‌క్ర‌మాలు విచ్చ‌ల‌విడిగా సాగుతున్నాయ‌న్నారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబునాయుడు తిరుప‌తి ప‌విత్ర‌త‌ను కాపాడుతా అని ప‌దేప‌దే చెబుతున్న సంద‌ర్భంలో ఇలాంటివి జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

తిరుప‌తిలో మ‌త్తు ప‌దార్థాలు, మాద‌క ద్ర‌వ్యాలు, డీజే సౌండ్లు, అమ్మాయిల‌తో డ్యాన్సులు తీవ్ర క‌ల‌త‌కు గురి చేస్తున్నాయ‌న్నారు. వీటిని ఆక్షేపించాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. వీటికి వ్య‌తిరేకంగా భ‌విష్య‌త్‌లో తమ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.

తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజాలు ప‌డ్డాయ‌ని, వీటిపై స్థానిక ప్ర‌జానీకం ఆలోచించాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. ఈ విష బీజాల్ని పెక‌లించాల‌న్నారు. ముఖ్యంగా తిరుప‌తి ఎస్పీ, ఎక్సైజ్ అధికారులు అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న కోరారు. స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధంగా ప‌బ్‌ల పేరుతో సాగుతున్న కార్య‌క‌లాపాల‌పై స‌నాత‌నం గురించి మాట్లాడే ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించాల‌ని భూమ‌న కోరారు.

19 Replies to “తిరుప‌తిలో దుష్ట సంస్కృతికి బీజం”

  1. CBN gaari Telugu desam party puttindhe liquor punaadula paina .. Rama rao nunchi party lakkovadaaniki CBN madyam syndicates tho kummakku ayyadu . Ramoji madya nishedha udyamam nadipinchi ntr ni padavi lo ki teesku vachi malli kulodayyadaniki idhi kudaa oka kaaranam

Comments are closed.