అల్లు అరవింద్ పరామర్శ

కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ అనే బాలుడ్ని ఎట్టకేలకు అల్లు కుటుంబం పరామర్శించింది. అయితే బాలుడ్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్ రాలేదు. ఆయన తరఫున అల్లు అరవింద్ హాస్పిటల్ కు వచ్చారు.

కేసు కోర్టు పరిధిలో ఉన్నందుకు అల్లు అర్జున్ రాలేకపోయారని, అతడి తరఫున తను వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం కూడా తమకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించిందని స్పష్టం చేశారు.

సంధ్యా థియేటర్ పై చర్చ

మరోవైపు సంధ్య థియేటర్ పై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. తొక్కిసలాటకు కారణమైన సంధ్య థియేటర్ చరిత్ర, దాని వైభోగంపై అంతా చర్చించుకుంటున్నారు. ఆ డిస్కషన్లు ఎలా ఉన్నాయంటే, సంధ్య థియేటర్ మూసేయడం ఖాయం అనేంతలా సాగుతున్నాయి.

హైదరబాద్-సికింద్రబాద్ జంట నగరాల్లోని ఫేమస్ థియేటర్లలో సంధ్యా ఒకటి. ముందుగా సంధ్యా 70ఎంఎం కట్టారు. ఓ ఏడాది గ్యాప్ ఇచ్చి 35ఎంఎం కట్టారు. 19982 నుంచి ఈ 2 థియేటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు చెబుతారు.

ఎంతోమంది తెలుగు హీరోలకు ఇది సెంటిమెంట్ థియేటర్. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత, సంధ్యా థియేటర్ కలెక్షన్లను కూడా ప్రత్యేకంగా చెప్పడం మొదలుపెట్టారు. అలా 4 దశాబ్దాలుగా ప్రేక్షలకు సినిమాలు అందిస్తున్న ఈ జంట సినిమా హాళ్ల లైసెన్లుల్ని రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు సమాధానం చెప్పాలంటూ పోలీసులు ఇప్పటికే షోకాజ్ నోటీసు అందించిన సంగతి తెలిసిందే.

చిక్కుల్లో బన్నీ ఫ్యాన్స్..

మరోవైపు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు కొంతమంది చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అల్లు అర్జున్ అరెస్టైన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొంతమంది బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనుచితంగా కామెంట్స్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు పోలీసుల దృష్టికెళ్లాయి.

కొంతమంది కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు, సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్ అభిమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. త్వరలోనే వాళ్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

One Reply to “అల్లు అరవింద్ పరామర్శ”

Comments are closed.