కూటమి మంత్రులలో కొత్త భయాలు?

ఉత్తరాంధ్రాలో విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలం గడిచింది. మంత్రుల పనితీరుని కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తూ వస్తున్నారు. వారికి అవసరమైన సలహా సూచనలు ఇస్తున్నారు. కొందరు మంత్రులు ఇంకా గాడిన పడలేదు అన్నది అంటున్నారు. మంత్రుల పనితీరు మీద నివేదికలు ప్రభుత్వ అధినేత వద్ద ఉన్నాయని అంటున్నారు. కొత్త ఏడాది మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

ఉత్తరాంధ్రాలో విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆయనను రెండవ మంత్రిగా తీసుకుంటారా లేదా మార్పులు ఈ జిల్లాలో జరుగుతాయా అన్నది కూటమిలో చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో ఒక మంత్రి పనితీరు మీద కూటమి ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేయలేకపోతున్నారు అని అంటున్నారు. ఇక్కడ మంత్రి పదవిపై సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఎస్ కోట ఎమ్మెల్యే లలితకుమారి, జనసేన నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, బొబ్బిలి నుంచి బేబీ నాయన ఉన్నారని అంటున్నారు.

ఉమ్మడి శ్రీకాకుళంలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఏకైక మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. రెండవ మంత్రిగా ఈ జిల్లా నుంచి ఎవరినైనా తీసుకుంటారా అన్నది కూడా కూటమిలో చర్చనీయాంశంగా ఉంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన నేపధ్యంలో మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ఆశలు పెరిగాయని అంటున్నారు.

2 Replies to “కూటమి మంత్రులలో కొత్త భయాలు?”

  1. ఫస్ట్ ప్రకాశం జిల్లా మంత్రి ని ఎత్తి కుప్పతొట్టిలో వెయ్యాలి .. ప్రతిదానికి లంచం లంచం .. ఎంత చీప్ గా అయ్యాడు అంటే చెప్పుకోవాడినికి కూడా సి గ్గు పడాలిసివస్తుంది .

Comments are closed.