ఈ మధ్యనే ఆమె మీద మావోలు గురి పెట్టారని వార్తలు వచ్చాయి. ఏకంగా మావోల పేరు మీద బయటకు విడుదల అయిన ఒక లేఖ సంచలనం సృష్టించింది. పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అందులో మావోలు హెచ్చరించారు. బాక్సైట్ తవ్వరాకలు ఆమె మద్దతు ఇస్తున్నారు అని కూడా ఆరోపించారు.
దాంతో ఫుల్ అటెన్షన్ లోకి వచ్చేసిన భాగ్యలక్ష్మి మీడియాలో కూడా నాటి నుంచి బాగా ఫోకస్ లో ఉంది. ఇదిలా ఉంటే ఆమెకు భద్రతను బాగా పెంచేసారు. ఇపుడు ఆమెను జగన్ కూడా టార్గెట్ చేశారు అని అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలో భాగ్యలక్ష్మికి మంత్రి పదవి దక్కుతుంది అని అంటున్నారు.
కొత్త జిల్లా అల్లూరి సీతారామరాజు కోటాలో మంత్రిగా భాగ్యలక్ష్మిని చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. భాగ్యలక్ష్మిది రాజకీయ కుటుంబం. ఆమె తండ్రి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె కూడా ఉన్నత విద్యాధికురాలు, ఎమ్మెస్సీ చదివారు. ఉత్తరాంధ్రాలోనే అత్యధిక మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున భాగ్యలక్ష్మి తొలిసారి గెలిచారు.
ఇపుడు ఆమెను మంత్రిని చేయడం ద్వారా ఏజెన్సీలో మరో మారు వైసీపీ జెండాను గట్టిగా ఎగరేయడానికి అధినాయకత్వం చూస్తోంది అంటున్నారు. మొత్తానికి చివరి నిముషంలో సమీకరణలు మారకుండా ఉంటే మాత్రం భాగ్యలక్ష్మి మంత్రి అవడం ఖాయమే అంటున్నారు.
G. A target matram kulam medha
endukuraa I paachi vaartalu..