యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా స్టార్ట్ అయింది ఈ రోజు. ఈ సందర్భంగా ఓ స్టిల్ వదిలారు. దాదాపుగా ఎప్పుడూ ప్రశాంత్ నీల్ కు అలవాటైన బ్లాక్ లేదా గ్రే టింట్ తోనే వుంది స్టిల్. స్టిల్ లో అంబాసిడర్ కారు, సైకిళ్లు, రోడ్ మీద అల్లర్లు జరిగిన దాఖలా కనిపించింది. ఇంతకీ ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నట్లు?
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా కథ 1960 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమా మొత్తం అదే నేపథ్యం. ఈ జనరేషన్ లోకి రావడం వుండదు. 1960ల్లో బెంగాల్ పరిస్థితుల నేపథ్యంలో రాసుకున్న కథను నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా మొత్తం ఒకటే జానర్ లో తీయడం వరకు ఓకె. ఒకటే టైమ్ పీరియడ్ లో అది కూడా 1960 టైమ్ పీరియడ్ లో సినిమా తీయడం అంటే కాస్త ఇంట్రస్టింగ్ వ్యవహారమే.
ఈ కథ కు తగినట్లు ఎన్టీఆర్ గెటప్ ఎలా వుండబోతోందో చూడాలి. 1960 కలకత్తా బ్యాక్ డ్రాప్ కనుక అలాంటి సెట్ లు వేయాల్సి వుంటుంది. గతంలో వింటేజ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నాని ఓ సినిమా చేసారు శ్యామ్ సింగ రాయ్ అంటూ. తరువాత ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తెలుగు సినిమాలు అన్నీ దాదాపు హిట్ నే.
Royal Bengal Young Tiger
ఈయన ( neel) బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి బయటకు రావటం లేదు . కొంచం colorful గా ఏమన్నా తీస్తే బాగుండు.
Nice