డ‌ర్టీయెస్ట్ పొలిటీషియ‌న్‌… గుర్తు తెచ్చుకో!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఇత‌రుల మాట‌లు అరువు తెచ్చుకోవ‌డంలో చంద్ర‌బాబు ఏ మాత్రం సిగ్గుప‌డ‌రు. ఇంకా చెప్పాలంటే త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిని సంబంధం లేని వాళ్లు విమ‌ర్శిస్తే … సంబ‌రప‌డుతూ వీడియోలు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఇత‌రుల మాట‌లు అరువు తెచ్చుకోవ‌డంలో చంద్ర‌బాబు ఏ మాత్రం సిగ్గుప‌డ‌రు. ఇంకా చెప్పాలంటే త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిని సంబంధం లేని వాళ్లు విమ‌ర్శిస్తే … సంబ‌రప‌డుతూ వీడియోలు ప్ర‌ద‌ర్శించ‌డం చంద్ర‌బాబుకే చెల్లింది. ఇదే త‌న గురించి పిల్ల‌నిచ్చిన మామ‌, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త ఎన్టీఆర్ ఏమ‌న్నారో ఒక‌సారి వీడియోలు చూస్తే… తాను విని త‌ట్టుకోగ‌ల‌నో లేదో ఒక్క‌సారి ఆలోచించుకుంటే మంచిద‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు.

తాజాగా వైఎస్ జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా జగన్‌ పాలనపై తెలంగాణ మంత్రి తీవ్ర విమర్శలు చేసిన వీడియోను విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌ద‌ర్శించారు.  తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడిన వీడియోను మీడియా ముందుకు తెచ్చారు. ఆ వీడియోలో  ‘ఆంధ్రాలో జగన్‌ రెడ్డి ఉన్నారు. అక్కడి వాళ్లు అడుక్కుతింటున్నారు. తెలంగాణ వస్తే మనం బిచ్చమెత్తుకుంటామన్నారు. వారు బిచ్చమెత్తుకుంటున్నారు. మన డబ్బు అక్కడికి పోదు. అప్పు లేకుంటే ఆ ప్రభుత్వా నికి రోజు గడవదు’  అని ప్రశాంత్‌ రెడ్డి చేసిన ఘాటు విమ‌ర్శ‌ల‌ను చూపించి, వినిపించి చంద్ర‌బాబు ఖుషీ అయ్యారు.

ఇదే సంద‌ర్భంలో సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబును నెటిజ‌న్లు ఉతికి ఆరేస్తున్నారు. 2018, డిసెంబ‌ర్‌లో కేసీఆర్ మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబును బండ‌కేసి చాకిరేవు పెట్టిన వీడియోను సోష‌ల్ మీడియాలో ప్ర‌ద‌ర్శిస్తూ ఘాటు కామెంట్స్ చేయ‌డం వైర‌ల్ అవుతోంది. ఆ రోజు కేసీఆర్ అన్న మాట‌లు విన్న త‌ర్వాత ఇంకా ప్రాణాల‌తో ఎలా వున్నావ్ చంద్ర‌బాబు అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నించ‌డం… ట్రోలింగ్ తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ఆ రోజు చంద్ర‌బాబుపై కేసీఆర్ విమ‌ర్శ‌లేంటంటే…

“చంద్ర‌బాబంత డ‌ర్టీయెస్ట్ పొలిటీషియ‌న్ ఈ దేశంలో ఎవ‌రూ లేరు. ఒరిస్సా సీఎం న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌ను, ఎల్ల‌య్య‌ను ఎందుకు క‌లిశావ‌ని ప్ర‌శ్నిస్తున్న చంద్ర‌బాబుకు నా సంగ‌తి ఎందుకు? నాలుగేళ్లు మోడీ సంక నాకుతావు. మోడీ ఒళ్లో కూచుంటావు. అప్పుడు నువ్వు చెబితే మేమంతా డ‌బ్బా కొట్టాల‌. ఒక‌రోజు ఉద‌యాన నీకు ఏదో ఉల్టా అయితాది. నువ్వు రాహుల్‌గాంధీ సంక నాకుతావు. మ‌ళ్లీ మేమంతా కాంగ్రెస్ వెంబ‌డి రావాల్నా?  నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావ‌డం లేదు. 

అస‌లు నువ్వు మాట్లాడే మాట‌ల్లో అర్థం వుందా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే ఈ డ‌ర్టీ పొలిటీషియ‌న్‌ను ఎట్లా భ‌రిస్తున్నారో. ఎన్ని ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడ్తాడు. చంద్ర‌బాబు అనే వ్య‌క్తి సిగ్గుప‌డాలి. మ‌నిషి అన్న త‌ర్వాత ల‌జ్జ‌, సిగ్గు ఉండాలి. హోదా వ‌స్తే ఏమొస్తుంద‌ని వాదించింది ఎవ‌రు? ఈ మ‌నిషే క‌దా” అంటూ బాబుపై నిప్పుల చెరిగిన వీడియోలు తాజాగా సోష‌ల్ మీడియాలో మ‌రోసారి వైర‌ల్ అవుతుండ‌డం విశేషం. 

ఎదుటి వాళ్ల‌ను తిట్టే ముందు, త‌న గురించి అంత‌కంటే ఘాటుగా విమ‌ర్శించ‌డాన్ని మ‌రిచిపోతే ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.