స్టార్ హీరో షారూక్ ఖాన్, హీరోయిన్ ప్రియాంక చోప్రా రిలేషన్ షిప్.. బాలీవుడ్ లో ఓ బహిరంగ రహస్యం. వీళ్లిద్దరూ కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారంటూ పుకార్లు ఉన్నాయి. అంతేకాదు.. తన భర్త సరసన నటించకుండా, తన పలుకుపడితో షారూక్ ఖాన్ గౌరి ప్రియాంకకు అవకాశాల్లేకుండా చేసిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కనపెడితే.. వీళ్లిద్దరికి సంబంధించి ఉన్న అతిపెద్ద పుకారు 'రహస్య వివాహం'. టొరంటోలో ప్రియాంకను షారూక్ పెళ్లి చేసుకున్నాడనే రూమర్లు కూడా ఉన్నాయి.
ఇలా షారూక్-ప్రియాంక వ్యవహారం బాలీవుడ్ లో ఓ పెద్ద ప్రహసనం. ఇప్పుడు ఈ పుకార్లను మరోసారి గుర్తుకు తెచ్చేలా వ్యవహరించింది ప్రియాంక చోప్రా. ఓ హాలీవుడ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా షారూక్ ప్రస్తావన తీసుకొచ్చింది.
తన కొత్త సిరీస్ సిటాడెల్ ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ కార్యక్రమానికి హాజరైంది ప్రియాంక. ఆ షోకు ఓ లెదర్ జాకెట్ వేసుకెళ్లింది. జాకెట్ బాగుందంటూ యాంకర్ అడగడమే ఆలస్యం, వెంటనే అందుకుంది ప్రియాంక.
“ఈ జాకెట్ నాకు ఎంతో స్పెషల్. ఇది నా ఎయిర్ పోర్ట్ జాకెట్. నిజానికి ఇది నాది కాదు. నా ఎక్స్-బాయ్ ఫ్రెండ్ జాకెట్ ఇది. అతడు నా నుంచి వెళ్లిపోయినా, ఈ జాకెట్ మాత్రం నా దగ్గరే ఉంచుకున్నాను.”
ఇలా ప్రియాంక చోప్రా లెదర్ జాకెట్ గురించి ప్రస్తావించిందో లేదో, వెంటనే గతంలో షారూక్ ఆ జాకెట్ వేసుకున్న స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఇదే కార్యక్రమంలో “ఇంకా అతడు టచ్ లోనే ఉన్నాడా” అంటూ యాంకర్ ప్రశ్నించగా.. అతడు టచ్ లో ఉంటే బాగుణ్ను అనే అర్థం వచ్చేలా స్పందించింది ప్రియాంక.
ప్రియాంక తాజా స్టేట్ మెంట్స్ తో షారూక్ తో ఆమె రిలేషన్ షిప్ గాసిప్స్ మరోసారి తెరపైకొచ్చాయి.