త్రిపుర అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియోలు చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'పోర్న్ వీడియోలు కావాలని చూడలేదని.. సడెన్ గా కాల్ వస్తే అదేంటో చూద్దామనేలోపే పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయని.. క్లోజ్ చేద్దామని ఎంత ట్రై చేసినా ఆగలేదని.. ఆ వీడియోలు కావాలని ప్లే చేయలేదని తనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధం'గా ఉన్ననన్నారు.
కాగా త్రిపుర రాష్ట్రంలోని బాగ్బాసా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జదబ్లాల్నాథ్ పోర్న్ వీడియో చూస్తూ కెమెరాకు పట్టుబడ్డారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. త్రిపురలో ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రజాసమస్యలపై చర్చించడానికి వేదికగా అసెంబ్లీని ఉపయోగించుకోవాల్సిన ఎమ్మెల్యే, అవేవీ పట్టించుకోకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా పోర్న్ వీడియో చూడడం ఏంటని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.
మరోవైపు బీజేపీ అంటే దేశ భక్తికి పర్యాయపదమైన పార్టీగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉన్న ఏకైక రాజకీయ పార్టీగా సంబంధిత నేతలు గొప్పలు చెప్పుకుంటుంటారు.. గతంలో కూడా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయారు.